Yuvika Chaudhary: బాలీవుడ్ నటి, బిగ్ బాస్ బ్యూటీ యువికా చౌదరి. పలు సినిమాలో నటించి మంచి పేరు సంపాదించుకుంది. అంతేకాకుండా బుల్లితెరలో కూడా ఎన్నో షో లలో మంచి క్రేజ్ ను అందుకుంది. ఫిర్ భి దిల్ హై హిందుస్తానీ, ఓం శాంతి ఓం సినిమా లలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది. ఇదిలా ఉంటే ఈ బ్యూటీ నిమ్న వర్గాల పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు తాజాగా ఈ బ్యూటీ పై కేసు నమోదైంది.
మే 25న యువికా చౌదరి తన సోషల్ మీడియా వేదిక ద్వారా ఓ వీడియో షేర్ చేసింది. అందులో షెడ్యూల్ కులాల వారిని కించ పరిచే విధంగా మాట్లాడింది. ఇక ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా ఆమెపై ఆగ్రహం చేశారు దళితుల వర్గాలు, నెటి జనులు. వెంటనే తనను అరెస్టు చేయాలంటూ డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో దళిత సామాజిక కార్యకర్త రాజత్ కల్సన్ యువికా పై కఠిన చర్యలు తీసుకోవాలని హర్యానా పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
షెడ్యూల్డ్ కులాల పై అవమానకర వ్యాఖ్యలు చేసిందని ఫిర్యాదు చేశాడు. ఇక ఈ నేపథ్యంలో హర్యానా పోలీసులు ఆ నటి పై మే 26న ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. అంతేకాకుండా ఈ విషయాన్ని మీడియా ద్వారా తెలిపారు. ఈ నేపథ్యంలో తాజాగా మళ్లీ ఈ నటి సోషల్ మీడియా వేదికగా క్షమించాలని కోరింది. తన వల్ల ఎవరైనా నొచ్చుకుని ఉంటే క్షమించమని అడిగింది. తను మాట్లాడిన దానికి అర్థం తెలియదని.. పొరపాటు వల్ల ఇలా జరిగిందని తెలిపింది. దీంతో నెటి జనులు తనపై మళ్లీ వ్యతిరేకమైన కామెంట్లు చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bollywood, Haryana police, Movie News, Munmun Dutta, Tv actress, Yuvika Chaudhary, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు, బాలీవుడ్, బుల్లితెర నటి, మున్ముమ్ దత్తా, యువికా చౌదరి, సినిమా వార్తలు