Hrithik Roshan Hollywood | ప్రస్తుతం మన దేశ సినిమాలు అందరిని అలరిస్తున్నాయి. ముఖ్యంగా చైనా, జపాన్, రష్యా, అమెరికాలో మన సినిమాలకు మంచి వసూళ్లనే దక్కుతున్నాయి. ఇప్పటికే ప్రభాస్ హీరోగా నటించిన ‘బాహుబలి’ సినిమా ప్రపంచ వ్యాప్తంగా చాలా మందిని అలరించింది. ఈ సినిమాతో ప్రభాస్.. ప్యాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఆ సంగతి పక్కన పెడితే.. బాలీవుడ్లో క్రిష్ సిరీస్‌తో సూపర్ హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు హృతిక్ రోషన్. అంతేకాదు..ఇతని సినిమాలు తెలుగు, తమిళంలో డబ్ చేస్తే ఇక్కడ కూడా కళ్లు చెదిరే వసూళ్లు సాధిస్తున్నాయి. క్రిష్ తెలుగు వెర్షన్ కూడా మన ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. అటు ఈయన నటించిన ‘వార్’ తమిళ్, తెలుగు వెర్షన్లో దాదాపు రూ. 25 కోట్ల వరకు వసూళు చేసి దక్షిణాదిలో సత్తా చాటాడు హృతిక్ రోషన్. ఆ సంగతి పక్కన పెడితే.. హృతిక్ రోషన్ కున్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని ఒక ప్రముఖ హాలీవుడ్ నిర్మాణ సంస్థ గెర్ష ఏజెన్సీ అతనితో వరుసగా మూడు నాలుగు ఫ్రాంచైజీలకు సంబంధించిన ఓ సినిమా చేయడానికి ఒప్పందం చేసుకున్నట్టు సమాచారం. హృతిక్ రోషన్ విషయానికొస్తే.. ఆయన బాడీ స్ట్రక్చర్ గ్రీకు శిల్పాన్ని పోలీ ఉంటుంది. మరోవైపు ధూమ్, క్రిష్ ఇంగ్లీష్ వెర్షన్స్ హాలీవుడ్ ప్రేక్షకులను అలరించాయి. దీంతో హాలీవుడ్ నిర్మాణ సంస్థ హృతిక్ రోషన్‌తో సినిమాలు చేయడానికి ముందుకొచ్చినట్టు సమాచారం.
హృతిక్ రోషన్‌తో హాలీవుడ్ నిర్మాణ సంస్థ నిర్మించే ఈ సినిమా స్పై థ్రిల్లర్ కథాంశంతో ధూమ్ తరహాలో ఉంటుందని చెబుతున్నారు. ఈ సినిమాను హృతిక్ రోషన్.. క్రిష్ 4 తర్వాత సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. హృతిక్ రోషన్ విషయానికొస్తే.. గతేడాది .. ‘సూపర్ 30’ ‘వార్’ వంటి డిఫరెంట్ మూవీస్‌తో ప్రేక్షకులను అలరించాడు. ఇపుడు హాలీవుడ్ మూవీతో ప్రపంచ ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తాడో చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bollywood, Hollywood, Hrithik Roshan, Tollywood