Genelia D'Souza: కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. అందులో ఉన్న గమ్మత్తైన విషయాలు ప్రేక్షకులను బాగా ఆకర్షిస్తూ ఉంటాయి. ఇప్పుడు కూడా ఇదే జరుగుతుంది. బొమ్మరిల్లు బ్యూటీ జెనీలియా చేసిన ఓ వీడియోకు అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది.
కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. అందులో ఉన్న గమ్మత్తైన విషయాలు ప్రేక్షకులను బాగా ఆకర్షిస్తూ ఉంటాయి. ఇప్పుడు కూడా ఇదే జరుగుతుంది. బొమ్మరిల్లు బ్యూటీ జెనీలియా చేసిన ఓ వీడియోకు అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. తన భర్తను కొడుతూ తీసిన ఈ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. తన భర్త తన కళ్ల ముందే మరో హీరోయిన్‌కు ముద్దు పెట్టాడని.. కొడుతూ ఈ వీడియో తీసింది. అది సరదా కోసం చేసినా కూడా ఈ వీడియో మాత్రం ఇప్పుడు సంచలనం రేపుతుంది. అందులో ఏముందంటే.. ఓ అవార్డు ఫంక్షన్లో నటి జెనీలియాతో పాటు ఆమె భర్త రితేష్ దేశ్ ముఖ్ కూడా వచ్చారు. అక్కడ సీనియర్ హీరోయిన్ ప్రీతీ జింటా వాళ్లకు కలిసింది. దాంతో ప్రీతీ జింటా చేతులను పట్టుకొని ముద్దు పెట్టుకున్నాడు రితేష్. ఆ తర్వాత చాలా సేపు నవ్వుతూ మాట్లాడుతూనే ఉన్నాడు. ఇదంతా పక్కనే ఉన్న జెనీలియా అసౌకర్యంగా చూస్తుంటుంది. వాళ్ల చనువు చూసి మొహంలో అప్పుడే ఎక్స్ప్రెషన్స్ కూడా మారిపోతూ ఉంటాయి. తన భర్త వేరే అమ్మాయితో క్లోజ్‌గా ఉండడాన్ని జెనీలియా తట్టుకోలేకపోవడం ఈ వీడియోలో కనిపిస్తుంది. ఈ వీడియోను ఇప్పుడు స్పూఫ్ చేసింది జెన్నీ బేబీ. తనలో వచ్చిన ఆ కోపాన్ని ఎలా తీర్చుకుందో చూపించడానికి ఇప్పుడు వీడియోను విడుదల చేసింది. ఈ ఫంక్షన్ తర్వాత ఇంట్లో ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటున్నారా..? అంటూ మరో వీడియోను విడుదల చేసింది. ఇందులో జెనీలియా తన భర్తను కొడుతున్నట్లు ఫన్నీగా ఓ వీడియో చేసింది.
రితేష్ కూడా అదే రేంజ్లో ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నాడు. ఈ వీడియో చేసి తన భర్త రితేష్‌తో పాటు అక్కడ ఆయన కలిసి ప్రీతీ జింటాలను కూడా ట్యాగ్ చేసింది. వెంటనే స్పదించిన ప్రీతీ జింటా.. వెరీ ఫన్నీ అంటూ రిప్లై ఇచ్చింది. లవ్ యు బోత్ అంటూ పోస్ట్ పెట్టింది. అయితే ఈ అవార్డు వీడియో ఇప్పటిది కాదు.. 2019లో ఐఫా అవార్డ్స్‌కి సంబంధించింది. కానీ సోషల్ మీడియా పుణ్యమా అని ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతుంది. దాన్ని కూడా జెనీలియా ప్రమోషన్ కోసం వాడేసింది.
Published by:Praveen Kumar Vadla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.