విజయ్ ఇంటికి బాంబు బెదిరింపు.. అర్ధరాత్రి హై డ్రామా..

Thalapathy Vijay: ఎందుకో తెలియదు కానీ ఈ మధ్య తమిళ హీరోలకు బెదింరపు కాల్స్ ఎక్కువగా వస్తున్నాయి. మొన్నటికి మొన్న రజినీకాంత్ ఇంట్లో బాంబు ఉందంటూ బెదిరింపు కాల్ వచ్చింది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: July 5, 2020, 4:16 PM IST
విజయ్ ఇంటికి బాంబు బెదిరింపు.. అర్ధరాత్రి హై డ్రామా..
దళపతి విజయ్ (Thalapathy Vijay)
  • Share this:
ఎందుకో తెలియదు కానీ ఈ మధ్య తమిళ హీరోలకు బెదింరపు కాల్స్ ఎక్కువగా వస్తున్నాయి. మొన్నటికి మొన్న రజినీకాంత్ ఇంట్లో బాంబు ఉందంటూ బెదిరింపు కాల్ వచ్చింది. తీరా వెళ్లి చూస్తే అక్కడేం లేదు. పోనీ చేసింది ఎవరబ్బా అని ఆరా తీస్తే ఎనిమిదో తరగతి చదివే పిల్లాడు అలా ఫోన్ చేసి అందర్నీ కంగారు పెట్టాడు. ఇప్పుడు మరోసారి ఇలాంటి కాల్ వచ్చింది. ఈ సారి రజినీకాంత్ కాదు విజయ్ ఇంటికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. విజయ్‌ ఇంట్లో బాంబు పెట్టినట్లు ఓ అజ్ఞాత వ్యక్తి నుంచి ఫోన్ రావడంతో పోలీసులు అర్థరాత్రి ఆయన ఇంటికి చేరుకుని గాలించారు. చుట్టుపక్కల ప్రదేశాన్ని కూడా పూర్తిగా చెక్ చేసారు.
రజనీకాంత్ విజయ్ (Vijay Rajinikanth)
రజనీకాంత్ విజయ్ (Vijay Rajinikanth)

అక్కడ బాంబు ఎక్కడా దొరకలేదు. దాంతో ఊపిరి పీల్చుకున్నారు అభిమానులు కూడా. పోలీసులు ఇది కూడా ఫేక్ కాల్ అని నిర్ధారించారు. అయితే అర్ధరాత్రి పూట అలా చేసి ఎవరు ఆట పట్టించారనేది ఇప్పుడు ఆరా తీస్తున్నారు. ఆ అజ్ఞాతవ్యక్తి ఎవరో తేల్చే పనిలో బిజీగా ఉన్నారు పోలీసులు. ఈ విషయంపై విజయ్ కూడా అప్రమత్తంగా ఉంటున్నాడు. ప్రస్తుతం ఈయన మాస్టర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం ఎప్పుడో విడుదల కావాల్సి ఉన్నా కూడా థియేటర్స్ బంద్ కారణంగా వాయిదా పడింది.
Published by: Praveen Kumar Vadla
First published: July 5, 2020, 4:16 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading