Prabhas - NTR - Allu Arjun: ఆ రోజుల్లో ప్రభాస్, ఎన్టీఆర్, అల్లు అర్జున్.. అనుబంధాల బొమ్మరిల్లు..

అల్లు అర్జున్ ప్రభాస్ ఎన్టీఆర్ (prabhas ntr allu arjun)

Prabhas NTR Allu Arjun: తెలుగు ఇండస్ట్రీలో హీరోలెప్పుడూ స్నేహితులే. వాళ్ల అభిమానులు మాత్రం శత్రువుల్లా కొట్లాడుకుంటారు. మాలో మేం బాగానే ఉంటాంరా బాబూ అని ఎన్నిసార్లు చెప్పినా కూడా అర్థం చేసుకోరు. ఇదేదో ఇప్పుడు వచ్చిన యూనిటి..

  • Share this:
తెలుగు ఇండస్ట్రీలో హీరోలెప్పుడూ స్నేహితులే. వాళ్ల అభిమానులు మాత్రం శత్రువుల్లా కొట్లాడుకుంటారు. మాలో మేం బాగానే ఉంటాంరా బాబూ అని ఎన్నిసార్లు చెప్పినా కూడా అర్థం చేసుకోరు. ఇదేదో ఇప్పుడు వచ్చిన యూనిటి కాదు ఎప్పట్నుంచో అలాగే ఉన్నారు మన హీరోలు. కావాలంటే సాక్ష్యం చూడండి.. తాజాగా 14 ఏళ్ల కింద ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 2006లో బొమ్మరిల్లు సినిమా ఆడియో వేడుకలో ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ ముఖ్య అతిథులుగా వచ్చారు. అప్పటికే ఎవరి సపరేట్ ఫాలోయింగ్ వాళ్లకు ఉంది. ఆది, సింహాద్రి లాంటి సంచలన విజయాలతో జూనియర్ ఎన్టీఆర్ స్టార్ అయిపోయాడు. ఇక గంగోత్రి, ఆర్య, బన్నీ హ్యాట్రిక్‌తో అల్లు అర్జున్ కూడా క్రేజీ హీరో అయిపోయాడు. ఛత్రపతి, వర్షం లాంటి సినిమలతో ప్రభాస్ కూడా మాస్ హీరో అయిపోయాడు. అలాంటి సమయంలో నువ్వొస్తానంటే నేనొద్దంటానా లాంటి క్లాస్ హిట్ కొట్టి అప్పుడే తెలుగు ఇండస్ట్రీకి వచ్చిన సిద్ధార్థ్‌ను ఎంకరేజ్ చేయడానికి అంతా కలిసి వచ్చారు. దిల్ రాజు నిర్మించిన బొమ్మరిల్లుతోనే భాస్కర్ దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఇప్పటికీ ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోయే బెస్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా బొమ్మరిల్లు నిలిచిపోయింది. ఈ చిత్రం 2006లోనే దాదాపు 25 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. ఆ సినిమా ఆడియో వేడుకలో బన్నీ, ప్రభాస్, తారక్ సందడి చేసారు. సిద్ధూతో వాళ్లు దిగిన నాటి ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ ఫోటో చూసిన వెంటనే అభిమానులు కూడా ఆ రోజుల్లోకి వెళ్లిపోతున్నారు.
Published by:Praveen Kumar Vadla
First published: