• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • BOLLYWOOD STAR HERO SALMAN KHAN TO CHARGE RUPEES 16 CRORE PER EPISODE FOR BIGG BOSS 14 SEASON TA

బిగ్‌బాస్ 14వ సీజన్ కోసం సల్మాన్ ఖాన్‌కు కళ్లు చెదిరే రెమ్యునరేషన్..

బిగ్‌బాస్ 14వ సీజన్ కోసం సల్మాన్ ఖాన్‌కు కళ్లు చెదిరే రెమ్యునరేషన్..

సల్మాన్ ఖాన్ బిగ్ బాస్ 14 కోసం అత్యధిక పారితోషకం (Twitter/Photo)

  • Share this:
    ఎక్కడో విదేశాల్లో పాపులర్ అయిన బిగ్‌బాస్ షో.. హిందీలో సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా మంచి సక్సెస్ సాధించింది. అదే ఊపుతో తెలుగులో మూడు సీజన్లు పూర్తి చేసుకుంది. నాల్గో సీజన్‌కు రంగం సిద్ధమైంది. కానీ హిందీలో మాత్రం ఇప్పటి వరకు బిగ్‌బాస్ రియాలిటీ షో 13 సీజన్లు పూర్తి చేసుకుంది. 14 వ సీజన్ కోసం ఇప్పటి నుంచే ప్రిపేరేషన్స్ మొదలైయ్యాయి. ప్రతి సీజన్‌లో సల్మాన్ ఖాన్ తన రెమ్యుననరేషన్ పెంచుకుంటూ పోతున్నాడు.తాజాగా 14వ సీజన్‌కు సల్మాన్ ఖాన్ మరోసారి హోస్ట్ చేయబోతున్నాడు.సుశాంత్ సింగ్ రాజ్‌పుత్  ఆత్మహత్య నేపథ్యంలో సల్మాన్ ఖాన్‌ పై నెటిజన్లు ఒకింత ఆగ్రహంగా ఉన్నారు. ఇప్పటికే ఆయన్ని సోషల్ మీడియాలో కొంత మంది అన్ ఫాలో చేసారు. ఐనా ఇవేవి సల్మాన్ ఖాన్ ఇమేజ్‌ను తగ్గించలేదు. తాజాగా బిగ్‌బాస్ షో సీజన్ 14లో ఒక్కో ఎసిపోడ్‌కు సల్మాన్ ఖాన్.. రూ. 16 కోట్ల రెమ్యునరేషన్ తీసుకోబోతున్నట్టు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

    Bollywood star hero salman khan to charge rupees 16 crore per episode for bigg boss 14 season,salman khan,salman khan bigg boss 14,salman khan remunaration for bigg boss 14,16 crore remunaration fro bigg boss 14,salman khan twitter,salman khan instagram,bigg boss, hindi bigg boss, bigg boss season 12, salman khan, salman khan bigg boss, బిగ్‌బాస్, సల్మాన్ ఖాన్ బిగ్ బాస్,సల్మాన్ ఖాన్ రెమ్యునరేషన్,సల్మాన్ ఖాన్ బిగ్‌బాస్ 14,సల్మాన్ ఖాన్ 16 కోట్ల పారితోషకం,సల్మాన్ ఖాన్ బిగ్‌బాస్ సీజన్ 14కు అత్యధిక పారితోషకం
    సల్మాన్ ఖాన్ ఫైల్ ఫోటో


    అంటే సల్మాన్ ఖాన్.. ప్రతి వారం వీకెండ్ శని, ఆదివారాలు ఎపిసోడ్‌లో అభిమానులను పలకరిస్తూ ఉంటాడు.  ఈ లెక్కన 100 రోజల్లో 14 వారాలు అంటే 28 నుంచి 30 రోజలు సల్మాన్ ఖాన్.. బిగ్‌బాస్ ఎసిపోడ్‌లో కనిపిస్తాడు. ఈ లెక్కన మొత్తం బిగ్‌బాస్ 14 సీజన్ కోసం సల్మాన్ ఖాన్.. రూ. 450  కోట్ల నుంచి రూ. 500 కోట్ల వరకు  పారితోషకం అందుకునే అవకాశాలున్నాయి. మొత్తంగా ఒక సినిమాలో సల్మాన్ ఖాన్ యాక్ట్ చేస్తే.. రూ. 50 కోట్ల వరకు పారితోషకం అందుకుంటున్నాడు.  అదే బిగ్‌బాస్ వంటి రియాలిటీ షో ద్వారా అంతకు 9 నుంచి 10 రెట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు. మొత్తంగా సల్మాన్ ఖాన్.. తన క్రేజ్‌ను బాగానే క్యాష్ చేసుకుంటున్నాడనే చెప్పాలి. ప్రస్తుతం హీరోగా ‘రాధే’తో పాటు ‘కభీ ఈద్ కభీ దీవాళి’ సినిమాలు చేస్తున్నాడు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: