హోమ్ /వార్తలు /సినిమా /

Tiger Shroff - Disha Patani : జాలీగా విహరిస్తున్న బాలీవుడ్ లవ్ బర్డ్స్..అడ్డుకున్న ముంబై పోలీసులు.. ఏం జరిగిందంటే..

Tiger Shroff - Disha Patani : జాలీగా విహరిస్తున్న బాలీవుడ్ లవ్ బర్డ్స్..అడ్డుకున్న ముంబై పోలీసులు.. ఏం జరిగిందంటే..

Tiger Shroff - Disha Patani (ఫైల్ ఫోటో)

Tiger Shroff - Disha Patani (ఫైల్ ఫోటో)

Tiger Shroff - Disha Patani : టైగర్​, దిశ కొన్ని సంవత్సరాలుగా డేటింగ్​లో ఉన్నారని బాలీవుడ్​లో గుసగుసలు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే ఆ ఇద్దరిలో ఎవరూ ఈ విషయాన్ని బయటికి చెప్పలేదు. సోషల్ మీడియాలో మాత్రం ఒకరి పోస్టులకు ఒకరు కామెంట్లు చేసుకుంటున్నారు.

ఇంకా చదవండి ...

బాలీవుడ్ యంగ్ హీరో టైగర్ ష్రాఫ్​, నటి దిశా పటానీ ప్రస్తుతం బాలీవుడ్​లో లవ్​బర్డ్స్​గా ఉన్నారు. వీరిద్దరూ డేటింగ్​లో ఉన్నారని బీటౌన్ టాక్​. తాజాగా వీరిద్దరూ ముంబై వీధుల్లో కారులో విహరించారు. జిమ్ చేసిన తర్వాత అలా సేద తీరేందుకు బయటికి వచ్చారు. ఆ సమయంలో ముంబై పోలీసులు వారిని బాంద్రా వద్ద ఆపారు. రోడ్డు రిపేరీ పనులు జరుగుతున్న సమయంలో అక్కడ తిరగడం నిషిద్ధం కావడంతో కారును పోలీసులు ఆపారు. కారులో ఉన్న టైగర్​, దిశాను చూశారు. టైగర్​ డ్రైవింగ్ సీట్లో ఉండగా.. దిశా ముందు సీట్లనే కూర్చొని ఉంది. నిబంధనల ప్రకారం వీరి ఆధార్ కార్డులను పరిశీలించిన పోలీసులు ఆ తర్వాత వదిలిపెట్టారు.టైగర్​, దిశ కొన్ని సంవత్సరాలుగా డేటింగ్​లో ఉన్నారని బాలీవుడ్​లో గుసగుసలు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే ఆ ఇద్దరిలో ఎవరూ ఈ విషయాన్ని బయటికి చెప్పలేదు. సోషల్ మీడియాలో మాత్రం ఒకరి పోస్టులకు ఒకరు కామెంట్లు చేసుకుంటున్నారు. టైగర్ సోదరి కృష్ణ ష్రాఫ్​, తల్లి ఆయేషా ష్రాఫ్ కూడా దిశా పోస్ట్​లకు కామెంట్లు పెడుతుంటారు. అయితే ఇద్దరూ కలిసి ఉన్నప్పటి ఫొటోలు వారు ఎప్పుడూ షేర్ చేయలేదు. మార్చిలో వారిద్దరూ మాల్దీవులకు వెళ్లగా.. సోషల్ మీడియాలో రచ్చరచ్చ అయింది. సెకండ్ వేవ్​ కరోనాతో దేశం ఇబ్బందులు పడుతుంటే టూర్​లకు వెళతారా అంటూ కొందరు మండిపడ్డారు. మాల్దీవుల బీచ్​లో బికినీ ఫొటోలను దిశా షేర్ చేయడంపైనా కొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా అందరూ ఇంట్లో సురక్షితంగా ఉండాలని టైగర్ ష్రాఫ్ సూచించాడు.

టైగర్ ష్రాఫ్​, దిశా పటానీ ఇలా చాలా కాలంగా వార్తల్లో నిలుస్తున్నారు. హాట్​ బాలీవుడ్​ లవ్ కపుల్​గా పేరుతెచ్చుకున్నారు. మార్చిలో టైగర్​ బర్త్​డే సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రైవేట్ డిన్నర్​కు దిశా హాజరైంది. ఈ పార్టీలో ష్రాఫ్​ కుటుంబ సభ్యులు కృష్ణ, ఆయేషా కూడా పాల్గొన్నారు. 2019లో హృతిక్ హీరోగా వచ్చిన వార్​ సినిమాలో ష్రాఫ్ చివరగా ఓ ప్రధాన పాత్రలో కనిపించాడు. దిశా గత నెల విడుదలైన సల్మాన్​ మూవీ రాధేలో మెప్పించింది. ఈ సినిమాలో టైగర్ తండ్రి జాకీ ష్రాఫ్ కూడా నటించాడు.

రాధే సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో దిశా.. జాకీ ష్రాఫ్​ను పొగిడేసింది. ‘ఆయనతో పని చేయడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఆయన ఎంతో వినమ్రుడిగా ఉంటారు. జాకీ చాలా గొప్ప నటుడు. ఆయనతో కలిసి పని చేయడం వల్ల చాలా నేర్చుకున్నా. ఆయన ఎంతో సరదాగా ఉంటారు. నేను అలా ఉండను. కానీ ఆయనతో ఉన్న సమయంలో నేను కూడా సరదాగా మారిపోతా. మనం ముభావంగా ఉన్నా.. ఆయనతో ఉంటే మాట్లాడేలా చేస్తారు’ అని దిశా చెప్పింది.

Published by:Sridhar Reddy
First published:

Tags: Bollywood news, Disha Patani, Tiger shroff

ఉత్తమ కథలు