KBCలో కంటెస్టెంట్ కాళ్లు మొక్కిన అమితాబ్ బచ్చన్..

సినిమా ఇండస్ట్రీలోనే ఆయనకు ఎంతో మంది అభిమానులున్నారు. అంతేకాదు ఆయన ఎదురు పడితే.. ఆయన ఆశీర్వాదం తీసుకోవాలనే అభిమానులు ఎంతో మంది ఉన్నారు.

news18-telugu
Updated: August 23, 2019, 8:54 PM IST
KBCలో కంటెస్టెంట్ కాళ్లు మొక్కిన అమితాబ్ బచ్చన్..
అమితాబ్ బచ్చన్ కేబీసీ (ఫైల్ ఫోటో)
  • Share this:
బాలీవుడ్ షెహెన్‌షా అమితాబ్ బచ్చన్.. ఏజ్ పెరుగుతున్న ఆయన క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు. సినిమా ఇండస్ట్రీలోనే ఆయనకు ఎంతో మంది అభిమానులున్నారు. అంతేకాదు ఆయన ఎదురు పడితే.. ఆయన ఆశీర్వాదం తీసుకోవాలనే అభిమానులు ఎంతో మంది ఉన్నారు. ఇటువంటి ట్రాక్ రికార్డు ఉన్న అమితాబ్ బచ్చన్.. కౌన్ బనేగా కరోడ్‌పతి షోలో ఒక పెద్దావిడా కాళ్లు మొక్కడం చర్చనీయాంశం అయింది. ఇంతకీ ఆ పెద్దావిడ విషయానికొస్తే.. సిందుతాయ్ అనే సామాజిక వేత్త గత కొన్నేళ్లుగా ఎంతో మంది అనాథలను చేరదీస్తూ అన్నీ తానై చూసుకుంటోంది. ఇటీవలే ప్రసారమైన ఎపిసోడ్‌లో సింధూతాయ్ పాల్గొన్నారు.

ఈ చారిటీ ఎపిసోడ్‌లో సింధూతాయ్.. అమితాబ్‌ను తన కొడుకు అంటూ మరాఠీలో ఒక పద్యాన్ని పాడారు. ఈ వేదికపై అమితాబ్ ఆమె గురించి కొన్ని విషయాలు అడిగి ప్రేక్షకులకు తెలియపరిచారు. ఈ సందర్భంగా సింధూతాయ్ చెప్పిన విషయాలకు భావోద్వేగానికి లోనైనా అమితాబ్ బచ్చన్.. సీటు నుంచి లేచి మరి ఆమెకు పాదాభివందనం చేసారు. ఈ వీడియోను అమితాబ్ ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తూ.. ఎంతో మందికి స్పూర్తిగా నిలిచిన ఈ మాతృమూర్తిని గౌరవించడాన్ని ఎంతో గర్వంగా ఫీలవుతున్నాను అంటూ ట్వీట్ చేసాడు.

First published: August 23, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...