బాలీవుడ్లో ఇప్పటికీ కరోనా వ్యాప్తి ఆగడం లేదు. వరసగా అక్కడ ప్రముఖులు ఇప్పటికీ కరోనా బారిన పడుతూనే ఉన్నారు. తాజాగా మరో సూపర్ స్టార్ కూడా కోవిడ్ బారిన పడ్డాడు. రణబీర్ కపూర్‌కు కరోనా సోకింది. ఈయనకు కరోనా వచ్చినట్లు అతడి తల్లి నీతూ కపూర్ ట్వీట్ చేసంది. ప్రస్తుతం రణబీర్ చికిత్స పొందుతున్నాడని.. క్రమంగా కోలుకుంటున్నాడని తెలిపింది. తన కొడుకు ఆరోగ్యం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. ఆయన ఆరోగ్యం బాగుందని చెప్పింది నీతూ. 'రణబీర్ ఆరోగ్యంపై ఆందోళన వెలిబుచ్చుతున్న అందరికీ కృతజ్ఞతలు' అంటూ నీతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. రణబీర్ ఇంటి దగ్గరే ఉంటూ క్వారంటైన్లో ఉన్నాడు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడని.. వైద్యులు కూడా ఆయన అందుబాటులోనే ఉన్నారని తెలిపింది నీతూ. నీతూ ప్రకటనకు ముందుగానే ముందు కపూర్ కుటుంబీకులు రణబీర్ అనారోగ్యం పాలైనట్టు వెల్లడించారు. అయితే అది కరోనా అని మాత్రం చెప్పలేదు. దాంతో వెంటనే రణబీర్ తల్లి నీతూ కపూర్ వివరణ ఇచ్చింది. గతేడాది రణబీర్ తండ్రి రిషి కపూర్ కన్నుమూసారు. అప్పటి నుంచి కూడా ఈ కుటుంబం విషాదంలోనే ఉంది. రిషి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూనే ఉన్నారు. ప్రస్తుతం రణబీర్ బ్రహ్మాస్త్ర సినిమాలో నటిస్తున్నాడు. దాంతో పాటు మరో రెండు సినిమాలు కూడా ఈయన చేతిలో ఉన్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bollywood, Ranbir Kapoor, Telugu Cinema