హోమ్ /వార్తలు /సినిమా /

Salman Khan: 30ఏళ్ల కెరీర్‌లో మొదటిసారి సల్మాన్‌ ఖాన్‌ ముద్దు సీన్‌..ఆ హీరోయిన్ ఎవరంటే ..

Salman Khan: 30ఏళ్ల కెరీర్‌లో మొదటిసారి సల్మాన్‌ ఖాన్‌ ముద్దు సీన్‌..ఆ హీరోయిన్ ఎవరంటే ..

Salman Khan: ఖాన్ భాయ్ తన సినిమాల్లో ముద్దు సన్నివేశాలకు దూరంగా ఉంటాడు. తానెప్పుడూ సినిమాల్లో కిస్సింగ్ సీన్లు చేయలేదని గతంలో ఒకసారి చెప్పాడు.

Salman Khan: ఖాన్ భాయ్ తన సినిమాల్లో ముద్దు సన్నివేశాలకు దూరంగా ఉంటాడు. తానెప్పుడూ సినిమాల్లో కిస్సింగ్ సీన్లు చేయలేదని గతంలో ఒకసారి చెప్పాడు.

Salman Khan: ఖాన్ భాయ్ తన సినిమాల్లో ముద్దు సన్నివేశాలకు దూరంగా ఉంటాడు. తానెప్పుడూ సినిమాల్లో కిస్సింగ్ సీన్లు చేయలేదని గతంలో ఒకసారి చెప్పాడు.

  కరోనా తరువాత బాలీవుడ్‌లో చెప్పుకోదగ్గ హిట్ సినిమా ఒక్కటి కూడా రాలేదు. ఈ లోటును భర్తీ చేయాలని చూస్తున్నాడు సల్మాన్‌ ఖాన్‌. అతడు నటించిన రాధే సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రభుదేవా దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ట్రైలర్‌ తాజాగా విడుదలైంది. మాస్, యాక్షన్‌కు సినిమాలో పెద్దపీట వేసినట్టు అర్థమవుతోంది. అయితే ఈ సినిమా ట్రైలర్‌లో సల్మాన్ ఖాన్‌ ఫ్యాన్స్ ఆశ్చర్యపోయే అంశం ఒకటి ఉంది. అదే ముద్దు సీన్. సాధారణంగా ఖాన్ భాయ్ తన సినిమాల్లో ముద్దు సన్నివేశాలకు దూరంగా ఉంటాడు. తానెప్పుడూ సినిమాల్లో కిస్సింగ్ సీన్లు చేయలేదని గతంలో ఒకసారి చెప్పాడు. ముద్దు సన్నివేశాలు తనకు ఇబ్బందికరంగా అనిపిస్తాయని సల్మాన్ ఒక టీవీ షోలో సైతం చెప్పాడు. కొత్త సినిమాలో లిప్ లాక్ సీన్ కనిపించిన తరువాత, సల్మాన్ గతంలో మాట్లాడిన వీడియో ఒకటి ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.గతంలో ఒక సినిమా ప్రమోషన్ కోసం ది కపిల్ శర్మ కార్యక్రమానికి సల్మాన్ ఖాన్, అతడి సోదరులు అర్బాజ్ ఖాన్, సోహైల్‌ ఖాన్ వెళ్లారు. సినిమా కోసం హీరోయిన్‌లను ముద్దు పెట్టుకోవడం సల్మాన్‌కు ఎందుకు ఇష్టం ఉండదనే విషయాన్ని అర్బాజ్ చెప్పాడు.

  ముందు ఆన్ స్క్రీన్ రొమాన్స్‌ గురించి కపిల్‌ అడిగిన ప్రశ్నకు సల్మాన్ సమాధానం ఇచ్చాడు. తాను తెరపై ఎవరినీ ముద్దు పెట్టుకోను కాబట్టి, అవన్నీ పట్టించుకోనని చెప్పాడు. దీనికి అర్బాజ్ ఫన్నీ ఆన్సర్ ఇచ్చాడు. సల్మాన్ అవన్నీ ఆఫ్-స్క్రీన్‌లో చేస్తుంటాడు కాబట్టి ఆన్ స్క్రీన్ రొమాన్స్‌ అవసరం లేదని చెప్పాడు. దీంతో కపిల్, సల్మాన్‌ సహా కార్యక్రమానికి హాజరైనవారు అందరూ నవ్వారు.


  ఈ వీడియోను అప్పట్లో కపిల్ శర్మ టీవీ కార్యక్రమం కోసం ప్రోమోగా వాడుకున్నారు. 2018లో సోనీ టీవీ ఎంటర్టైన్మెంట్ ఈ ప్రోమోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. రాధే సినిమా ట్రైలర్‌లో సల్మాన్ ముద్దు సీన్ చూసిన తరువాత ఈ ప్రోమో వీడియో మరోసారి ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. రాధే సినిమాలో సల్మాన్ ఖాన్ సరసన దిశా పటానీ నటించింది. ట్రైలర్‌లో హీరోయిన్‌, సల్మాన్ మధ్య ఒక లిప్ లాక్ సీన్ ఉన్నట్టు చూపించారు. యాక్షన్ ట్రైలర్ మధ్యలో ఈ సన్నివేశం కనిపించింది. దీంతో సల్మాన్ అభిమానులు ఆశ్చర్యపోయారు. తమ అభిమాన హీరో 30 ఏళ్ల కెరీర్‌లో.. సినిమా కోసం ముద్దు సన్నివేశంలో నటించడం ఇదే మొదటిసారి కావచ్చని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు.

  First published:

  Tags: Bollywood news, Disha Patani, Salman khan

  ఉత్తమ కథలు