RRRలో అజయ్ దేవ్‌గణ్ క్యారెక్టర్‌ ఇదే.. రాజమౌళి స్కెచ్ మాములుగా లేదుగా..

RRR | ఆర్ఆర్ఆర్ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ అజయ్ దేవ్‌గణ్ ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నాడు. తాజాగా ఈయన ఈ సినిమా షూటింగ్‌లో జాయిన్ అయ్యాడు. ఈ చిత్రంలో అజయ్ దేవ్‌గణ్..

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: January 30, 2020, 2:54 PM IST
RRRలో అజయ్ దేవ్‌గణ్ క్యారెక్టర్‌ ఇదే.. రాజమౌళి స్కెచ్ మాములుగా లేదుగా..
RRR సినిమాలో చరణ్,అజయ్,ఎన్టీఆర్,జక్కన్న ఫోటో (RRR movie shooting pic)
  • Share this:
రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ చిత్రంలో బాహుబలి క్యారెక్టర్‌తో పాటు భళ్లాల దేవుడు, రాజమాత శివగామి పాత్రలకు ఎంతో ఇంపార్టెంట్ ఇచ్చాడు. ‘బాహుబలి’లో వీళ్లతో పాటు మరో ముఖ్యమైన పాత్ర కట్టప్ప. ఈసినిమా మొత్తంలో ఈ ముగ్గురి తర్వాత బాహుబలిలో అంత పవర్‌‌ఫుల్ క్యారెక్టర్ కట్టప్ప. ముఖ్యంగా ఈ సినిమాలో బాహుబలిని కట్టప్పతో వెన్నుపోటు పొడిచి ఎందుకు చంపాడన్నా దానిపై ఆసక్తి రేకెత్తించి ‘బాహుబలి 2’ సినిమా కోసం ఎదురు చూసేలా చేయడంలో రాజమౌళి సక్సెస్ అయ్యాడు. ఇపుడు ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో 1920 బ్యాక్ డ్రాప్‌తో అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ వంటి మహనీయులు జీవితాలను ఆదర్శంగా తీసుకొని దానికి కొంత కాల్పనిక కథ జోడించి RRR సినిమాను తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ అజయ్ దేవ్‌గణ్ ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నాడు. తాజాగా ఈయన ఈ సినిమా షూటింగ్‌లో జాయిన్ అయ్యాడు. ఇప్పటికే వికారాబాద్‌ అడవుల్లో అజయ్ దేవ్‌గణ్‌, శ్రియలతో పాటు ఇతర ముఖ్య తారాగణంతో కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో అజయ్ దేవ్‌గణ్ రామ్ చరణ్ తండ్రి పాత్రలో ఇండో టిబెటన్ పోలీస్ అధికారిగా  కనిపించబోతున్నట్టు సమాచారం. తాజాగా అజయ్ దేవ్‌గణ్, ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళిలతో కూడిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

RRR సినిమా లొకేషన్ ఫోటో (RRR movie shooting pic)
RRR సినిమా లొకేషన్ ఫోటో (RRR movie shooting pic)


మరోవైపు ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ వంటి పాత్రలు చేస్తున్న హీరోలకు ప్రేరణగా నిలిచే పాత్రలో అజయ్ దేవ్‌గణ్ నటించబోతున్నట్టు సమాచారం. బాహుబలిలో కట్టప్ప పాత్ర ఎంత పవర్‌ఫుల్లో ఆర్ఆర్ఆర్ సినిమాలో అజయ్ దేవ్‌గణ్ పాత్ర అంత పవర్‌ఫుల్‌గా ఉండబోతున్నట్టు సమాచారం. గతంలో రాజమౌళి తెరకెక్కించిన ‘ఈగ’ హిందీ డబ్బింగ్ వెర్షన్‌కు అజయ్ దేవ్‌గణ్... వాయిస్ ఓవర్ అందించాడు. అప్పటి నుంచి వీళ్లిద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. దీంతో RRR సినిమాలో ముఖ్యపాత్ర ఉందనగానే అజయ్ వెంటనే ఈ సినిమా ఒప్పుకున్నాడు. అన్ని భాషల్లో RRR టైటిల్ ఉన్నా ఆయా భాషల్లో వేరే టైటిల్స్ వచ్చేటట్టు ఈ సినిమా టైటిల్ ఉంటుందని రాజమౌళి ఇప్పటికే చెప్పిన సంగతి తెలిసిందే కదా. మరోవైపు ఆర్ఆర్ఆర్ సినిమాను ఈ ఇయర్ జూలై 30న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.

