Jagdeep Died:బాలీవుడ్ చిత్ర సీమలో మరో విషాదం.. షోలే నటుడు జగ్‌దీప్ కన్నుమూత..

Jagdeep died | 2020 సినీ ఇండస్ట్రీకి అసలు కలిసి రావడం లేదు. ఇప్పటికే ఇర్ఫాన్ ఖాన్, రిషీ కపూర్ వంటి నటుల మరణాలు బాలీవుడ్‌ను శోక సంద్రంలో ముంచెత్తాయి. కాసేటి క్రితమే బాలీవుడ్ ఒకప్పటి నటుడు జగ‌దీప్ కన్నుమూసారు.

news18-telugu
Updated: July 8, 2020, 11:09 PM IST
Jagdeep Died:బాలీవుడ్ చిత్ర సీమలో మరో విషాదం.. షోలే నటుడు జగ్‌దీప్ కన్నుమూత..
బాలీవుడ్ నటుడు జగదీప్ కన్నుమూత (Twitter/Photo)
  • Share this:
2020 సినీ ఇండస్ట్రీకి అసలు కలిసి రావడం లేదు. ఇప్పటికే ఇర్ఫాన్ ఖాన్, రిషీ కపూర్ వంటి నటుల మరణాలు బాలీవుడ్‌ను శోక సంద్రంలో ముంచెత్తాయి. మరోవైపు ఎంతో భవిష్యత్తు ఉన్న సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. ఐదు రోజుల క్రితమే ప్రముఖ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్.. గుండెపోటు‌తో మృతి చెందారు. నిన్నటి నిన్న హిందీలో పలు సూపర్ హిట్ చిత్రాలను నిర్మించిన హరీష్ షా .. కాన్సర్‌తో కన్నుమూసారు. ఈ రోజే ప్రముఖ కన్నడ సీరియల్ నటుడు సుశీల్ గౌడ ఆత్మహత్య మరిచిపోకముందే.. బాలీవుడ్‌లో మరో విషాదం చోటుచేసుకుంది. బాలీవుడ్‌లో షోలో తో పాటు పలు హిందీ చిత్రాల్లో తనదైన కామెడీని పండించిన జగ్‌దీప్ బుధవారం రాత్రి 8.40 నిమిషాలకు తన ఇంట్లోనే   కన్నుమూసినట్టు సమాచారం. ఆయన వయసు 81 ఏళ్లు. వయసు పైబడటంతో ఆయన కన్నుమూసినట్టు కుటుంబ వర్గాలు తెలిపాయి. ఆయన అసలు పేరు సయ్యద్ ఇష్తియాక్ జాఫ్రీ. స్క్రీన్ పై మాత్రం ‘జగ్‌దీప్’ పేరుతో ఫేమస్ అయ్యారు.

Bollywood Veteran actor Jagdeep dies at 81 in Mumbai,jagdeep,jagdeep died,jagdeep no more,jagdeep died,jagdeep family,jagdeep comedy,jagdeep son,jagdeep actor,jagdeep singh,jagdeep in jail,jagdeep jublee,jagdeep history,jagdeep comedian,jagdeep dialogue,jagdeep randhawa,jagdeep biography,jagdeep life story,jagdeep family pics,jagdeep singh thali,jagdeep family video,jagdeep comedy scene,jagdeep hindi comedy,jagdeep jublee songs,jagdeep family photos,jagdeep comedy movies,jagdeep comedy scenes,faisla jagdeep jublee,jagdeep randhawa songs,jagdeep actor biography,jagdeep best comedy scene,bollywood,జగదీప్,జగ్‌దీప్,బాలీవుడ్ నటుడు జగ్దీప్ కన్నుమూత,బాలీవుడ్ నటుడు జగ్‌దీప్ ఇక లేరు
బాలీవుడ్ నటుడు జగ‌దీప్ కన్నుమూత (Instagram/Photo)


ముఖ్యంగా 1970, 80లలో ఆయనలేని బాలీవుడ్ సినిమాలు లేవు. ముఖ్యంగా షోలే సినిమాలో ఆయన వేసిన సూర్మా భూపాలి క్యారెక్టర్ ఎంతో ఫేమస్. 1988లో ఆయన ‘సూర్మా భూపాలి’ పేరుతో ఓ సినిమాను డైరెక్ట్ చేసారు. ఈ చిత్రంలో ఆయన త్రిపుల్ రోల్ పోషించాడు. ఆ తర్వాత ఈయన సల్మాన్ ఖాన్, ఆమీర్ ఖాన్ హీరోలుగా నటించిన ‘అందాజ్ ఆప్నా అప్నా’ సినిమాలో సల్మాన్ తండ్రి పాత్రలో నటించాడు. ఆ తర్వాత ఈయన బ్రహ్మచారి, నాగిన్ వంటి సినిమాల్లో నటించారు. ఆయన మృతికి బాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలిపారు.
Published by: Kiran Kumar Thanjavur
First published: July 8, 2020, 11:09 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading