జాన్వీ కపూర్ సౌత్ ఇండస్ట్రీ ఎంట్రీ పై తండ్రి బోనీ కపూర్ సంచలన వ్యాఖ్యలు..

తండ్రి బోనీ కపూర్‌తో జాన్వీ కపూర్ (File/Photo)

అతిలోక సుందరి శ్రీదేవి కూతురుగా ‘ధడక్’ మూవీతో బాలీవుడ్ మూవీతో ఎంట్రీ ఇచ్చింది జాన్వీ కపూర్. తాజాగా జాన్వీ కపూర్ సౌత్ ఇండస్ట్రీ ఎంట్రీ పై బోనీ కపూర్ స్పందించారు.

 • Share this:
  అతిలోక సుందరి శ్రీదేవి కూతురుగా ‘ధడక్’ మూవీతో బాలీవుడ్ మూవీతో ఎంట్రీ ఇచ్చింది జాన్వీ కపూర్. తొలి సినిమాతోనే తల్లి తగ్గ తనయురాలిగా తానేంటో ప్రూవ్ చేసుకుంది. ఇక జాన్వీ కపూర్ హీరోయిన్‌గా పరిచయం అయినప్పటి నుంచి ఆమె సౌత్ ఇండస్ట్రీలో ముఖ్యంగా తెలుగులో మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్ లేటెస్ట్‌గా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటించబోతున్న ‘ఫైటర్’ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించబోతున్నట్టు పుకార్లు షికార్లు చేసాయి. కానీ జాన్వీ కపూర్ మాత్రం ఇప్పటి వరకు ఏ సౌత్ ఫిల్మ్‌కు సైన్ చేయలేదు. దీనిపై రకరకాల ఊహాగానాలు మొదలైనాయి. జాన్వీ కపూర్‌కు ముందు నుంచి దక్షిణాది చలనచిత్ర పరిశ్రమ అంటే చిన్నచూపు. అందుకే ఇక్కడ ఆఫర్స్ వస్తున్నా.. కావాలనే ఇక్కడి సినిమాలను రిజెక్ట్ చేస్తున్నట్టు బీటౌన్‌లో ఒకటే వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా జాన్వీ కపూర్.. సౌత్ ఇండస్ట్రీ ఎంట్రీ పై వస్తున్న పుకార్లపై బోనీ కపూర్ స్పందించారు.

  boney kapoor sensational comments on janhvi kapoor south industry entry,boney kapoor,boney kapoor,Janhvi Kapoor,Janhvi Kapoor instagram,Janhvi Kapoor twitter,Janhvi Kapoor facebook,jhanvi kapoor,jhanvi kapoor,khushi kapoor,janhvi kapoor,boney kapoor angry,sridevi boney kapoor,boney kapoor shouting on khushi,arjun kapoor,anshula kapoor,jhanvi kapoor boney kapoor,jhanvi kapoor hot,khushi kapoor hot,sonam kapoor,sonam kapoor wedding,sridevi jhanvi kapoor,sridevi daughter jhanvi kapoor,jhanvi kapoor video,boney kapoor sridevi,janhvi kapoor birthday 2018,boney kapoor birthday,boney kapoor comments on janhvi kapoor south industry entry,Janhvi Kapoor south industry entry,tollywood,telugu cinema,జాన్వీ కపూర్,జాన్వీ కపూర్ బోనీ కపూర్,బోనీ కపూర్,జాన్వీ కపూర్ సౌత్ ఇండస్ట్రీ ఎంట్రీ పై బోనీ కపూర్ సంచనల వ్యాఖ్యలు,జాన్వీ కపూర్ పై బోనీ కపూర్ సంచలన వ్యాఖ్యలు,
  కూతురు జాన్వీ కపూర్‌తో బోనీ కపూర్ (File photo)


  తన పెద్ద కూతురు జాన్వీ కపూర్‌కు సౌత్ ఇండస్ట్రీ అంటే చిన్నచూపు అందుకే ఇక్కడి ఆఫర్స్‌ను తిరస్కరిస్తున్నట్టు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదు. నా భార్య దివంగత శ్రీదేవి దక్షిణాది నుంచి ఉత్తరాదిలో నెంబర్ వన్ హీరోయిన్ అయ్యారు. అంతేకాదు ఇక్కడ కృష్ణ, చిరంజీవి వంటి వారితో మా కుటుంబానికి మంచి అనుబంధమే ఉంది. ఇప్పటి వరకు జాన్వీ కపూర్‌కు సౌత్ ఇండస్ట్రీ నుంచి ఆమెకు నచ్చే కథలు రాలేదు. వస్తే మాత్రం తప్పకుండా ఇక్కడ సినిమాల్లో యాక్ట్ చేస్తుంది. నేను కూడా తమిళంలో ‘పింక్’ రీమేక్‌ను అజిత్‌ హీరోగా ‘నెర్కొండా పార్వాయి’ గా ఇక్కడ నిర్మించాను.మరో సినిమాను తెరకెక్కించే ప్రయత్నంలో ఉన్నాను. అలాంటిది జాన్వీ కపూర్‌‌కు దక్షిణాది చలన చిత్ర పరిశ్రమ అంటే ఎందుకు చిన్నచూపు ఉంటుంది. తాజాగా ‘బాహుబలి’ వంటి సౌత్ ఇండియా మూవీ దేశ వ్యాప్తంగా అన్ని హద్దులను చెరిపేసింది. ఇపుడు కొత్తగా సౌత్, నార్త్ ఇండస్ట్రీ అంటూ ఏమి లేవన్నాడు బోనీ కపూర్. మొత్తానికి తన కూతురు జాన్వీ కపూర్‌పై ఈ లాంటి పుకార్లు ఎలా పుడతాయో అంటూ బోనీ కపూర్ ఒకింత ఆవేదన వ్యక్తం చేసాడు.
  First published: