Home /News /movies /

BOLLYWOOD STAR SHAHID KAPOOR JERSEY ACTRESS MRUNAL THAKUR TESTED COVID OMICRON POSITIVE AND NOW SHE IS IN ISOLATION PK

Jersey actress Mrunal Thakur: బ్రేకింగ్ న్యూస్.. ‘జెర్సీ’ హీరోయిన్‌కు ఒమిక్రాన్.. షాక్‌లో అభిమానులు..

జెర్సీ హీరోయిన్ మృణాల్ ఠాకూర్‌కు కరోనా పాజిటివ్ (Mrunal Thakur)

జెర్సీ హీరోయిన్ మృణాల్ ఠాకూర్‌కు కరోనా పాజిటివ్ (Mrunal Thakur)

Jersey actress Mrunal Thakur: ఇండస్ట్రీలో వరసగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా సినీ ప్రముఖులు కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే తెలుగు ఇండస్ట్రీలో కోవిడ్ బారిన పడుతున్న వాళ్ల సంఖ్య పెరుగుతుంది. బాలీవుడ్‌లో అయితే ఈ మధ్య కాలంలో చాలా వరకు పాజిటివ్ కేసులు వచ్చాయి.

ఇంకా చదవండి ...
ఇండస్ట్రీలో వరసగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా సినీ ప్రముఖులు కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే తెలుగు ఇండస్ట్రీలో కోవిడ్ బారిన పడుతున్న వాళ్ల సంఖ్య పెరుగుతుంది. బాలీవుడ్‌లో అయితే ఈ మధ్య కాలంలో చాలా వరకు పాజిటివ్ కేసులు వచ్చాయి. ఇప్పుడు మరో హీరోయిన్ కూడా కరోనా బారిన పడింది. ఇప్పటికే కరోనా దెబ్బకు సినిమాలు కూడా వాయిదా పడుతున్నాయి. డిసెంబర్ 31న రావాల్సిన షాహిద్ కపూర్ జెర్సీ సినిమా వాయిదా పడింది. ఈ సినిమా ఎప్పుడొస్తుందో ఇంకా చెప్పలేదు దర్శక నిర్మాతలు. ఈ సినిమా యూనిట్‌కు కూడా ఇప్పుడు కరోనా సెగ తగిలింది. జెర్సీ సినిమాలో హీరోయిన్‌గా నటించిన మృణాల్ ఠాకూర్‌కు కరోనా పాజిటివ్ వచ్చింది. అది కూడా ఓమిక్రాన్ వేరియంట్ సోకినట్టు ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతానికి మృణాల్ ఐసోలేషన్‌లో ఉందని తెలుస్తుంది. ప్రస్తుతం ఈ హీరోయిన్ ఆరోగ్యం కాస్త కుదురుగానే ఉంది.

ఇప్పటికే బాలీవుడ్‌లో వరసగా సెలబ్రిటీస్ కరోనా బారిన పడుతున్నారు. కరణ్ జోహార్ పార్టీ నుంచి బాలీవుడ్‌లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. కరీనా కపూర్,  మలైకా అరోరాకు కరోనా పాజిటివ్ వచ్చిన తర్వాత.. వరసగా చాలా మంది ప్రముఖులకు పాజిటివ్ వచ్చింది.

Movie ticket rate in Multiplex: 330 రూపాయలు.. చిన్న సినిమాలను చంపడం కాకపోతే ఏంటిది..?


ఈ క్రమంలోనే అర్జున్ కపూర్ కుటుంబంలో కూడా నలుగురు కరోనా బారిన పడ్డారు. తెలుగు ఇండస్ట్రీలో మంచు మనోజ్‌కు ఈ మధ్యే వైరస్ వచ్చింది. తాజాగా విశ్వక్ సేన్ సైతం కరోనా బారిన పడి ఐసోలేషన్‌లోనే ఉన్నాడు. తమిళ ఇండస్ట్రీలో అయితే కరోనా మరో స్థాయికి చేరిపోయింది. అక్కడ ఈ మధ్య కాలంలో కమల్ హాసన్, విక్రమ్, వడివేలు, అర్జున్ సహా చాలా మంది ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. ఏదేమైనా చాలా రోజుల తర్వాత కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటంతో అందరిలోనూ భయం మొదలైపోయింది.
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Bollywood, Corona, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు