హోమ్ /వార్తలు /సినిమా /

Sushanth Singh: సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసులో.. హైదరాబాద్‌ వాసికి బెయిల్..!

Sushanth Singh: సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసులో.. హైదరాబాద్‌ వాసికి బెయిల్..!

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్

గత ఏడాది మే నెలలో సిద్ధార్థ్‌ను ఎన్సీబీ అరెస్ట్‌ చేసింది. సిద్ధార్థ్‌ డ్రగ్స్‌ రవాణా చేస్తున్నట్లు ఆధారాలు లేవని కోర్టు వెల్లడించింది.

బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ కేసులో హైదరాబాద్‌ వాసికి ఊరట లభించింది. సుశాంత్‌ సింగ్‌ రూమ్‌మేట్‌ సిద్ధార్థ్‌ పితానికి బెయిల్‌ మంజూరు చేసింది కోర్టు. గత ఏడాది మే నెలలో సిద్ధార్థ్‌ను ఎన్సీబీ అరెస్ట్‌ చేసింది. సిద్ధార్థ్‌ డ్రగ్స్‌ రవాణా చేస్తున్నట్లు ఆధారాలు లేవని కోర్టు వెల్లడించింది. బాంద్రాలో ఉన్న తన ఇంట్లో సుశాంత్ చనిపోయినట్లు ముంబయి పోలీసులు ధ్రువీకరించారు. అయితే, ఆయన ఆత్మహత్యకు గల కారణాలు తెలియలేదని, దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.సూసైడ్ నోట్ వంటిదేమీ దొరకలేదని ముంబయి పోలీసుల అధికార ప్రతినిధి డీసీపీ ప్రణయ్ అశోక్ చెప్పారు.

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య బాలీవుడ్లో కలకలం రేపింది. అతడ్ని హత్య చేశారంటూ పలువురు సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేశారు. పలువురు బాలీవుడ్ ప్రముఖ నటులపై కీలక ఆరోపణలు వచ్చాయి. సుశాంత్ ఆత్మహత్యకు పాల్పడినట్టు ఆయన ఇంట్లో పనిచేసేవారు సమాచారం అందించడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. మీడియా తెలిపిన వివరాల ప్రకారం బాంద్రా పోలీస్ స్టేషన్లో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ నౌకరు ఈ ఘటన గురించి సమాచారం ఇచ్చారు.టీవీ నటుడుగా కెరియర్ ప్రారంభించిన సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఇటీవల కొన్నేళ్లుగా వెండితెరపై తనదైన గుర్తింపు తెచ్చుకున్నాడు.

సుశాంత్ సింగ్ బిహార్‌లోని పట్నాలో 1986 జనవరి 21న జన్మించారు. సినిమాల్లోకి రాకముందు ఎన్నో టీవీ సీరియళ్లలో నటించారు.

కిస్ దేశ్ మే హై మేరా దిల్ అనే టీవీ సీరియల్‌తో అతని నటనా జీవితం ప్రారంభమైంది.జీటీవీలో 2009-11లో వచ్చిన పవిత్ర రిష్తా సీరియల్‌తో మంచి పేరు సంపాదించిన ఆయన 2013లో వచ్చిన కైపోచేతో సుశాంత్ బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. 2013లో వచ్చిన కైపోచేతో సుశాంత్ బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. అందులో తన నటనకు ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకున్నారు.తర్వాత సుశాంత్ శుద్ధ్ దేశీ రొమాన్స్, డిటెక్టివ్ బ్యోమకేష్ బక్షీ లాంటి సినిమాలు చేశారు. సుశాంత్ చివరిగా తన తల్లి ఫోటోను షేర్ చేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్టు పెట్టారు. ''మసకబారిన గతం కన్నీరుగా జారి ఆవిరవుతోంది. అనంతమైన కలలు చిరునవ్వును, అశాశ్వతమైన జీవితాన్ని చెక్కుతున్నాయి. ఆ రెండింటి మధ్యా బతుకుతున్నా' అని సుశాంత్ ఆ పోస్టులో రాశారు.

First published:

Tags: Sushant death, Sushant singh rajput case, Sushanth singh Rajputh

ఉత్తమ కథలు