హోమ్ /వార్తలు /సినిమా /

మద్యం అమ్మండి.. ప్రభుత్వానికి స్టార్ హీరో సలహా..

మద్యం అమ్మండి.. ప్రభుత్వానికి స్టార్ హీరో సలహా..

రిషి కపూర్ (rishi kapoor)

రిషి కపూర్ (rishi kapoor)

Rishi Kapoor: కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ కావడంతో మద్యం షాపులు కూడా మూసేయాల్సి వచ్చింది. దాంతో నిజంగానే కొందరు మందు బాబులు తట్టుకోలేకపోతున్నారు.

కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ కావడంతో మద్యం షాపులు కూడా మూసేయాల్సి వచ్చింది. దాంతో నిజంగానే కొందరు మందు బాబులు తట్టుకోలేకపోతున్నారు. కొందరు అయితే ఏకంగా మందు దొరక్క చచ్చిపోతున్నారు. కొందరికి పిచ్చెక్కిపోతుంది కూడా. ఈ రెండు మూడు రోజుల్లోనే అలాంటి మరణాలు కూడా చూస్తున్నాం. అయితే ఇఫ్పుడు ఈ మద్యం షాపులు బంద్ చేయడంపై బాలీవుడ్ స్టార్ హీరో ప్రభుత్వానికి సూచన ఇచ్చాడు. కనీసం రోజూ సాయంత్రం కాసేపైనా మద్యం దుకాణాలు తెరవాలని ప్రభుత్వాన్ని కోరాడు బాలీవుడ్ సీనియర్ నటుడు రిషి కపూర్. తన విజ్ఞప్తిని ప్రభుత్వం తప్పుగా అర్థం చేసుకోవద్దని కోరాడు కూడా.


ఎందుకంటే లాక్‌ డౌన్ నేపథ్యంలో ఇంటికే పరిమితమైన వాళ్లు నిజంగానే చాలా నిరాశలో మునిగి ఉంటారని.. ఇలాంటి సమయంలో వాళ్లకు మద్యం కచ్చితంగా అవసరం ఉంటుందని చెబుతున్నాడు రిషి. షాపులు తెరవకపోతే కనీసం బ్లాక్‌లో అయినా పెట్టి అమ్మితే బాగుంటుందని ట్విట్టర్‌లో కోరాడు రిషి కపూర్. ఈయన చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. పైగా అంతా సపోర్ట్ కూడా చేస్తున్నారు. ఆకలితో ఉన్న వాళ్లకు అన్నం.. దాహంతో ఉన్న వాళ్లకు నీళ్ళు ఎంత అవసరమో.. మందు బాబులకు మద్యం కూడా అంతే అంటున్నాడు ఈయన. ఇలాంటి సమయంలో షాపులు తెరవడం సాహసమే కానీ.. కనీసం వాళ్ల దాహం తీర్చే మార్గం చూపాలంటున్నాడు ఈయన.

First published:

Tags: Bollywood, Hindi Cinema, Lockdown, Rishi kapoor

ఉత్తమ కథలు