• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • BOMMA ADHIRINDHI SHOW STOPPED DUE TO OTHER REASONS SAYS COMEDIAN VENU AK

ఆ షో అందుకే ఆగిపోయింది... జబర్ధస్త్ కమెడియన్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఆ షో అందుకే ఆగిపోయింది... జబర్ధస్త్ కమెడియన్ ఆసక్తికర వ్యాఖ్యలు

వేణు, నాగబాబు (venu nagababu)

Adhirindi: ఈ షో ఆగిపోవడానికి అనేక కారణాలు ఉన్నాయంటూ రకరకాల ఊహాగానాలు కూడా వినిపించాయి. జబర్ధస్త్‌కు పోటీగా ఉండే అదిరింది షో మళ్లీ టెలికాస్ట్ అయ్యే అవకాశం లేదనే ప్రచారం కూడా సాగింది.

  • Share this:
    జబర్ధస్త్‌ షో నుంచి బయటకు వచ్చిన నాగబాబు.. అదిరింది అనే షోలో పాల్గొన్నారు. జబర్ధస్త్‌గా పోటీగా రూపొందించిన ఈ కార్యక్రమం మంచి గుర్తింపు తెచ్చుకుంది. గతంలో జబర్ధస్త్ ద్వారా ఆడియెన్స్‌ను అలరించిన చమ్మక్ చంద్ర, వేణు, ధన్ రాజ్‌తో పాటు సద్దాం వంటి వాళ్లు ఈ షోను తమదైన శైలిలో ముందుకు తీసుకెళ్లారు. అయితే ఉన్నట్టుండి ఈ షో ఆగిపోవడంతో.. అదిరింది షో ఎందుకు ఆగిపోయిందనే విషయం ఎవరికీ అర్థంకాలేదు. మరోవైపు ఈ షో ఆగిపోవడానికి అనేక కారణాలు ఉన్నాయంటూ రకరకాల ఊహాగానాలు కూడా వినిపించాయి. జబర్ధస్త్‌కు పోటీగా ఉండే అదిరింది షో మళ్లీ టెలికాస్ట్ అయ్యే అవకాశం లేదనే ప్రచారం కూడా సాగింది.

    అయితే అసలు అదిరింది షో ఎందుకు ఆగిపోయింది. మళ్లీ ఎప్పుడు మొదలవుతుంది అనే అంశంపై రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు కమెడియన్ వేణు. ఆ ఇంటర్వ్యూలో చమ్మక్ చంద్రతో కలిసి పాల్గొన్న వేణు.. అసలు ఈ షో ఎందుకు ఆగిపోయిందనే దానిపై మాట్లాడాడు. అందరూ అనుకుంటున్నట్టు అదిరింది షో ఆగిపోలేదని వేణు అన్నాడు.

    ఆ షో టెలికాస్ట్ అయ్యే ఛానల్ జాతీయ ఛానల్ కావడంతో.. ఆ షోను సీజన్ వారీగా నిర్వహిస్తారని తెలిపాడు. రీసెంట్‌గా ఓ సీజన్ పూర్తయ్యిందని.. అందుకే షో ఆగిపోయిందని క్లారిటీ ఇచ్చాడు. మళ్లీ కొత్త సీజన్‌తో ఈ షో మొదలవుతుందని వేణు వెల్లడించాడు. అది ఎప్పుడు మొదలవుతుందనే విషయాన్ని మాత్రం ఈ కమెడియన్ చెప్పలేదు. మరోవైపు ఈ షో ఉన్నట్టుండి ఆగిపోవడంతో.. కొన్ని అనివార్య కారణాల వల్ల ముగిసిపోయిందనే ఊహాగానాలు వినిపించాయి. అయితే వేణు చెప్పిన దాన్ని బట్టి ఈ షో మళ్లీ ఎప్పుడో ఒకప్పుడు ప్రారంభయ్యే అవకాశం ఉందని అర్థమవుతోంది.
    Published by:Kishore Akkaladevi
    First published: