బాబోయ్ ఆ స్టార్ హీరో గే అంట.. విడుదలైన వీడియో..

నమ్మడానికి కాస్త కష్టంగా అనిపించినా కూడా ఇదే నిజం. వీడియో ప్రూఫ్ కూడా బయటికి రావడంతో అభిమానులు కూడా షాక్ అవుతున్నారు. అయితే ఇదంతా సినిమా కోసమే కానీ రియల్ లైఫ్‌లో మాత్రం కాదు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: January 20, 2020, 8:38 PM IST
బాబోయ్ ఆ స్టార్ హీరో గే అంట.. విడుదలైన వీడియో..
ప్రతీతాత్మక చిత్రం
  • Share this:
నమ్మడానికి కాస్త కష్టంగా అనిపించినా కూడా ఇదే నిజం. వీడియో ప్రూఫ్ కూడా బయటికి రావడంతో అభిమానులు కూడా షాక్ అవుతున్నారు. అయితే ఇదంతా సినిమా కోసమే కానీ రియల్ లైఫ్‌లో మాత్రం కాదు. బాలీవుడ్‌లో విభిన్నమైన కథలను ఎంకరేజ్ చేయడానికి ఎప్పుడూ ముందుండే హీరో ఆయుష్మాన్ ఖురానా. ఆయన మరోసారి ప్రయోగం చేస్తున్నాడు. కెరీర్‌ ఆరంభం నుంచి కూడా ఇలాంటి కథలే చేస్తున్నాడు ఈయన. తాజాగా ఈయన మరో బోల్డ్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. శుభ్‌ మంగళ్‌ సావధాన్‌ సినిమాతో ఇదివరకే ఓ హిట్ అందుకున్నాడు ఈయన. ఇక ఈ సినిమాకు సీక్వెల్‌గా ఇప్పుడు మరో సినిమా వస్తుంది.
Bollywood Star hero becomes Gay and Shubh Mangal Zyada Saavdhan trailer trending pk నమ్మడానికి కాస్త కష్టంగా అనిపించినా కూడా ఇదే నిజం. వీడియో ప్రూఫ్ కూడా బయటికి రావడంతో అభిమానులు కూడా షాక్ అవుతున్నారు. అయితే ఇదంతా సినిమా కోసమే కానీ రియల్ లైఫ్‌లో మాత్రం కాదు. ayushmann khurrana,ayushmann khurrana twitter,ayushmann khurrana instagram,ayushmann khurrana movies,ayushmann khurrana gay,ayushmann khurrana gay movie,ayushmann khurrana shubh mangal zyada saavdhan,shubh mangal zyada saavdhan trailer,shubh mangal zyada saavdhan movie,shubh mangal zyada saavdhan trailer review,hindi cinema,bollywood news,ఆయుష్మాన్ ఖురానా,ఆయుష్మాన్ ఖురానా శుభ్ మంగళ్ జ్యాదా సావధాన్,బాలీవుడ్
శుభ్ మంగళ్ జ్యాదా సావధాన్ ట్రైలర్

శుభ్ మంగళ్ జ్యాదా సావధాన్ అంటూ వస్తుంది ఈ చిత్రం. హితేశ్‌ కేవాల్యా దర్శకత్వంతో తెరకెక్కిన ఈ చిత్రంలో ఆయుష్మాన్ గేగా నటిస్తుండటం విశేషం. తాజాగా ట్రైలర్ విడుదలైంది. ఇది చూసిన తర్వాత సినిమా ఎలా ఉండబోతుందో క్లారిటీ వచ్చేసింది. కార్తీక్‌ సింగ్‌ పాత్రలో ఈ చిత్రంలో నటిస్తున్నాడు ఆయుష్మాన్‌ ఖురానా. ఆయనకు జితేంద్ర కుమార్ మధ్య జరిగే ప్రేమకథ ఈ చిత్రం. ఈ సినిమాలో కామెడీతో పాటు సామాజిక సందేశం కూడా ఉందని అర్థమవుతుంది. ట్రైలర్ చూస్తుంటేనే ఈ విషయం తెలిసిపోతుంది. నువ్వు గే అవ్వాలని ఎప్పుడు అనుకున్నావు అని హీరోను తండ్రి ప్రశ్నించడం చూస్తుంటే గే కహానీ అనేది అర్థమైపోతుంది.


కార్తీక్‌, అమన్‌ల మధ్య వచ్చే సన్నివేశాలు.. దిల్‌వాలే దుల్హనియా లేజాయేంగే సినిమా తరహా ట్రైన్ ఎపిసోడ్స్ అన్నీ ఆకట్టుకుంటున్నాయి. అక్కడ అమ్మాయితో పెళ్లి క్యాన్సిల్‌ చేసుకుని తాను ప్రేమించిన కార్తీక్‌ కోసం అమన్ పరిగెత్తుకుంటూ రావడం లాంటి సన్నివేశాలు అదిరిపోయాయి.. ఈ సినిమా ఫిబ్రవరి 21న విడుదల చేయబోతున్నారు. విక్కీ డోనర్‌ లాంటి సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఆయుష్మాన్.. ఆ తర్వాత అంధాదున్‌, బదాయి హో వంటి సినిమాలతో హిట్స్ అందుకున్నాడు. నేషనల్ అవార్డ్ కూడా అందుకున్నాడు ఆయుష్మాన్ ఖురానా. మొత్తానికి ఈ చిత్రంతో ఆయుష్మాన్ ఎలాంటి మాయ చేస్తాడో చూడాలిక.

First published: January 20, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు