బాలయ్య భామను ఆకాశానికి ఎత్తేసిన అక్షయ్ కుమార్.. ఇంతకీ జరిగిందంటే..
బాలీవుడ్ హీరోయిన్స్ అంటే సైజ్ జీరోతో నిత్యం ఏదో వర్కౌట్స్ చేస్తూ హాట్ హాట్‌గా దర్శమిస్తారు. కానీ ఈ కథానాయిక మాత్రం అలా కాదు. పద్దతిగా కనిపిస్తూనే క్యారెక్టర్ డిమాండ్ చేస్తే ఎక్స్‌పోజింగ్‌కు సైతం వెనకాడని హీరోయిన్ విద్యా బాలన్. ఈ యేడాది బాలకృష్ణ..తన తండ్రి జీవిత చరిత్ర రామారావుపై తెరకెక్కించిన ‘ఎన్టీఆర్ బయోపిక్‌లో విద్యాబాలన్.. బసవ తారకం పాత్రలో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది.తా.ాగా ఈ భామ అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన మిషన్ మంగళ్ సినిమాలో నటించింది. ఈ సినిమాలో విద్యా నటనను అక్షయ్ మెచ్చుకున్నాడు.
news18-telugu
Updated: July 20, 2019, 12:55 PM IST

బాలకృష్ణ,అక్షయ్ కుమార్ (ఫైల్ ఫోటో)
- News18 Telugu
- Last Updated: July 20, 2019, 12:55 PM IST
బాలీవుడ్ హీరోయిన్స్ అంటే సైజ్ జీరోతో నిత్యం ఏదో వర్కౌట్స్ చేస్తూ హాట్ హాట్‌గా దర్శమిస్తారు. కానీ ఈ కథానాయిక మాత్రం అలా కాదు. పద్దతిగా కనిపిస్తూనే క్యారెక్టర్ డిమాండ్ చేస్తే ఎక్స్‌పోజింగ్‌కు సైతం వెనకాడని హీరోయిన్ విద్యా బాలన్. ‘పరిణీత’ సినిమాతో 2005లో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన విద్యా బాలన్.. తన 14 ఏళ్ల కెరీర్లో ఎన్నో అద్భుతమైన సినిమాలు చేశారు.2011లో వచ్చిన ‘డర్టీ పిక్చర్’ సినిమాకు ఉత్తమ నటిగా జాతీయ అవార్డు అందుకున్నారు. ఆ తర్వాత కేంద్రం నుంచి ‘పద్మశ్రీ’ గౌరవాన్నిఅందుకున్నారు. అంతేకాదు బాలీవుడ్లో మహిళా ప్రాధాన్యమున్న చిత్రాల్లో నటించి ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్నారు. ఈ యేడాది బాలకృష్ణ..తన తండ్రి జీవిత చరిత్ర రామారావుపై తెరకెక్కించిన ‘ఎన్టీఆర్ బయోపిక్‌లో విద్యాబాలన్.. బసవ తారకం పాత్రలో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

తాజాగా విద్యాబాలన్ నటించిన ‘మిషన్ మంగళ్’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. అక్షయ్‌కుమార్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో విద్యా బాలన్‌తో పాటు తాప్సీ పన్ను, సోనాక్షి సిన్హా, కృతి కుల్హారీ తదితరులు నటించారు. ఈ సినిమా ట్రైలర్ లాంచింగ్‌లో భాగంగా విద్యాబాలన్,అక్షయ్ కుమార్ తదితరులు మీడియాతో ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఒక విలేఖరి ఈ సినిమాకుగాను జాతీయ అవార్డు వస్తుందా? అని ప్రశ్నించారు. దీనికి సమాధానంగా విద్యా బాలన్ అవార్డులు గురించి మేము ఆలోచించడంలేదు. ఒస్తే సంతోషమే అంటూ సమాధానమిచ్చారు. వెంటనే అక్షయ్ కలగజేసుకుంటూ ‘విద్య పుట్టగానే నర్స్ .. అవార్డు పుట్టిందంటూ విద్యా కుటుంబ సభ్యులతో చెప్పిందని’ తమాషాగా సమాధానమిచ్చారు. ఈ సమాధానానికి అక్కడవున్న వాళ్ళంతా పగలబడి నవ్వారు. ఏమైనా అక్షయ్ కుమార్.. తన స్టార్డమ్ పక్కనపెట్టి..తన తోటి నటి యాక్టింగ్‌ను మెచ్చుకోవడాన్ని అందరు ప్రశంసిస్తున్నారు.

‘మిషన్ మంగళ్’లో అక్షయ్,విద్యాబాలన్,నిత్యా మీనన్ (ఫైల్ ఫోటో)

షాద్‌నగర్ లైంగికదాడి బాలీవుడ్ సూపర్ స్టార్ ఆవేదనతో ట్వీట్..
అక్షయ్ అభిమానులకు గుడ్‌న్యూస్.. మళ్లీ తండ్రి కాబోతున్న ఖిలాడీ..
చొక్కా చిరిగేలా కొట్టుకున్న స్టార్ హీరో, దర్శకుడు.. వీడియో వైరల్..
రియల్ హీరో అనిపించుకున్న అక్షయ్.. బీహార్ వరద బాధితులకు రూ.కోటి విరాళం..
చిరంజీవి అమ్మడు కుమ్ముడు పాటకు స్టెప్పులేసిన అక్షయ్ కుమార్..
చీర కట్టుకున్న అక్షయ్ కుమార్.. షాక్ అవుతున్న ఫ్యాన్స్..
Loading...