• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • BOLLYWOOD STAR HEROINE KANGANA RANAUT GIFTS COSTLY FLATS TO HER COUSINS MHN

Kangana Ranaut: కోట్లు ఖ‌ర్చు పెట్టి గిఫ్టుల‌ను ఇస్తున్న కంగ‌నా రనౌత్

Kangana Ranaut: కోట్లు ఖ‌ర్చు పెట్టి గిఫ్టుల‌ను ఇస్తున్న కంగ‌నా రనౌత్

Bollywood Star Heroine Kangana Ranaut gifts costly flats to her cousins

Kangana Ranaut: బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్‌లో ఒకరైన కంగనా రనౌత్ తన తోబుట్టువులకే కాదు, కజిన్స్‌కు కూడా కోట్ల రూపాయల విలువ చేసే భవంతులను బహుమతిగా ఇస్తుందట

  • Share this:
    డ‌బ్బులు, క‌ష్టాలే కాదు.. ఆనందాల‌ను, సంతోషాల‌ను కూడా మ‌న తోటి వారికి పంచాల‌ని అంటోంది బాలీవుడ్ వివాదాస్ప‌ద న‌టి కంగ‌నా ర‌నౌత్‌. త‌న చుట్టూ ఉన్న త‌న క‌జిన్స్‌ను సంతోష‌పెట్ట‌డానికి కంగ‌న ఏకంగా వారికి ఖ‌రీదైన ఫ్లాట్స్ బ‌హుమ‌తిగా ఇస్తుంద‌ట‌. ఈ విష‌యాన్ని కంగ‌నా ర‌నౌత్ స్వ‌యంగా తెలియ‌జేసింది. ఎక్క‌డో హిమాచ‌ల్ ప్ర‌దేశ్ నుంచి బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన కంగ‌నా ర‌నౌత్ చిన్న చిన్న పాత్ర‌లు చేస్తూ వ‌చ్చి ఇప్పుడు ఏకంగా స్టార్ హీరోయిన్ స్టేట‌స్‌ను ద‌క్కించుకుంది. త‌ను వెడ్స్ మ‌ను, క్వీన్‌, మ‌ణిక‌ర్ణిక వంటి చిత్రాల‌తో కంగ‌నా ర‌నౌత్ అగ్ర క‌థానాయిక‌గా, లేడీ ఓరియెంటెడ్ చిత్రాల‌కు కేరాఫ్‌గా మారిపోయింది.

    ఇప్పుడు వ‌రుస అవ‌కాశాలతో ఫుల్ బిజీగా మారిపోయింది. ఇప్పుడు ఆమె న‌టించే చిత్రానికి భారీ రెమ్యున‌రేష‌న్‌ను అందుకుంటోంది. ఈ క్ర‌మంలో త‌న క‌జిన్స్ కోసం చంఢీఘ‌డ్‌లో నాలుగు కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు పెట్టి ఖ‌రీదైన ఫ్లాట్స్ ఇస్తుంద‌ట‌. రంగోలి, అక్ష‌య్ ర‌నౌత్‌తో పాటు ఇత‌ర క‌జిన్స్‌కు కూడా ఇందులో కంగ‌నా భాగ‌మిస్తున్న‌ట్లు తెలియ‌జేసింది. 2023 నాటికి ఈ ఖ‌రీదైన భ‌వంతులు పూర్త‌వుతాయని పేర్కొన్నాడు.

    రీసెంట్‌గా జ‌య‌ల‌లిత బ‌యోపిక్ త‌లైవిని పూర్తి చేసిన కంగ‌నా ర‌నౌత్ థాక‌డ్, తేజ‌స్ సినిమాల‌ను పూర్తి చేసే ప‌నిలో ఉంది. మ‌రో వైపు పొలిటిక‌ల్ బ్యాక్డ్రాప్‌తో రూపొందుతోన్న మ‌రో చిత్రంలో ఇందిరా గాంధీ పాత్ర‌లో కనిపించ‌నుంది. అలాగే మ‌ణిక‌ర్ణిక‌కు సీక్వెల్‌ను రూపొందించే ప్ర‌య‌త్నంలో ఉంది.
    Published by:Anil
    First published:

    అగ్ర కథనాలు