ఇండస్ట్రీలో ఎప్పుడు ఏ వార్త వినాల్సి వస్తుందో అని భయపడుతున్నారు అభిమానులు. ఎందుకంటే ఈ మధ్య వస్తున్న వార్తలు కూడా అలాగే ఉన్నాయి మరి. ఇండస్ట్రీ మారినా చేదు వార్తలు మాత్రం ఆగడం లేదు. ఇక ఇప్పుడు బాలీవుడ్ సీనియర్ నటుడు రిషీ కపూర్ ఆస్పత్రి పాలయ్యాడు. ఈ విషయం తెలుసుకుని ఆందోళన పడుతున్నారు అభిమానులు. ఈయన హాస్పిటల్ పాలవడం ఇదేం తొలిసారి కాదు.. ఇప్పటికే చాలా సార్లు అయ్యాడు. ఇప్పుడు మరోసారి ఆస్పత్రిలో చేరాడు ఈయన. 2018 సెప్టెంబర్లో క్యాన్సర్ చికిత్స కోసం న్యూయార్క్ వెళ్లి దాదాపు ఏడాది తర్వాత ఇండియాకు వచ్చాడు ఈయన.
అప్పట్లో రిషి ఆరోగ్యంపై చాలా వార్తలే వినిపించాయి. ఇప్పుడు మరోసారి ఈయన హాస్పిటల్లో చేరడం కలవరం పుట్టిస్తుంది. బాలీవుడ్లో కూడా ఇదే చర్చనీయాంశంగా మారిపోయింది. ఢిల్లీలోని ఓ ఫ్యామిలీ ఫంక్షన్కు హాజరైన సమయంలో రిషీ కపూర్ ఉన్నట్లుండి అనారోగ్యానికి గురి కావడంతో వెంటనే ఆయనను ఆస్పత్రిలో చేర్పించారని తెలుస్తుంది. ఈ విషయాన్ని బయటికి రాకుండా చూసుకుంటున్నారు కపూర్ కుటుంబం. ఆయన హాస్పిటల్లో చేరినపుడు భార్య నీతూ కపూర్ కూడా ఉన్నారు. రిషి కపూర్ అనారోగ్యం గురించి తెలిసిన వెంటనే అర్జున్ కపూర్, ఆలియా భట్లు వెంటనే ఢిల్లీకి బయలుదేరారు.
అయితే రిషీ కపూర్ ఏ సమస్యతో హాస్పిటల్లో చేరాడనేది మాత్రం ప్రస్తుతానికి గోప్యంగా ఉంచారు కుటుంబ సభ్యులు. అర్మాన్ జైన్ మెహందీ ఫంక్షన్లో రిషీ కపూర్ కుటుంబ సభ్యులు కనిపించకపోవడంతో ఈ విషయం బయటికి వచ్చింది. అక్కడ్నుంచి కూపీ లాగితే ఆయన అనారోగ్యం సంగతి కూడా వెలుగులోకి వచ్చింది. ఈ వేడుకలోనే అర్జున్ కపూర్, ఆలియా భట్ పర్మామెన్స్ చేయాల్సి ఉంది. కానీ రిషీ కపూర్ అనారోగ్యం కారణంగా వాళ్లు హుఠాహుఠిన ఢిల్లీ బయలుదేరాల్సి వచ్చినట్టుగా ప్రచారం జరుగుతుంది. అయితే ప్రస్తుతానికి రిషి ఆరోగ్యం గురించి ఎలాంటి వివరాలు బయటికి రావడం లేదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bollywood, Rishi kapoor, Telugu Cinema, Tollywood