Home /News /movies /

BOLLYWOOD STAR COUPLE DEEPIKA PADUKONE AND RANVEER SINGH RAMP WALK VIDEO HAS GONE VIRAL SNR

Bollywood | Viral Video: రాయల్‌ కపుల్‌ లుక్కులో బాలీవుడ్ సూపర్‌ జోడి ..వైరల్ అవుతున్న దీపికాపదుకొనె, రణవీర్‌సింగ్‌ ర్యాంప్‌ వాక్ వీడియో

(Photo Credit:Instagram)

(Photo Credit:Instagram)

DEEPIKA RANVEER: బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వాళ్లిద్దరూ సూపర్‌ లవర్స్. కాని షడన్‌గా రాయల్‌ కపుల్స్‌ లుక్‌లో రెడ్ కార్పెట్‌పై తళుక్కున మెరిపోయారు. దీపికాపదుకొనె, రణవీర్‌సింగ్‌ లేటెస్ట్ వీడియో ఇప్పుడు నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది.

ఇంకా చదవండి ...
బాలీవుడ్ హార్ట్‌త్రోబ్ దీపికాపుదుకొణె(Deepika Padukone), క్రేజీ హీరో రణవీర్‌సింగ్(Ranveer Singh)జోడి గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇప్పటి వరకు ఈ స్టార్ కపుల్ ఎయిర్‌పోర్ట్‌లో, నైట్‌ పార్టీలో, రెడ్ కార్పెట్‌పై కలిసి దర్శనమిచ్చిన వీడియోలు సోషల్ మీడియాలో పుష్కలంగా చూశాం. కాని రీసెంట్‌గా ఈ సూపర్‌ జోడి ఎత్నిక్ వేర్‌(Ethnic wear)లో రాయల్‌ కపుల్‌ తరహాలో ర్యాంప్‌ వాక్ (Ramp walk)చేస్తూ బాలీవుడ్(Bollywood)ఆడియన్స్‌తో పాటు అందర్ని ఆశ్చర్యానికి గురి చేశారు. వీళ్లిద్దరూ కలిసి చేతులు పట్టుకొని నడిచి వస్తుంటే సెలబ్రిటీలు ఫ్లైయింగ్‌ కిస్‌లు ఇస్తుంటే రాయల్ జోడి చిరునవ్వులతో తుఫాను సృష్టించారు.

సూపర్ జోడి..
ఏ షోకి హోస్ట్‌గా వెళ్లినా ..స్టార్ ఈవెంట్ ఏదైనా చాలా ఉత్సహాంగా కనిపిస్తాడు రణ్‌వీర్‌సింగ్. కాని ఫస్ట్‌ టైమ్‌ లైఫ్ పార్టనర్‌తో కలిసి ర్యాంప్‌పై సిగ్గుపడుతూ అడుగులో అడుగులు వేస్తున్న వీడియో ఇప్పుడు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. ఈ సూపర్ జోడి కలిసి అడుగులు వేస్తున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మనీష్ మల్హోత్రా మిజ్వాన్‌ కలెక్షన్‌ ప్రారంభించి పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ ఈవెంట్‌ని ఏర్పాటు చేస్తే అందులో రణ్‌వీర్, దీపికా జోడి సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా నిలిచారు.




స్టైలీ లుక్స్ అదుర్స్ ..
ఈ స్టార్‌ కపుల్ నడిచి వస్తుంటే అద్భుతమైన మ్యూజిక్ బ్యాక్ గ్రౌండ్‌తో అక్కడికి వచ్చిన వాళ్లతో పాటు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. దీపికా పదుకొణె టాప్‌ టు బాటమ్ మెరిసిపోయే గులాబీ రంగు లెహంగాలో దర్శనమిచ్చింది. అందమైన బ్లౌజ్ స్వీట్ హార్ట్ నెక్‌లైన్‌తో పాటు పవర్ షోల్డర్‌తో దాని మీద దుపట్టా పందిరితో వచ్చింది. లేటెస్ట్ టచప్‌తో డిజైన్ చేసిన లెహంగాలో దీపికా షార్ట్ హెయిర్‌ స్టైల్‌తో మరింత గ్లామరస్‌గా కనిపించింది. ఇక కళ్లకు స్మోకీ ఐ మేకప్ పంచ్‌ను ప్యాక్ చేసింది.

Mrunal Thakur: రష్మికకు అవి ఎక్కువే.. సెట్స్‌లో అలానే ఉంటుంది.. మృణాల్ ఆసక్తికర వ్యాఖ్యలు.. !


ప్రియురాలితో మన్మధుడు..
స్టార్ కాస్ట్యూమ్స్‌లో తన కంటే సూపర్‌ మోడల్‌ ఎవరూ ఉండరన్నట్లుగా తయారయ్యే రణ్‌వీర్‌కపూర్ మరోసారి అదే లుక్స్‌తో అందర్ని ఆకర్షించాడు. ట్రెడిషనల్‌ ఎంబ్రాయిడరీ చేసిన బంధ్‌గాలాను నల్ల ప్యాంటుతో టాసెల్డ్ షూస్‌ వేసుకొని దీపికా పదుకొణెతో అడుగులో అడుగులు వేశాడు.

వీడియో వైరల్ ..
ఫస్ట్‌ టైమ్‌ ఈ స్టార్ కపుల్‌ ఇంత హుందాగా, స్టైల్‌గా ర్యాంప్‌ వాక్ కలిసి చేయడం ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌గా మారింది. ఈ రెడ్ కార్పెట్‌పై నడుస్తూనే రణవీర్‌సింగ్‌ దీపికాను ముద్దుపెట్టుకోవడంతో వాళ్లిద్దరి మధ్య క్లోజ్‌ లవ్‌ని అందరి ముందు ఓపెన్ చేసినట్లుగా అనిపించింది.
Published by:Siva Nanduri
First published:

Tags: Bollywood, Deepika Padukone, Ranveer Singh

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు