హోమ్ /వార్తలు /సినిమా /

Bollywood Drug Case: డ్రగ్స్ కేసులో దొరికిపోయిన బడా హీరో కుమారుడు.. అరెస్ట్ అనివార్యం..?

Bollywood Drug Case: డ్రగ్స్ కేసులో దొరికిపోయిన బడా హీరో కుమారుడు.. అరెస్ట్ అనివార్యం..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Bollywood Drugs Case: బాలీవుడ్‌లోనే కాదు అన్నిచోట్లా ఇప్పుడు డ్రగ్స్ కేసు విపరీతంగా నడుస్తుంది. మొన్నటికి మొన్న బెంగళూరులోనూ ఓ నటుడిని అరెస్ట్ చేసారు పోలీసులు. ఇప్పుడు బాలీవుడ్ బడా హీరో కుమారుడు ఒకరు డ్రగ్ కేసులో పోలీసులకు చిక్కినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరో కొడుకు పోలీసులకు ఈ కేసులో దొరికిపోయాడని.. అతన్ని ప్రశ్నిస్తున్నారని వార్తలు వస్తున్నాయి.

ఇంకా చదవండి ...

బాలీవుడ్‌లోనే కాదు అన్నిచోట్లా ఇప్పుడు డ్రగ్స్ కేసు విపరీతంగా నడుస్తుంది. మొన్నటికి మొన్న బెంగళూరులోనూ ఓ నటుడిని అరెస్ట్ చేసారు పోలీసులు. ఇప్పుడు బాలీవుడ్ బడా హీరో కుమారుడు ఒకరు డ్రగ్ కేసులో పోలీసులకు చిక్కినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరో కొడుకు పోలీసులకు ఈ కేసులో దొరికిపోయాడని.. అతన్ని ప్రశ్నిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. అక్టోబర్ 2 రాత్రి ముంబై తీరంలో ఉన్న ఒక క్రూయిజ్ షిప్‌లో పార్టీ చేస్తుండగా పోలీసులు డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారని సమాచారం. దీంతో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (Narcotics Control Bureau) ఆదివారం ఆర్యన్ ఖాన్‌ను అరెస్ట్ చేసే అవకాశం ఉందని అంటున్నాయి విశ్వసనీయ వర్గాలు. క్రూయిజ్‌లో ఉన్న సదరు హీరో కుమారుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అధికారులు ప్రస్తుతం అతడిని ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా అతని వాట్సాప్ చాట్‌లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ హీరో కొడుకు ఫోన్‌ను పరిశీలించిన తర్వాత అతను క్రమం తప్పకుండా డ్రగ్స్ ఆర్డర్ చేస్తున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి పంపిన మెసేజ్‌లు ఉన్నాయని తెలుస్తోంది. డ్రగ్స్ కేసులో ఈ కుర్రాడిపై కేసు బలంగా ఉందని, విచారణ పూర్తయిన తర్వాత కేంద్ర ఏజెన్సీ అతడిని అరెస్టు చేసే అవకాశం ఉందని అంటున్నారు.

ఇక ఇదే కేసులో మరో ఏడుగురు కూడా అదుపులోకి తీసుకున్నారని తెలుస్తోంది. ఈ కేసులో వారు కూడా అరెస్టయ్యే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. ఈ కేసులో ఎన్‌సిబి అధికారులు మున్మున్ ధమేచా, నూపుర్ సారిక, ఇస్మీత్ సింగ్, మోహక్ జస్వాల్, విక్రాంత్ చోకర్, గోమిత్ చోప్రా, అర్బాజ్ మర్చంట్‌లను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

Chaysam divorce:బాంబు పేల్చిన కంగన -మిస్టర్ పర్ఫెక్ట్ వల్లే నాశనం -బట్టల్లా మార్చేసి బెస్ట్ ఫ్రెండ్స్ అంటారా?

అక్టోబర్ 2 రాత్రి ముంబై నుంచి బయలుదేరిన పోలీసులు (Cordelia cruise ) కార్డెలియా క్రూయిజ్‌పై దాడి చేసి, కొకైన్, ఎల్‌ఎస్‌డి, హషీష్, ఎండి వంటి డ్రగ్‌లను స్వాధీనం చేసుకున్నారు. తెలుస్తోన్న సమాచారం ప్రకారం ఢిల్లీకి చెందిన ఒక సంస్థ క్రూయిజ్ షిప్ పార్టీకి డ్రగ్స్ సరఫరా చేశారని తెలుస్తోంది.

Siddharth : మోసం చేసినోళ్లు బాగుపడరు... వైరల్ అవుతోన్న సిద్ధార్థ్‌ ట్వీట్..

ఇక ఇదే కేసులో గతంలో రియా చక్రవర్తిని పోలీసులు అరెస్ట్ చేసారు. 2020 జూన్‌లో నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణించిన తర్వాత బాలీవుడ్‌లో మాదకద్రవ్యాల వినియోగంపై ఎన్‌సిబి విచారణ ప్రారంభించింది. కేంద్ర ఏజెన్సీ గతంలో రాజ్‌పుత్ స్నేహితురాలు, నటి రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోయిక్‌తో పాటు మరికొందరిని నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్స్ (Narcotic Drugs and Psychotropic Substances (NDPS)) చట్టం కింద అరెస్టు చేసారు. కాగా రియా చక్రవర్తి ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారు. టాలీవుడ్‌లో కూడా ఇదే కేసులో ఇటీవల సినీ ప్రముఖులను ఎన్‌ఫోర్స్ మెంట్ డిపార్ట్ మెంట్ అధికారులు విచారించిన సంగతి తెలిసిందే.

First published:

Tags: Drugs case, Tollywood news

ఉత్తమ కథలు