RRR..Ajay devgn another Two Bollywood Stars Sanjay dutt,Varun dhawan Also to be part Of the NTR,Ram Charan,Rajamouli's RRR Project,ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా దాదాపు రూ.400 కోట్ల బడ్జెట్‌తో 1920ల కాలం నాటి స్టోరీతో స్వాతంత్య్ర సమరయోధులు కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజుల స్టోరీకి కొంచెం ఫిక్షన్ స్టోరీజోడించి ఈసినిమాను అత్యంత భారీగా తెరకెక్కిస్తున్నాడు దర్శక ధీరుడు రాజమౌలి. మరోవైపు ఈ సినిమాలో కథ ప్రకారం మరో ఇద్దరు హీరోలకు ఛాన్స్ ఉందని చెబుతున్నారు. దీని కోసం బాలీవుడ్‌కు చెందిన ఇద్దరు అగ్ర నటులను తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారు.RRR,RRR movie,RRR Rajamouli Ram charan NTR,RRR ram charan ntr rajamouli ajay devgn,Andhra pradesh News,Andhra pradesh Politics,rrr rajamouli ntr ajay devgan sanjay dutt varun dhawan,rrr rajamouli ntr ajay devgan sanjay dutt varun dhawan alia bhatt Daisy Edgar Jones,rrr raghupathi raghava rajaram,bollywood,tollywood,telugu cinema,ఆర్ఆర్ఆర్,ఆర్ఆర్ఆర్ రాజమౌళి రామ్ చరణ్ ఎన్టీఆర్,ఆర్ఆర్ఆర్ రామ్ చరణ్ ఎన్టీఆర్ రాజమౌళి అజయ్ దేవ్‌గణ్,ఆర్ఆర్ఆర్ రాజమౌళి ఎన్టీఆర్ అజయ్ దేవ్‌గణ్ వరుణ్ ధావన్ సంజయ్ దత్,ఆర్ఆర్ఆర్ రాజమౌళి ఎన్టీఆర్ అజయ్ దేవ్‌గణ్ వరుణ్ ధావన్ సంజయ్ దత్ అలియా భట్ డైసీ ఎడ్గర్ జోన్స్,బాలీవుడ్ న్యూస్,టాలీవుడ్ న్యూస్,తెలుగు సినిమా
RRR లో అజయ్ దేవ్‌గణ, ఎన్టీఆర్, రామ్ చరణ్


అంతేకాదు హాలీవుడ్‌లో తెరకెక్కిన ‘మోటర్ సైకిల్ డైరీస్’లో కొన్ని సీన్స్‌ను ప్రేరణగా తీసుకుని తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన ఆలియా భట్.. ఎన్టీఆర్ ఒలివియా మోరీస్, అజయ్ దేవ్‌గణ్ సరసన శ్రియ కథానాయికలుగా నటిస్తున్నారు. మొత్తానికి ఆర్ఆర్ఆర్‌‌తో రాజమౌళి భారతీయ చిత్ర పరిశ్రమలో మరో చరిత్రను లిఖించి తాను నెలకొల్పిన రికార్డులను తానే బ్రేక్ చేస్తాడా లేదా అనేది చూడాలి.
Published by: Kiran Kumar Thanjavur
First published: January 30, 2020, 2:54 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading