వెండితెరపై 50 ఏళ్లు కంప్లీట్ చేసుకున్న అమితాబ్ బచ్చన్..

వెండితెర యాంగ్రీ యంగ్ మెన్. దేశమంతా అభిమానించే ఎవర్ గ్రీన్ స్టార్. నేటితో అమితాబ్ బచ్చన్ నటుడిగా 50 ఏళ్లు కంప్లీట్ చేసుకున్నాడు.

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: November 7, 2019, 3:38 PM IST
వెండితెరపై 50 ఏళ్లు కంప్లీట్ చేసుకున్న అమితాబ్ బచ్చన్..
అమితాబ్ బచ్చన్ (Twitter/Photo)
  • Share this:
వెండితెర యాంగ్రీ యంగ్ మెన్. దేశమంతా అభిమానించే ఎవర్ గ్రీన్ స్టార్. బాలీవుడ్ షెహెన్ షా. ‘లాక్ కర్ దే’ అంటూ టీవీ తెరపై కోటీశ్వరులను తయారుచేసే పని మొదలుపెట్టాడు. అక్కడా సక్సెస్. బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు రీసెంట్‌గా తెలుగులో సైరా..నరసింహారెడ్డి మూవీతో తెలుగు ఆడియన్స్‌ను పలకరించాడు. ఆయనే పద్మవిభూషణ్.. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత అమితాబ్ బచ్చన్. నేటితో నటుడిగా అమితాబ్ బచ్చన్ 50 వసంతాలను పూర్తి చేసుకున్నాడు. ఈ  సందర్భంగా న్యూస్ 18 స్పెషల్ స్టోరీ.అమితాబ్ బచ్చన్.. పేరెత్తకుండా ఇండియన్ సినిమా గురించి చెప్పడం సాధ్యం కాదు. బాలీవుడ్ లో ట్రెండ్ సెట్ చేసిన... లెక్కలేనన్ని సినిమాలు అమితాబ్ లిస్ట్‌లో ఉన్నాయి. అమితాబచ్చన్‌తో భారతీయుల అనుబంధం ఈనాటిదికాదు. 1969 నవంబర్ 11న విడుదలైంది. ఇక ఈ సినిమా షూటింగ్ ఫిబ్రవరి 15న ప్రారంభమైంది. అప్పటి నుంచి మొదలైన బిగ్ బీ నట ప్రస్థానం ఇప్పటికీ అప్రతిహతంగా కొనసాగుతూనే ఉంది.

Amitabh Bachchan Completes 50 Years in Indian Cinema, Amitabh Bachchan Completes 50 Years | వెండితెర యాంగ్రీ యంగ్ మెన్. దేశమంతా అభిమానించే ఎవర్ గ్రీన్ స్టార్. బాలీవుడ్ షెహెన్ షా. ‘లాక్ కర్ దే’ అంటూ బుల్లితెరపై కోటీశ్వరులను తయారుచేసే పని మొదలుపెట్టాడు.నేటితో నటుడిగా అమితాబ్ బచ్చన్ 50 వసంతాలను పూర్తి చేసుకున్నాడు. ఈ  సందర్భంగా న్యూస్ 18 స్పెషల్ స్టోరీ. Amitabh Bachchan, Amitabh Bachchan Completes 50 Years, Amitabh Bachchan Completes 50 years in Indian Cinema, Big B Completes 50 years in Industry, 50 years of amitabh bachchan, 50 years of big b, 50 years of amitabh bachchan in indian cinema, Bollywood News, Hindi cinema News, 50 వసంతాల అమితాబ్ బచ్చన్, చిత్ర పరిశ్రమలో 50 వసంతాలు పూర్తి చేసుకున్న అమితాబ్ బచ్చన్, 50 ఇయర్స్ ఇండస్ట్రీ అమితాబ్ బచ్చన్
50 ఇయర్స్ ఇండస్ట్రీ అమితాబ్ బచ్చన్


ఐదు దశాబ్దాల తిరుగులేని సినిమా ప్రస్థానంలో వందలకొద్దీ సినిమాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషించారు. అందులో ఎన్నో బాక్సాఫీసు విజయాలను అందుకున్నారు. తన నట ప్రస్థానంలో ఉత్తమ నటుడిగా నాలుగు జాతీయ పురస్కారాలు అందుకున్నారు. దాంతో పాటు ఉత్తమ నూతన నటుడిగా మరో అవార్డును కూడా కైవసం చేసుకున్నాడు.  దాంతో పాటు మరెన్నో జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు.. ఇలా చెప్పుకొంటూపోతే అమితాబ్ బచ్చన్ జీవితం మహా గ్రంథం. అందులో ప్రతి పేజీ విలువైందే.

నటుడిగా 50 ఏళ్లు కంప్లీట్ చేసుకున్న అమితాబ్ బచ్చన్ (Twitter/Photo)
సామాజిక అనుసంధాన వేదికల్లో నేటితరం కథానాయకులెవరూ అమితాబ్‌కు సాటిరారు. అంతలా మిలియన్ల కొద్దీ అభిమానులున్నారు బిగ్‌బీకు. నిత్యం తన అభిమానులతో ఎన్నో విషయాలు పంచుకొంటూ వయసు శరీరానికే కానీ మనసుకుకాదని నిరూపిస్తున్నారు.  భారతీయ  చిత్రసీమలో తిరుగులేని నటుడిగా వెలుగొందుతున్న అమితాబ్ మరిన్ని సంవత్సరాలు కొనసాగాలని కోరుకుందాం..
First published: November 7, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...
Listen to the latest songs, only on JioSaavn.com