• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • BOLLYWOOD STAR HERO BECOMING VILLAIN FOR PRABHAS SALAAR MHN

Prabhas: ప్ర‌భాస్ కోసం విల‌న్‌గా మారుతున్న బాలీవుడ్ స్టార్‌.. అది ప్ర‌భాస్ రేంజ్

Prabhas: ప్ర‌భాస్ కోసం విల‌న్‌గా మారుతున్న బాలీవుడ్ స్టార్‌.. అది ప్ర‌భాస్ రేంజ్

Bollywood Star hero becoming villain for Prabhas Salaar

Prabhas - Salaar: ప్రభాస్ టైటిల్ ప్రాతధారిగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘సలార్’ చిత్రంలో ఓ ప్రముఖ బాలీవుడ్ స్టార్ విలన్‌గా నటించే అవకాశాలున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి.

  • Share this:
    రెబ‌ల్‌స్టార్ ప్ర‌బాస్ .. ఇప్పుడు ఇండియ‌న్ సినీ ఇండ‌స్ట్రీలో ఈ పేరు సుప‌రిచితం. ఓతెలుగు సినీ అభిమానిగా మ‌నం గ‌ర్వించాల్సిన విష‌యం. బాహుబ‌లితో ప్యాన్ ఇండియా ఆర్టిస్ట్‌గా ప్ర‌భాస్ క్రేజ్ తెచ్చుకుని సాహో సినిమాతో బాలీవుడ్ జ‌నాల‌ను ఆక‌ట్టుకున్నాడు. దీంతో ఇప్పుడు ప్ర‌భాస్ వ‌రుస‌గా ప్యాన్ ఇండియా సినిమాల్లోనే న‌టించ‌డానికి గ్రీన్ సిగ్న‌ల్స్ ఇస్తూ వ‌స్తున్నాడు. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ చేస్తున్న సినిమా ‘రాధేశ్యామ్‌’. ఈ సినిమా షూటింగ్ తుది ద‌శ‌కు చేరుకుంది. దీని త‌ర్వాత ప్ర‌భాస్ ఏ సినిమా చేస్తాడు.. అనే దానికి క్లారిటీ కూడా వ‌చ్చేసింది. ఈ నెల 19 నుండి స‌లార్ సినిమా షూటింగ్ సెట్స్‌పైకి వెళ్ల‌నుంది.

    ఈ సినిమా ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటున్నాయి. లేటెస్ట్ స‌మాచారం మేర‌కు ఈ సినిమాలో ప్ర‌భాస్ ఇమేజ్‌కు ధీటుగా న‌టించే విల‌న్ ఎవ‌రా? అని అంద‌రూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజా స‌మాచారం మేర‌కు బాలీవుడ్ స్టార్ జాన్ అబ్ర‌హం.. స‌లార్ మూవీలో విల‌న్‌గా న‌టిస్తున్నాడ‌ని అందుకు సంబంధించిన చర్చ‌లు జరుగుతున్నాయ‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇప్ప‌టికే ప్ర‌భాస్ ఆదిపురుష్‌లో సైఫ్ అలీఖాన్ విల‌న్‌గా న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌భాస్ ఇమేజ్‌ను నెక్ట్స్ రేంజ్‌కు తీసుకెళ్లేలాగానే ఆయ‌న సినిమాలు రూపొందుతున్నాయి. దీంతో జాన్ అబ్ర‌హం కూడా ఓకే చెప్పడానికే ఎక్కువ అవ‌కాశాలున్నాయ‌ని టాక్ వినిపిస్తోంది. జాన్ అబ్ర‌హంకు విల‌న్‌గా న‌టించ‌డం కొత్తేమీ కాదు. చాలా బాలీవుడ్ సినిమాల్లో జాన్ అబ్ర‌హం విల‌న్‌గా న‌టించిన సంగ‌తి తెలిసిందే.

    prabhas, rebel star prabhas, pan india star prabhas, salaar, prabhas salaar, director prashanth neel, kgf director prashanth neel, bollywood star john abraham,johan abraham in salaar, సలార్, ప్రభాస్, జాన్ అబ్రహం
    Bollywood Star hero becoming villain for Prabhas Salaar


    ప్ర‌భాస్ హీరోగా న‌టిస్తోన్న స‌లార్ సినిమాను ప్ర‌శాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్నాడు. హోంబ‌లే ఫిలింస్ బ్యాన‌ర్ ఈ సినిమాను నిర్మిస్తుంది. మ‌రి కింగ్ మేక‌ర్‌గా ప్ర‌భాస్ న‌టిస్తోన్న ఈ చిత్రంలో కింగ్ పాత్ర‌లో న‌టించేది ఎవ‌రో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. ఇందులో దిశా ప‌టాని హీరోయిన్‌గా న‌టించే అవ‌కాశాలున్నాయ‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.
    Published by:Anil
    First published:

    అగ్ర కథనాలు