ముంబై ఇప్పటికే కరోనాకు కేంద్రంగా మారిపోయింది. అక్కడ ఎంతమందికి కరోనా వచ్చిందనే జాబితా కూడా చాంతాడంత ఉంది. బాలీవుడ్ సెలబ్రిటీస్ కూడా చాలా మంది ఇప్పటికే కరోనా బారిన పడ్డారు. అమితాబ్ బచ్చన్ కుటుంబం కూడా కరోనా నుంచి బయటపడింది. ఇప్పుడు మరో హీరో కూడా కరోనా వైరస్ బారిప పడ్డాడు. బోనీ కపూర్ కొడుకు.. కుర్ర హీరో అర్జున్ కపూర్ కూడా కరోనా బారిన పడ్డట్లు కన్ఫర్మ్ అయింది. ఇదే విషయాన్ని తన సోషల్ మీడియా పేజీలో కూడా తెలిపాడు అర్జున్ కపూర్.
ఎలాంటి లక్షణాలు లేకపోయినా కూడా టెస్ట్ చేయించుకుంటే తనకు పాజిటివ్ వచ్చిందని.. డాక్టర్స్ హోం క్వారంటైన్లో ఉండమని సూచించినట్లు చెప్పుకొచ్చాడు అర్జున్. తనను ఈ మధ్య కాలంలో కలిసిన వాళ్లంతా వెళ్లి వెంటనే టెస్టులు చేయించుకోవాల్సిందిగా కోరాడు ఈయన.
అర్జున్ కపూర్‌తో పాటు మరికొందరు బాలీవుడ్ సెలబ్రిటీస్ కూడా ఇప్పటికే కరోనా బారిన పడ్డారు. కొడుకుకు పాజిటివ్ రావడంతో బోనీ కపూర్ కూడా కంగారు పడుతున్నాడు. అయితే లక్షణాలు లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకుంటున్నారు. తన ఆరోగ్యంపై ఆరా తీస్తున్న అభిమానులకు, సన్నిహితులకు కృతజ్ఞతలు తెలిపాడు అర్జున్ కపూర్.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Arjun Kapoor, Telugu Cinema, Tollywood