చొక్కా చిరిగేలా కొట్టుకున్న స్టార్ హీరో, దర్శకుడు.. వీడియో వైరల్..

రోహిత్ శెట్టి అక్షయ్ కుమార్ ఫైట్

అవును.. వీడియో కూడా చూసిన తర్వాత ఇది నమ్మకుండా ఉండలేని పరిస్థితి. బాలీవుడ్‌లో అగ్ర దర్శకుడు రోహిత్ శెట్టి.. సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ నిజంగానే కొట్టుకున్నారు. అది కూడా షర్ట్ చిరిగేలా..

  • Share this:
అవును.. వీడియో కూడా చూసిన తర్వాత ఇది నమ్మకుండా ఉండలేని పరిస్థితి. బాలీవుడ్‌లో అగ్ర దర్శకుడు రోహిత్ శెట్టి.. సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ నిజంగానే కొట్టుకున్నారు. అది కూడా షర్ట్ చిరిగేలా.. బటన్లు ఊడి కిందపడేలా.. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు ఎందుకు అక్షయ్, రోహిత్ శెట్టి కొట్టుకోవాల్సి వచ్చింది అనుకుంటున్నారా..? పైగా ఈ కాంబినేషన్‌లో ఇప్పుడు సూర్యవంశీ అనే సినిమా వస్తుంది. ఇందులో పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు అక్కీ భాయ్. త్వరలోనే విడుదల కానుంది ఈ చిత్రం. కత్రినా కైఫ్ హీరోయిన్.
Bollywood Superstar Akshay Kumar fight with director Rohit Shetty and video goes viral in social media pk అవును.. వీడియో కూడా చూసిన తర్వాత ఇది నమ్మకుండా ఉండలేని పరిస్థితి. బాలీవుడ్‌లో అగ్ర దర్శకుడు రోహిత్ శెట్టి.. సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ నిజంగానే కొట్టుకున్నారు. అది కూడా షర్ట్ చిరిగేలా.. akshay kumar,akshay kumar twitter,rohit shetty,rohit shetty twitter,akshay kumar and rohit shetty fight,akshay kumar rohit shetty,sooryavanshi akshay kumar,akshay kumar fight with rohit shetty,rohit shetty akshay kumar,rohit shetty akshay kumar fight,akshay kumar rohit shetty fight,akshay kumar rohit shetty fight video,akshay kumar rohit shetty fight on sooryavanshi set,akshay kumar fight scene,akshay kumar sooryavanshi,akshay rohit fight,telugu cinema,hindi cinema,రోహిత్ శెట్టి,అక్షయ్ కుమార్,అక్షయ్ కుమార్ రోహిత్ శెట్టి ఫైట్,హిందీ సినిమా
రోహిత్ శెట్టి అక్షయ్ కుమార్ ఫైట్

అంతా బాగానే ఉంది కదా.. మరెందుకు కొట్టుకున్నారు అనేగా అనుమానం. ఈ చిత్ర షూటింగ్ జరుగుతున్న సమయంలోనే హీరో, దర్శకుడి మధ్య మనస్పర్థలు వచ్చాయని.. కొట్టుకున్నారంటూ ఓ మీడియాలో వార్తలు వచ్చాయి. దాన్ని స్పూఫ్ చేసారు అక్షయ్ కుమార్, రోహిత్ శెట్టి. అక్షయ్ కుమార్, రోహిత్ మధ్య గొడవలు అనే వార్తలనే హైలైట్ చేస్తూ.. తామిద్దరూ కొట్టుకుంటున్నట్లు షూట్ చేసి వీడియో పోస్ట్ చేసారు. ఇది చూసి సినిమాకు ఫ్రీ ప్రమోషన్ కూడా వస్తుందని భావిస్తున్నారు దర్శక నిర్మాతలు. అక్షయ్, రోహిత్ చొక్కా పట్టుకుని కొట్టుకుంటున్నట్లు యాక్ట్ చేసి వీడియో విడుదల చేశారు.అక్కడ వాళ్లిద్దరూ కొట్టుకుంటుంటే.. సెట్‌లో పోలీస్ కానిస్టేబుల్ పాత్రల్లో వాళ్లొచ్చి వాళ్లను వారిస్తున్నట్లు.. తర్వాత ఇద్దరూ అలసిపోయి పడిపోయినట్లు ఫన్నీ వీడియోను రికార్డ్ చేశారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తమ మధ్య గొడవలున్నాయని మీడియా రాస్తే దాన్ని ఫన్నీగా చేసి సినిమా ప్రమోషన్ కింద వాడేసారు దర్శకుడు హీరో. మొత్తానికి ఈ చిత్రయూనిట్ చేసిన ఈ ఫన్నీ పనితో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. మరోవైపు మీడియాకు అదిరిపోయే సెటైర్ వేసారుగా అంటూ ఫ్యాన్స్ కౌంటర్ వేస్తున్నారు. ఇందులో అజయ్ దేవగణ్, రణ్‌వీర్ సింగ్ అతిథి పాత్రల్లో కనిపించనున్నారు.
Published by:Praveen Kumar Vadla
First published: