మూవీ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్
నటీనటులు : నందు, రష్మీ గౌతమ్, కిరీటి, దామరాజు, రఘు కుంచె తదితరులు
ఎడిటింగ్: బీ.సుభాస్కర్
సినిమాటోగ్రఫీ: సుజాతా సిద్దార్థ్
సంగీతం: ప్రశాంత్ ఆర్ విహారి
నిర్మాతలు: ప్రవీణ్ పగడాల, బోస్ బాబు నిడుమోలు, ఆనంద్ రెడ్డి మద్ది, మనోహర్ రెడ్డి యెడ
కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: రాజ్ విరాట్
విడుదల తేదీ: 04 నవంబర్ 2022
ఈరోజుల్లో చిన్న సినిమాలు విడుదలైనా కూడా ప్రేక్షకుల దగ్గరికి వచ్చేలోపే థియేటర్ల నుంచి బయటకు వెళ్ళిపోతున్నాయి. ఇలాంటి సమయంలోనూ తమ ఉనికి చాటుకోవడానికి కొన్ని సినిమాలు ప్రత్యేకమైన ప్రమోషన్ తో ఆడియన్స్ ముందుకు వస్తున్నాయి. అలాంటి ఒక సినిమా బొమ్మ బ్లాక్ బస్టర్. నందు, రష్మి గౌతమ్ జంటగా నటించిన ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం..
కథ:
పోతురాజు ఒక మత్స్యకారుడు. ఆయనకు దర్శకుడు పూరి జగన్నాథ్ అంటే ప్రాణం. ఆయనపై ఉన్న అభిమానంతో ఒక కథ రాసుకొని ఎలాగైనా హైదరాబాద్ వెళ్లి సినిమా చేయాలి అనుకుంటాడు. అరవైపు నందకిషోర్ ఊర్లో అల్లరి చిల్లరగా తిరుగుతుంటాడు. అదే ఊర్లో ఉండే రష్మితో ప్రేమలో పడతాడు. ఆమె కోసం గొడవలు పెట్టుకుంటాడు. అదే సమయంలో పోతురాజు తండ్రి దారుణంగా హత్య చేయబడతాడు. అసలు ఆయన తండ్రిని చంపింది ఎవరు.. పోతురాజు, నందకిషోర్ మధ్య ఉండే కథ ఏంటి..? నందు తన ప్రేమ కథను ఎలా గెలిపించాడు ఇవన్నీ తెలియాలంటే అసలు కథలోకి వెళ్ళాలి..
కథనం:
ఈరోజుల్లో దర్శకులు పాత కథ తీసుకున్న కూడా చాలా కొత్తగా చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. అలాంటిది బొమ్మ బ్లాక్ బస్టర్ దర్శకుడు రాజ్ విరాట్ కొత్త పాయింట్ తీసుకున్నాడు. దాన్ని మరింత ఎక్సైటింగ్ గా చెప్పే ప్రయత్నం చేశాడు. అయితే ఈ ప్రయత్నంలో కొంతవరకు మాత్రమే సక్సెస్ అయ్యాడు. హీరోను పూరి జగన్నాథ్ శిష్యుడుగా చూపించడంతో.. సినిమా అంతా పూరి రిఫరెన్స్ లు బాగా కనిపిస్తాయి. తెలుగు సినిమా హీరోకి ఉండాల్సిన మాస్ లక్షణాలన్నీ తన హీరోలో బాగా దట్టించాడు రాజు విరాట్. ఒక దశలో పూరి జగన్నాథ్ సినిమా చూస్తున్నట్టు అనిపిస్తుంది. విలేజ్ బ్యాక్ డ్రాప్ ఇవ్వడంతో చూడడానికి కాస్త రిఫ్రెష్ గా అనిపిస్తుంది. ప్రతి సీన్ చాలా నెమ్మదిగా చెప్పడంతో కథలోకి వెళ్లడానికి చాలా సమయం పడుతుంది. ఫస్టాఫ్ అంతా చాలా స్లోగా వెళుతుంది. అసలు కథ మతం సెకండాఫ్ లోనే ఉంటుంది. ఒక్కసారి కథ మెయిన్ ట్రాక్ ఎక్కిన తర్వాత చివరి వరకు ఆసక్తికరంగానే తీసుకువెళ్లాడు దర్శకుడు రాజ్ విరాట్. క్లైమాక్స్ లో మళ్ళీ కాస్త గాడి తప్పాడు ఈయన. బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమాను చాలా వరకు పూరి జగన్నాథ్ ఇన్ఫ్లుయెన్స్ తోనే తెరకెక్కించాడు దర్శకుడు రాజ్ విరాట్. ఇది కూడా ఒకందుకు మంచికే అయింది. దీనివల్ల సినిమా కాస్త ఫాస్ట్ గా వెళ్ళిన ఫీలింగ్ కలుగుతుంది. మధ్యలో హీరో తండ్రి మర్డర్ కు గురి కావడం.. అక్కడి నుంచి కథ మరో మలుపు తీసుకోవడం ఇవన్నీ బాగానే ఉన్నాయి. నందు, రష్మి గౌతమ్ మధ్య లవ్ ట్రాక్ కూడా బాగానే నడిపించాడు దర్శకుడు రాజ్.
ప్లస్ పాయింట్స్:
నందు నటన
రష్మి గౌతమ్ గ్లామర్
సినిమాటోగ్రఫీ వర్క్
నిర్మాణ విలువలు
మైనస్ పాయింట్స్:
ఫస్టాఫ్
నెమ్మదిగా సాగే సన్నివేశాలు
నటీనటులు:
కథ మొత్తం హీరో చుట్టూనే తిరుగుతుంది కాబట్టి నందుకు చాలా రోజుల తర్వాత పర్ఫెక్ట్ క్యారెక్టర్ పడింది. పోతురాజు క్యారెక్టర్ కు ఈయన ప్రాణం పోశాడు. అదిరిపోయే మాస్ యాంగిల్ చూపించాడు. రష్మీ మరోసారి స్క్రీన్ మీద రెచ్చిపోయింది. తను గ్లామర్ షో తో సినిమాకు అదనపు బలం చేకూర్చింది. సంగీత దర్శకుడు రఘు కుంచే నటన బాగుంది. మిగిలిన వాళ్లంతా తమ పాత్రల పరిధి మేరకు నటించారు.
టెక్నికల్ టీం:
ప్రశాంత ఆర్ విహారి అందించిన సంగీతం జస్ట్ ఓకే అనిపించింది. పాటలు పర్లేదు. ఈ సినిమాకు ప్రధానమైన హైలైట్ సినిమాటోగ్రఫీ. సుజాతా సిద్దార్డ్ అందించిన కెమెరా వర్క్ సినిమా రేంజ్ ను పెంచేసింది. సుభాస్కర్ ఎడిటింగ్ పర్లేదు. ఫస్ట్ ఆఫ్ ఇంకాస్త ఫాస్ట్ గా ఉండాల్సింది. దర్శకుడు రాజ్ విరాట్ తనవంతు ప్రయత్నం బాగానే చేశాడు. బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమాకు ప్రధానమైన ఆకర్షణ నిర్మాణ విలువలు. విజయీభవ ప్రొడక్షన్ వాల్యూస్ చాలా ఉన్నతంగా ఉన్నాయి. ప్రవీణ్ పగడాల, బోస్ బాబు నిడుమోలు, ఆనంద్ రెడ్డి మద్ది, మనోహర్ రెడ్డి యెడ ఖర్చుకు వెనకాడకుండా ఈ సినిమా తీశారు.
చివరగా ఒక్కమాట:
బొమ్మ బ్లాక్ బస్టర్.. వినూత్నమైన ప్రయత్నం..
రేటింగ్: 2.75/5
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anchor rashmi gautam, Movie reviews, Telugu Cinema, Tollywood