విక్కీ కౌశల్ భయంకరమైన వ్యాధితో బాధ పడుతున్నాడట..

విక్కీ కౌశల్ (Vicky Kaushal)

Vicky Kaushal: గతేడాది యురీ సినిమాతో సంచలన విజయం అందుకున్నాడు బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్. ఈ సినిమాలో నటనకు ఆయన నేషనల్ అవార్డు కూడా అందుకున్నాడు.

  • Share this:
గతేడాది యురీ సినిమాతో సంచలన విజయం అందుకున్నాడు బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్. ఈ సినిమాలో నటనకు ఆయన నేషనల్ అవార్డు కూడా అందుకున్నాడు. ఆ తర్వాత వరస సినిమాలు చేస్తూ బాలీవుడ్‌లో స్టార్ అయ్యే దిశగా అడుగులేస్తున్నాడు. ఇదిలా ఉంటే ఈయన ఆరోగ్యం గురించి ఇప్పుడు ఓ షాకింగ్ విషయం చెప్పాడు విక్కీ. తనకు స్లీప్ పరాలసిస్‌ అనే వ్యాధి ఉన్నట్లు చెప్పాడు విక్కీ కౌశల్. ఈయన డిసీస్ గురించి తెలిసి అభిమానులు కూడా షాక్ అవుతున్నారు. స్లీప్ పరాలసిస్ అంటే నిద్ర పోతున్నప్పుడు కానీ లేదంటే మేల్కోవడానికి కదులుతున్న సమయంలో వస్తుంది.
విక్కీ కౌశల్ (Vicky Kaushal)
విక్కీ కౌశల్ (Vicky Kaushal)

అప్పుడు మన శరీరం పూర్తిగా బిగుసుకుపోతుంది. ఒకట్రెండు నిమిషాలు పూర్తిగా మన ఆధీనంలో లేకుండా పోతుంది. లాక్‌డౌన్‌తో సెలబ్రిటీస్ అంతా ఇంటికే పరిమితమైపోయారు. దాంతో అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తున్నారు. ఇందులో భాగంగానే తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చాడు విక్కీ కౌశల్.
విక్కీ కౌశల్‌తో కత్రినా కైఫ్ (vicky kaushal katrina kaif)
విక్కీ కౌశల్‌తో కత్రినా కైఫ్ (vicky kaushal katrina kaif)

అందులోనే స్లీప్ పరాలసిస్‌తో బాధపడుతున్నానని చెప్పాడు. విక్కీ కౌశల్ ప్రస్తుతం సినిమాలతోనే కాదు.. వెబ్ సిరీస్‌లు కూడా చేస్తున్నాడు. అంతేకాదు ఈయన ఎఫైర్స్‌తో కూడా వార్తల్లో ఉంటాడు. సీనియర్ హీరోయిన్ కత్రినా కైఫ్‌తో ఈయన డేటింగ్ చేస్తున్నాడనే వార్తలు ప్రస్తుతం ముంబైలో బాగానే వినిపిస్తున్నాయి. ఇద్దరూ కలిసి కొన్నిసార్లు మీడియాకు కూడా దొరికారు.
Published by:Praveen Kumar Vadla
First published: