Salman Khan : కరోనా టైంలో సల్మాన్ ఖాన్ పెద్ద మనస్సు..భాయ్ చేసిన పనికి సిటీమార్ కొట్టాల్సిందే..

Salman Khan : కరోనా టైంలో సల్మాన్ ఖాన్ పెద్ద మనస్సు..భాయ్ చేసిన పనికి సిటీమార్ కొట్టాల్సిందే..

Salman Khan : దేశంలో కరోనా కల్లోలానికి అడ్డు అదుపు లేకుండా పోయింది. ఈ మహమ్మారి ప్రభావానికి ఆక్సిజన్, బెడ్లు దొరక్క ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. పలు రంగాలపై ప్రభావం చూపడంతో..చాలా మందికి ఆకలి బాధలు ఎక్కువయ్యాయ్. దీంతో..చాలా మంది సెలబ్రిటీలు తమకు తోచిన సాయం చేయడానికి ముందుకొస్తున్నారు. ఇప్పుడు ఆ లిస్ట్ లో బాలీవుడ్ భాయ్ జాన్ సల్మాన్ ఖాన్ చేరారు.

 • Share this:
  దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. ఈ మహమ్మారి ఇప్పటి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేసింది. తోడుగా ఉండాల్సిన తల్లిదండ్రులను.. పిల్లలే ఆశలుగా బతుకుతున్న వారికి చిన్నారులను దూరం చేసి ఎన్నో కుటుంబాల్లో చీకటిని నిపింది. ఇక దేశంలో రోజూ లక్షల సంఖ్యలో కేసులు నమోదవుతుండటం.. వేలల్లో ప్రాణాలు గాల్లో కలిసిపోతుండటం మనం చూస్తూనే ఉన్నాం. అంతేగాక, కరోనా ప్రభావం చాలా రంగాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ముఖ్యంగా, కరోనా సెకండ్‌ వేవ్‌ ప్రభావం వల్ల సినిమాలు వాయిదా పడటంతో సినీ పరిశ్రమలోని రోజువారీ కార్మికుల కష్టాలు మొదలయ్యాయి. ఈ పరిస్థితుల్లో వాళ్లకు ఆర్థిక సాయం చేయడానికి సల్మాన్‌ఖాన్‌ ముందుకు వచ్చారు. సినీ పరిశ్రమలో పనిచేసే దాదాపు 25 వేల దినసరి వేతన కార్మికులకు రూ.1,500 చొప్పున నేరుగా వాళ్ల బ్యాంకు ఖాతాల్లో జమచేయనున్నారు. ఇందుకోసం ఫెడరేషన్‌ ఆఫ్‌ వెస్టర్న్‌ ఇండియన్‌ సినీ ఎంప్లాయీస్‌ (FWICE)ను సంప్రదించి కార్మికుల బ్యాంకు ఖాతా వివరాలు తీసుకున్నారు. అయితే, గతంలో కర్ణాటకకు చెందిన 18 ఏళ్ల అబ్బాయి తన తండ్రి కొవిడ్‌-19తో మరణించగా.. సాయం చేయమని ట్విటర్‌ ద్వారా సల్మాన్‌ను కోరాడు. వెంటనే సల్మాన్‌ స్పందించి, ఆ అబ్బాయి కుటుంబానికి కావలసిన ఆహార సామాగ్రి అందిచారు. అతని చదువుకు కావల్సిన సదుపాయాలు సమకూర్చారు.

  అలాగే సల్మాన్‌ ఖాన్‌, యువసేన లీడర్‌ రాహుల్‌ ఎస్‌ కనాల్‌ కలిసి బీయింగ్‌ హంగ్రీ ఫుడ్‌ ట్రక్స్‌ ద్వారా రోజూ ముంబైలోని ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కి, హోం ఐసోలేషన్లో ఉన్నవాళ్లకు ఆహారాన్ని సరఫరా చేస్తున్నారు. మరోవైపు, రాధే మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ ను.. కరోనాపై పోరాడుతున్న స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వానికి విరాళంగా అందజేస్తామని ప్రకటించింది. సల్మాన్ మూవీ కాబట్టి.. మొదటి రోజు భారీ కలెక్షన్లు వస్తాయని అభిప్రాయపడుతున్నారు.

  ఇటు ఓటీటీలో కూడా పే ఫర్ వ్యూ పద్దతిలో రిలీజ్ చేస్తుండటంతో.. మొదటిరోజు వసూళ్లు పాతిక కోట్లు దాటే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. దీంతో పెద్ద మొత్తంలో విరాళం అందుతుందని.. తెలుస్తుంది. వెండితెరపై ఎన్ని వేశాలేసినా.. హీరోల హృదయాల్లో మానవత్వం ఉంటుందని చెప్పడానికి.. దీన్నో ఉదాహరణగా తీసుకోవచ్చు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో సల్మాన్ తీసుకున్న నిర్ణయాన్ని అభినందిస్తున్నారు.
  Published by:Sridhar Reddy
  First published: