Bommarillu Bhaskar: ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ కోసం బొమ్మరిల్లు భాస్కర్ తీసుకున్న రెమ్యునరేషన్ ఇపుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. బొమ్మరిల్లు భాస్కర్ విషయానికొస్తే.. దిల్ రాజు నిర్మాణంలో సిద్ధార్ధ్, జెనీలియా హీరో, హీరోయిన్లుగా ప్రకాష్ రాజ్, జయసుధ ఇతర ముఖ్యపాత్రల్లో నటించిన ఈ సినిమా తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాగా తెలుగు ప్రేక్షకులను అలరించింది. ఈ సినిమాతో దర్శకుడిగా బొమ్మరిల్లు భాస్కర్ పేరు మారుమ్రోగిపోయింది. తండ్రీ కొడుకుల అనుబంధం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా సంచలన విజయం సాధించడమే కాకుండా ఎన్నో అవార్డులు రివార్డులు అందుకుంది. ఇలాంటి ఒక అద్భుతం విడుదలై 15 యేళ్లు పూర్తి చేసుకుంది. ఎలాంటి అనుభవం లేని తొలి సినిమా దర్శకుడు.. కేవలం ఒక్క విజయం మాత్రమే సాధించిన కథానాయకుడు సిద్ధార్.
హీరోయిన్ గా ఒకటి రెండు సినిమాలు తప్ప గుర్తింపులేని కథానాయికి జెనీలియా.. వరుస విజయాలతో దూసుకుపోతున్న నిర్మాత.. వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన సినిమా బొమ్మరిల్లు. ఇలాంటి ఒక కాన్సెప్ట్ తో సినిమా చేయడం అంటే చాలా కష్టం. ఎందుకంటే ఈ కథలో విలన్స్ ఉండరు. ఉన్న ప్రతి నాయకుడు నాన్న మాత్రమే. కానీ ఆయనలోనే ప్రేమ ఎక్కువగా ఉంటుంది.. బాధ్యత కూడా అంతే ఉంటుంది. ఒక్కోసారి ప్రేమ ఎక్కువైనా కూడా ఎలాంటి ఇబ్బందులు వస్తాయి అనేది ఈ సినిమాలో చాలా చక్కగా చూపించడమే కాకుండా సక్సెస్ అందుకున్నారు దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్.
Tollywood Brothers : సినీ ఇండస్ట్రీలో హీరోలుగా సత్తా చాటిన అన్నదమ్ములు.. నందమూరి టూ మెగా బ్రదర్స్..
ఈ సినిమా సక్సెస్‌తో భాస్కర్ పేరు కాస్తా బొమ్మరిల్లు భాస్కర్‌గా మారిపోయింది. కేవలం 72 ప్రింట్లు.. 130 థియేటర్లలో విడుదలైంది బొమ్మరిల్లు సినిమా. విడుదలైన ఉదయం ఆట నుంచే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. కలెక్షన్స్ కూడా అలాగే వచ్చాయి. తొలి వారంలోని రూ. 5 కోట్ల షేర్ వసూలు చేసింది ఈ సినిమా. అక్కడి నుంచి మొదలైన బొమ్మరిల్లు ప్రభంజనం 100 రోజుల వరకు కొనసాగింది.
Chiranjeevi Old Titles: ’రాజా విక్రమార్క’ సహా చిరంజీవి ఓల్డ్ టైటిల్స్‌తో వచ్చిన సినిమాలు ఇవే..
15 ఏళ్ల కింద ఈ సినిమా దాదాపు రూ. 22 కోట్ల షేర్ వసూలు చేసింది. అందులో మూడున్నర కోట్లకు పైగా ఓవర్సీస్ నుంచి కలెక్ట్ చేయడం ఒక సంచలనం. అప్పట్లో మరే సినిమాకు సాధ్యంకాని విధంగా విదేశాల్లో కూడా ఈ సినిమా అద్భుతమైన విజయం సాధించడమే కాకుండా కమర్షియల్ గానూ కోట్ల రూపాయలు తీసుకొచ్చింది. ఒకరకంగా చెప్పాలంటే ఓవర్సీస్ మార్కెట్ తెలుగు సినిమాకు ఓపెన్ అయింది బొమ్మరిల్లు సినిమాతోనే.
VijayaShanti : నందమూరి కుటుంబానికి విజయశాంతి భర్తకు మధ్య ఉన్న సంబంధం ఇదే.
ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్‌తో చేసిన పరుగు ఆశించిన ఫలితం అందుకోలేదు. ఆ తర్వాత రామ్ చరణ్‌తో ‘మగధీర’ సినిమా తర్వాత చేసిన ‘ఆరెంజ్’ సినిమా బాగున్నా.. ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది. ఆ తర్వాత రామ్‌తో ‘ఒంగోలు గిత్త’ సినిమా చేసిన ఫలితం రాలేదు. ఆపై తమిళంలో ‘బెంగళూరు నాటకల్’ సినిమా చేసారు. రీసెంట్‌గా అఖిల్‌తో చేసిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమా కోసం అల్లు అరవింద్.. ఈయనకు నెలకు రూ. 2 లక్షల రూపాయల జీతం ఇచ్చారు. ఈ సినిమా కోసం భాస్కర్ దాదాపు రెండున్నరేళ్లు కేటాయించారు.
ఈ లెక్కన ఈ సినిమా కోసం భాస్కర్ దాదాపు రూ. 60 లక్షల రూపాయల పారితోషకం అందుకున్నారు. అంతేకాదు సినిమా హిట్టైయితే.. రూ. 40 లక్షల రూపాయలు కింద అందనుంది. ఈ సినిమా రూ. 18 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్‌తో విడుదలైన బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల్లో అడుగు పెట్టింది. ఒక రకంగా బొమ్మరిల్లు భాస్కర్ తాను ఈ సినిమాతో హిట్టు అందుకోవడమే కాకుండా ఆరేళ్లుగా చకోర పక్షిలా హిట్ కోసం ఎదురు చూస్తోన్న అఖిల్‌కు హిట్ రుచి ఏంటో చూపించారు. మొత్తంగా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమా దర్శకుడికి, హీరోకు మంచి బ్రేక్ ఇచ్చిందనే చెప్పాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Akhil Akkineni, Bommarillu Bhaskar, Most Eligible Bachelor, Tollywood