షారుక్ ఖాన్ కనబడుట లేదు.. భూతుద్దంలో వెతుకుతున్న ఫ్యాన్స్..

Shah Rukh Khan: పగవాడికి కూడా ఇలాంటి కష్టాలు రాకూడదు. ఇప్పుడు షారుక్ ఖాన్ పరిస్థితి చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. షారుక్ పేరుకు కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. బాలీవుడ్ రికార్డులు తిర‌గ‌రాయ‌డానికి ఈ ఒక్క పేరు చాలు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: January 23, 2020, 2:41 PM IST
షారుక్ ఖాన్ కనబడుట లేదు.. భూతుద్దంలో వెతుకుతున్న ఫ్యాన్స్..
షారుక్ ఖాన్ ఫైల్ ఫోటో (Source: Twitter)
  • Share this:
పగవాడికి కూడా ఇలాంటి కష్టాలు రాకూడదు. ఇప్పుడు షారుక్ ఖాన్ పరిస్థితి చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. షారుక్ పేరుకు కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. బాలీవుడ్ రికార్డులు తిర‌గ‌రాయ‌డానికి ఈ ఒక్క పేరు చాలు. ఒక‌ప్పుడు ఇండ‌స్ట్రీ రికార్డుల‌తో చెడుగుడు ఆడుకున్న కింగ్ ఖాన్.. ఇప్పుడు ఉనికి కోసం పాటు ప‌డుతున్నాడు. ఈయ‌న సినిమాలు కొన్నేళ్లుగా స‌రిగ్గా ఆడ‌టం లేదు. క‌నీసం 100 కోట్లు వ‌సూలు చేయ‌డానికి కూడా ఇబ్బంది ప‌డే స్థాయికి వ‌చ్చేసాయి. 7 ఏళ్ల కింద "చెన్నై ఎక్స్‌ప్రెస్" సినిమాతో బాలీవుడ్‌లో తొలిసారి 400 కోట్ల మార్క్ అందుకున్న షారుక్.. ఆ త‌ర్వాత స్థాయికి త‌గ్గ విజ‌యం కోసం తంటాలు ప‌డుతూనే ఉన్నాడు.

 #ZeroToday: Shah Rukh Khan All hopes on Zero Movie.. పగవాడికి కూడా ఇలాంటి కష్టాలు రాకూడదు. ఇప్పుడు షారుక్ ఖాన్ పరిస్థితి చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. షారుక్ పేరుకు కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. బాలీవుడ్ రికార్డులు తిర‌గ‌రాయ‌డానికి ఈ ఒక్క పేరు చాలు. ఒక‌ప్పుడు ఇండ‌స్ట్రీ రికార్డుల‌తో చెడుగుడు ఆడుకున్న కింగ్ ఖాన్.. ఇప్పుడు ఉనికి కోసం పాటు ప‌డుతున్నాడు. ఈయ‌న సినిమాలు కొన్నేళ్లుగా స‌రిగ్గా ఆడ‌టం లేదు. zero movie,zero movie review,zero movie trailer released,Shah Rukh Khan zero trailer,anand l rai,srk zero,katrina kaif,anushka sharma,షారుక్ ఖాన్,జీరో ట్రైలర్ విడుదల,ఆనంద్ ఎల్ రాయ్,మరుగుజ్జుగా షారుక్,కత్రినా కైఫ్, అనుష్క శర్మ
షారుక్ ఖాన్ ఫైల్ ఫోటో


హ్యాపీ న్యూ ఇయ‌ర్.. ఫ్యాన్.. ర‌యీస్.. దిల్ వాలే.. డియ‌ర్ జింద‌గీ.. జ‌బ్ హ్యారీ మెట్ సెజ‌ల్.. జీరో ఇలా చేసిన సినిమాల‌న్నీ ఒక్క‌టి కూడా విజ‌యం సాధించ‌లేదు. ప్రతీ సినిమా కూడా వచ్చింది వచ్చినట్లు పోతుంది. దాంతో షారుక్ ఖాన్‌కు ఇప్పుడేం చేయాలో నిజంగానే అర్థం కావడం లేదు. అసలు ఎలాంటి సినిమాలు చేస్తే అభిమానులకు నచ్చుతాయో కూడా అర్థం కావడం లేదు ఈయనకు. దాంతో కొన్ని నెలలుగా సినిమాలు చేయడమే మానేసాడు కింగ్ ఖాన్. ఈ క్రమంలోనే 2019లో కనీసం ఒక్క సినిమా కూడా చేయలేదు ఈయన. అనౌన్స్‌మెంట్ కూడా ఇవ్వలేదు.

Shah Rukh Khan missing from one year and He will take more time for next movie pk పగవాడికి కూడా ఇలాంటి కష్టాలు రాకూడదు. ఇప్పుడు షారుక్ ఖాన్ పరిస్థితి చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. షారుక్ పేరుకు కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. బాలీవుడ్ రికార్డులు తిర‌గ‌రాయ‌డానికి ఈ ఒక్క పేరు చాలు. Shah Rukh Khan,Shah Rukh Khan twitter,Shah Rukh Khan instagram,Shah Rukh Khan movies,Shah Rukh Khan zero,Shah Rukh Khan next movie,Shah Rukh Khan zero trailer,anand l rai,srk zero,katrina kaif,anushka sharma,షారుక్ ఖాన్,షారుక్ ఖాన్ నెక్ట్స్ సినిమా,జీరో ట్రైలర్ విడుదల,ఆనంద్ ఎల్ రాయ్,మరుగుజ్జుగా షారుక్,కత్రినా కైఫ్, అనుష్క శర్మ
షారుక్ ఖాన్ (Photo: twitter)


క‌చ్చితంగా ఇప్పటికిప్పుడు బ్లాక్‌బ‌స్టర్ కొడితే కానీ తానేంటో నిరూపించుకోని పరిస్థితుల్లో పడిపోయాడు షారుక్. కానీ ఇప్పట్లో తాను సినిమాలు చేయనంటున్నాడు ఈయన. మరికొన్ని రోజులు అన్నీ మానేసి తను సినిమాలకు దూరంగా ఉంటానని చెబుతున్నాడు షారుక్ ఖాన్. అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ లాంటి హీరోలు కూడా ఇప్పుడు ఫ్లాపులు ఇచ్చారు. ఇక షారుక్ కూడా హిట్ సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నాడు. ఇంకొన్ని రోజుల పాటు తన కుటుంబంతోనే ఉండి.. ఆ తర్వాత సినిమా అనౌన్స్ చేస్తానంటున్నాడు ఈయన. ఫ్యాన్స్ మాత్రం త్వరగా సినిమాలు చేయాలంటూ కోరుతున్నారు. మరి వాళ్ల బాధలను షారుక్ ఖాన్ ఎప్పటికి అర్థం చేసుకుంటాడో చూడాలి.
Published by: Praveen Kumar Vadla
First published: January 23, 2020, 2:38 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading