అక్షయ్ కుమార్.. బాలీవుడ్లో ఈయన ఎంత పెద్ద హీరో అనేది ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఇప్పుడంటే కరోనా వచ్చింది కానీ లేదంటే మాత్రం ఏడాదికి నాలుగు సినిమాలు విడుదల చేస్తాడు ఈయన. పక్కా టైమింగ్ ప్రకారం వరస సినిమాలు చేస్తూ ఉంటాడు ఖిలాడీ. ఒక్కో సినిమాకు ఈయన 110 నుంచి 130 కోట్ల మధ్యలో తీసుకుంటాడు. సినిమాను బట్టి.. కథను బట్టి తన రేట్ ఫిక్స్ చేస్తాడు అక్షయ్ కుమార్. ఆయనతో సినిమాలు చేయడానికి నిర్మాతలు కూడా అదే స్థాయిలో ఆసక్తి చూపిస్తుంటారు. ఎందుకంటే ఒక్కో సినిమా కనీసం 150 నుంచి 200 కోట్ల మధ్యలో బిజినెస్ చేస్తుంటుంది. హిట్ అయితే మరింత ఎక్కువ కూడా వసూలు చేస్తుంది. అన్నింటికి మించి తన రెమ్యునరేషన్ కాకుండా ఒక్క రూపాయి కూడా ఆయన ఎక్కువ తీసుకోడని పేరుంది. మిగిలిన హీరోల మాదిరి లాభాల్లో వాటాలు.. అవి ఇవి అంటూ అడిగే అలవాటు అక్షయ్ కుమార్కు లేదు. తనకు కావాల్సిన 110 కోట్లు తీసుకుని సినిమా పూర్తి చేస్తాడంతే. అయితే ఇప్పుడు ఈయన తన రేట్ కాస్త తగ్గించుకున్నట్లు తెలుస్తుంది. ఇప్పుడు కరోనా పరిస్థితుల కారణంగా నిర్మాతలకు కూడా చాలా నష్టాలు వచ్చాయి.
అందుకే తన రెమ్యునరేషన్లో 20 కోట్లు కోసేసుకున్నాడు అక్షయ్ కుమార్. ఇప్పట్నుంచి సినిమాకు తన పారితోషికం 99 కోట్లు మాత్రమే అంటున్నాడు. అంటే దాదాపు 21 కోట్లు కట్ చేసుకున్నాడు ఈ స్టార్ హీరో. ఒక్కో సినిమాకు 99 కోట్లా అంటూ మనోళ్లు నోరెళ్లబెడుతున్నారు కానీ అక్షయ్ కుమార్తో సినిమాలు చేస్తున్న నిర్మాతలకు మాత్రం ఇది నిజంగా శుభవార్తే.
ప్రస్తుతం సాజిద్ నడియావాలా రూపొందిస్తున్న బచ్చన్ పాండే సినిమా కోసం అక్షయ్ కుమార్ 99 కోట్లు తీసుకుంటున్నాడని తెలుస్తుంది. గతంలో ఈయనతో చేసిన సినిమాల కోసం 110 కోట్లకు పైగానే తీసుకున్నాడు ఖిలాడీ. కానీ ఇప్పుడు కరోనా కారణంగా రేటులో రిబేట్ ఇచ్చాడు. ప్రస్తుతం అరడజన్ సినిమాలతో బిజీగా ఉన్నాడు అక్షయ్ కుమార్. మొత్తానికి ఈయన పారితోషికం తగ్గించుకున్న విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Akshay Kumar, Bollywood, Hindi Cinema