మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమాకు కమిటయ్యాడు. పరశురామ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇంకా మొదలు కాలేదు. త్వరలోనే మొదలవుతుంది.. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తుంటే ఇప్పట్లో షూటింగ్ మొదలయ్యేలా కూడా కనిపించడం లేదు. కరోనా పోయేవరకు కూడా మహేష్ బాబు షూటింగ్‌కు మాత్రం రాడు. అది క్లియర్.. దాంతో ఇప్పుడు షూటింగ్ గొడవ అయితే లేదు కానీ ప్రీ ప్రొడక్షన్ పనులు మాత్రం వేగంగానే జరుగుతున్నాయి.
ఈ సినిమాలో మహేష్‌కు జోడీగా మహానటి కీర్తి సురేష్ నటిస్తుంది. పూర్తిగా డిఫెరెంట్ కథతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు పరశురామ్. ఇప్పటి వరకు మహేష్ చేసిన సినిమాలతో పోలిస్తే ఇది భిన్నంగా ఉండబోతుంది. కార్పోరేట్ బ్యాంకింగ్ మోసాలను హైలైట్ చేస్తూ సర్కారు వారి పాట ఉండబోతుంది. ఇందులో విలన్‌గా బాలీవుడ్ స్టార్ హీరో అనిల్ కపూర్ నటించబోతున్నాడని ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే దర్శకుడు పరశురామ్ ముంబై వెళ్లడం.. అనిల్ కపూర్‌కు కథ చెప్పి ఒప్పించడం కూడా జరిగిపోయాయని తెలుస్తుంది.
దాంతో పాటు మరో షాకింగ్ అప్డేట్ కూడా వస్తుంది. ముందు దీన్ని తెలుగులో తెరకెక్కించాలనే ప్లాన్ ఉన్నా.. ఇప్పుడు మాత్రం పాన్ ఇండియన్ సినిమా చేయాలనుకుంటున్నారని తెలుస్తుంది. అందుకే విలన్‌గా అనిల్ కపూర్‌ను సంప్రదిస్తున్నారు దర్శక నిర్మాతలు. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్, మహేష్ బాబు జిఎంబి సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మొత్తానికి అనిల్ కపూర్ విలన్‌గా నటిస్తే మాత్రం కచ్చితంగా సినిమా రేంజ్ పెరిగిపోవడం ఖాయం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anil Kapoor, Mahesh babu, Telugu Cinema, Tollywood