BOLLYWOOD STAR HERO AKSHAY KUMAR DONATES RUPEES 1 CRORE TO ASSAM AND BIHAR FLOOD VICTIMS TA
మరోసారి పెద్ద మనసు చాటుకున్న అక్షయ్.. అస్సాం,బిహార్ వరద బాధితులకు భారీ విరాళం..
అక్షయ్ కుమార్ Photo : Twitter
బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ సంపాదనలో కాదు.. తను సంపాదించిన దాంట్లో దాన ధర్మాలు కూడా చేయడంలో కూడా ఎపుడు ముందుంటాడు. తాజాగా అక్షయ్ కుమార్.. బిహార్, అస్సాం వరద బాధితులకు తన వంతు సాయం అందజేసారు.
బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ సంపాదనలో కాదు.. తను సంపాదించిన దాంట్లో దాన ధర్మాలు కూడా చేయడంలో కూడా ఎపుడు ముందుంటాడు. ఇప్పటికే కరోనా పై పోరులో ప్రధాన మంత్రి సహాయ నిధికి ఏకంగా రూ. 25 కోట్ల విరాళం ప్రకటించి ఔరా అనిపించాడు. ఆ తర్వాత ముంబాయి మున్సిపల్ కార్పోరేషన్ ఉద్యోగులతో పాటు.. ముంబాయి పోలీస్ అసోసియేషన్‌కు మరో రూ. 5 కోట్ల విరాళం ప్రకటించి తన పెద్ద మనసు చాటుకున్నడు. తాజాగా ఈయన మరోసారి తన దాతృత్వంతో మరోసారి వార్తల్లో నిలిచారు. తాజాగా ఈయన బిహార్ రాష్ట్రంతో పాటు.. అస్సాం రాష్ట్రంలో వరద బాధితుల సహాయార్ధం చెరో రూ. కోటి రూపాయల సాయాన్ని ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రి సహాయనిధికి అందజేసారు. గతంలో కూడా ఒరిస్సాతో పాటు పలు ఘటనల్లో కన్నుమూసిన పోలీసుల జవానులకు తన వంతు సాయం ప్రకటించారు అక్షయ్ కుమార్. అక్షయ్ కుమార్ విరాళం అందించిన విషయాన్ని అస్సాం ముఖ్యమంత్రి సర్వానంద్ సోనేవాల్ ట్విట్టర్ వేదికగా తెలిపారు.
Thank you @akshaykumar ji for your kind contribution of ₹1 crore towards Assam flood relief. You have always shown sympathy and support during periods of crisis. As a true friend of Assam, may God shower all blessings to you to carry your glory in the global arena.
ప్రస్తుతం అక్షయ్ కుమార్.. హీరోగా నటించిన ‘లక్ష్మీ బాంబ్’ చిత్రం త్వరలో డిస్నీ హాట్ స్టార్‌లో విడుదల కానుంది. మరోవైపు ఈయన నటించిన ‘సూర్యవంశీ’ కూడా థియేటర్స్ ఓపెన్ అయ్యాక రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఇంకోవైపు అక్షయ్ కుమార్.. ‘బెల్ బాటమ్’ చిత్రానికి సంబంధించిన షూటింగ్లో పాల్గొంటున్నారు.