హోమ్ /వార్తలు /సినిమా /

Sonam Kapoor: పెళ్లి తర్వాత కూడా అదే జోరు... టాప్ తీసేసి రచ్చ రచ్చ చేసిన హీరోయిన్..?

Sonam Kapoor: పెళ్లి తర్వాత కూడా అదే జోరు... టాప్ తీసేసి రచ్చ రచ్చ చేసిన హీరోయిన్..?

Sonam Kapoor

Sonam Kapoor

Sonam Kapoor: సినిమా ఇండస్ట్రీలోఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న స్టార్ సెలబ్రెటీలు వారి వారసులను ఇండస్ట్రీలోకి తీసుకు వస్తున్నారు. అయితే ఎక్కువగా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ విధంగా ఎంతో మంది సినీ తారల పిల్లలు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.

ఇంకా చదవండి ...

Sonam Kapoor: సినిమా ఇండస్ట్రీలోఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న స్టార్ సెలబ్రెటీలు వారి వారసులను ఇండస్ట్రీలోకి తీసుకు వస్తున్నారు. అయితే ఎక్కువగా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ విధంగా ఎంతో మంది సినీ తారల పిల్లలు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఈ విధంగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన వారిలో అనిల్ కపూర్ కుమార్తె సోనమ్ కపూర్ ఒకరు. ఒక స్టార్ హీరో కూతురుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈమె తన అందం అభినయం అద్భుతమైన నటనతో ఎన్నో సినిమాల్లో నటించి మంచి ప్రేక్షకాదరణ పొందింది. ఈ క్రమంలోనే కెరియర్ మొదట్లో ఎన్నో సినిమాలలో రిజెక్ట్ చేసిన ఈ బ్యూటీ ‘సవారియా' అనే సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైంది. మొదటి సినిమాతోనే అందరినీ ఆకట్టుకున్న ఈమె ‘నీర్జా'సినిమా ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకుంది ఈ సినిమాకు గాను ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంది.

ఈ విధంగా సినిమా ఇండస్ట్రీలో అనతి కాలంలోనే స్టార్ డమ్ సంపాదించుకున్న ఈ హీరోయిన్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎల్లప్పుడూ తన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ఈమెను పెద్ద ఎత్తున ట్రోలింగ్ చేస్తుంటారు. ఒక స్టార్ కూతురు అయ్యుండి ఇలాంటి దుస్తులలో కనిపించడం ఏంటి అంటూ నెటిజన్ల పెద్ద ఎత్తున ఈమె పై విమర్శలు కురిపిస్తున్నారు. అయితే అలాంటివి పట్టించుకోని సోనమ్ సోషల్ మీడియాలో తన బోల్డ్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటారు.

ఇండస్ట్రీలోకి వచ్చి వరుస సినిమాలతో ఎంత బిజీగా గడుపుతున్నా ఈమె ఒక ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ అహూజాను పెళ్లాడింది. అంగరంగ వైభవంగా జరిగిన ఈమె పెళ్లికి సినీ లోకం తరలివచ్చింది. పెళ్లి తర్వాత సోనం కపూర్ పేరును కాస్తా సోనం కపూర్ ఆహుజాగా మార్చుకుంది. పెళ్లి తర్వాత కాస్త సినిమాలకు దూరం అయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఎంతో యాక్టివ్ గా ఉన్నారు.

ఈ క్రమంలోనే ఈ హీరోయిన్ తాజాగా ఓ సెల్ఫీ ఫోజ్ ఇస్తూ తీసుకున్నటువంటి ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ ఫోటో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వర్కౌట్ల తర్వాత తన ఫిజిక్ ఎలా ఉందో చూపించే ప్రయత్నం చేసిన సోనమ్ తన టాప్ ని కాస్త పైకి లేపి సెల్ఫీకి ఫోజ్ ఇవ్వడంతో ఆమె లోదుస్తులతో పాటు ఎద అందాలను చూపిస్తున్నటువంటి ఈ ఫోటో క్షణాల్లో వైరల్ గా మారింది. ఈ క్రమంలోనే ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు.

First published:

Tags: Bollywood, Sonam kapoor, Sonam kapoor heroine, Sonam kapoor hot workout