దివంగత నటి శ్రీదేవి భర్త, ప్రముఖ సినీ నిర్మాత బోనీ కపూర్ ఇంటికి కరోనా భయం పట్టుకుంది. ఈ కుటుంబంలో కరోనా కలకలం రేపింది. ముంబైలోని బోనీ కపూర్ ఇంట్లో పని చేస్తున్న 23 ఏళ్ల యువకుడికి కరోనా లక్షణాలు కనిపించాయి. దాంతో వాళ్లంతా టెన్షన్ పడుతున్నారు. ఆ కుర్రాడికి లక్షణాలు కనిపించిన వెంటనే.. స్వయంగా బోనీ కపూర్ అతన్ని టెస్ట్‌ల నిమిత్తం పంపించాడు. దాంతో అతడికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని స్వయంగా బోనీ కపూర్ వెల్లడించాడు. అయితే తనకు గానీ.. తన ఇద్దరు కూతుళ్లకు గానీ ఎటువంటి కరోనా లక్షణాలు లేవని.. ఇంట్లోనే ఉంటున్నామని తెలిపాడు బోనీ కపూర్.

కుటుంబ సభ్యులతో శ్రీదేవి అరుదైన ఫోటో (Instagram/Photo)
తన ఇంట్లో పని చేస్తున్న మిగిలిన సిబ్బందికి కూడా కరోనా లక్షణాలు లేవని ఆయన క్లారిటీ ఇచ్చాడు. లాక్డౌన్ ప్రకటించినప్పటి నుంచి తాను గానీ.. జాన్వీ, ఖుషీ కపూర్ కూడా ఎవరూ బయటకు రాలేదని.. వెళ్లడం కూడా లేదని చెప్పాడు బోనీ.
Published by:Praveen Kumar Vadla
First published:May 19, 2020, 20:56 IST