ఈ రోజుల్లో ఒక్కో సినిమాకు కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటున్నారు హీరోయిన్లు. ఒకప్పుడు లక్షల్లో ఉన్న వాళ్ల రెమ్యునరేషన్ ఇప్పుడు కోట్లలోకి వచ్చింది. ముఖ్యంగా హీరోలతో పోటీ పడి మరీ కొందరు హీరోయిన్లు పారితోషికం అందుకుంటున్నారు. కంగన రనౌత్ లాంటి హీరోయిన్లు అయితే కావాలనే హీరోల కంటే ఎక్కువ పారితోషికం తీసుకుంటున్నారు. అయినా హీరోయిన్లకు మాత్రం ఏం తక్కువ.. హీరోల కంటే మేం తక్కువేం కష్టపడుతున్నాం అంటూ అడిగే ముద్దుగుమ్మలు కూడా చాలా మంది ఉన్నారు. అందుకే రెమ్యునరేషన్ విషయంలో వాళ్లు అస్సలు తగ్గడం లేదు. అలాంటి ఈ రోజుల్లో కూడా సినిమాపై ప్యాషన్‌తో తక్కువ రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్లు ఉన్నారంటే నమ్మశక్యం కాదు. కానీ సోనమ్ కపూర్ ఇది చేసి చూపించింది.
ఓ సినిమా విషయంలో ఈమె తీసుకున్న పారితోషికం ఇప్పుడు హైలైట్ అవుతుంది. మరీ ముఖ్యంగా కేవలం 11 రూపాయలు మాత్రమే ఆమె రెమ్యునరేషన్ కింద తీసుకోవడం చర్చనీయాంశం అయింది. ఫర్హాన్ అక్తర్ హీరోగా రాకేశ్ ఓం ప్రకాశ్ మెహ్రా తెరకెక్కించిన బ్లాక్‌బస్టర్ భాగ్ మిల్కా భాగ్ చిత్రం గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఈ సినిమా సంచలన విజయం సాధించడమే కాకుండా నేషనల్ అవార్డులు కూడా గెలుచుకుంది. ఈ సినిమాలో సోనమ్ కపూర్ కూడా నటించింది.
అందులో ఓ అతిథి పాత్రలో మెరిసింది ఈమె. దీనికోసం ఈమె కేవలం 11 రూపాయలు మాత్రమే రెమ్యునరేషన్‌గా తీసుకుందని తన ఆత్మకథలో రాసుకొచ్చాడు రాకేష్ ఓం ప్రకాశ్ మెహ్రా. ది స్ట్రేంజర్ ఇన్ ది మిర్రర్ అనే పుస్తకం రాసాడు మెహ్రా. అందులోనే చాలా విషయాలు పొందు పరిచాడు. తాను ఢిల్లీ 6 ఫ్లాప్ తర్వాత ఆత్మహత్య చేసుకోవాలనుకున్న విషయాన్ని కూడా ఆత్మకథలో రాసాడు రాకేష్ ఓం ప్రకాశ్ మెహ్రా.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bollywood, Hindi Cinema, Sonam kapoor