Home /News /movies /

BOMB THREATEN CALLS TO AJITH KUMAR HOUSE IN CHENNAI AND POLICE STARTS INTERROGATION PK

Ajith: అజిత్ ఇంటికి బాంబు బెదిరింపు.. పోలీసులు అప్రమత్తం..

 అజిత్ (ajith kumar)

అజిత్ (ajith kumar)

Ajith: తమిళనాట వరసగా స్టార్ హీరోల ఇంటికి బాంబు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. మొన్నామధ్య రజినీకాంత్.. ఆ తర్వాత విజయ్ ఇంటికి ఇలా బెదిరింపు కాల్స్ వచ్చాయి.

తమిళనాట వరసగా స్టార్ హీరోల ఇంటికి బాంబు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. మొన్నామధ్య రజినీకాంత్.. ఆ తర్వాత విజయ్ ఇంటికి ఇలా బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఇప్పుడు మరో స్టార్‌ హీరో అజిత్‌ ఇంటికి బాంబు బెదిరింపు ఫోన్‌ కాల్‌ రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ముందు వచ్చిన రెండు కాల్స్ కూడా ఆకతాయిల పని అని తేలింది. ఇప్పుడు అజిత్ ఇంటికి కూడా బెదిరింపు కాల్ వచ్చింది. ఫోన్ కాల్ వచ్చిన వెంటనే చెన్నైలోని ఆయన నివాసం ఇజంబక్కంలో పోలీసులు తనిఖీలు చేసారు.
 అజిత్ (ajith kumar)
అజిత్ (ajith kumar)

పూర్తి తనిఖీకి ఇంకా రెండు గంటల సమయం పెట్టె అవకాశం ఉందని తెలుస్తుంది. జులై 18న అజిత్‌ ఇంటిలో బాంబు పెట్టినట్లు అజ్ఞాత వ్యక్తి నుంచి కంట్రోల్‌ రూమ్‌కు ఫోన్ వచ్చింది. ఆ వెంటనే పెట్టేసినట్లు పోలీసులు తెలిపారు. ఆ ఫోన్ వచ్చిన వెంటనే బాంబు స్వాడ్‌తో అజిత్‌ ఇంటికి చేరుకుని సోదాలు నిర్వహించారు. ఇప్పటికీ ఇంకా తనిఖీ కొనసాగుతోంది. ఫోన్‌కాల్‌పై ప్రత్యేక దృష్టిపెట్టి కారణాలను త్వరలోనే తెలుసుకుంటామని అధికారులు పేర్కొన్నారు.
 అజిత్ (ajith kumar)
అజిత్ (ajith kumar)

ఇది కూడా ముందు వచ్చినట్లుగా ఫేక్ కాల్ అని పోలీసులు అనుమానపడుతున్నారు. ఆ తర్వాత ఆరా తీస్తే ఫోన్‌ కాల్‌ తమిళనాడులోని విల్లుపురం జిల్లా నుంచి వచ్చిందని తెలుసుకున్నారు. వీలైనంత త్వరగా కచ్చితమైన లోకేషన్‌ను గుర్తించి అజ్ఞాతవ్యక్తిని అదుపులోకి తీసుకుంటామని పోలీసులు తెలిపారు. రజినీకాంత్‌కు ఫేక్ కాల్ చేసింది 8వ తరగతి పిల్లాడు.. ఆ తర్వాత విజయ్ ఇంటికి బాంబు బెదిరింపు కాల్ చేసింది అంగవైకల్యంతో ఉన్నవాడు.. మరిప్పుడు అజిత్ విషయంలో ఎలాంటి కాల్ వచ్చిందో అని ఆరా తీస్తున్నారు పోలీసులు.
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Ajith, Kollywood, Tamil Cinema

తదుపరి వార్తలు