అల్లు అర్జున్ డాన్స్ చూసి ఆహా అంటున్న బాలీవుడ్ స్టార్..

Allu Arjun Dance: తెలుగు ఇండస్ట్రీలో డాన్సులు అంటే ముందుగా గుర్తుకొచ్చేది మెగాస్టార్ చిరంజీవి. ఆయన కుటుంబం నుంచి వచ్చిన హీరోల్లో ఇప్పుడు డాన్సులు అంటే బాగా పేరు తెచ్చుకున్నది అల్లు అర్జున్.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: May 13, 2020, 7:39 PM IST
అల్లు అర్జున్ డాన్స్ చూసి ఆహా అంటున్న బాలీవుడ్ స్టార్..
అల వైకుఠపురములో అల్లు అర్జున్ (Ala Vaikuntapurramuloo)
  • Share this:
తెలుగు ఇండస్ట్రీలో డాన్సులు అంటే ముందుగా గుర్తుకొచ్చేది మెగాస్టార్ చిరంజీవి. ఆయన కుటుంబం నుంచి వచ్చిన హీరోల్లో ఇప్పుడు డాన్సులు అంటే బాగా పేరు తెచ్చుకున్నది అల్లు అర్జున్. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లాంటి హీరోలు కూడా అద్భుతమైన డాన్సులు చేస్తారు కానీ బన్నీ మాత్రం కాస్త ముందుంటాడు. ఎందుకంటే మిగిలిన హీరోలు తెలుగు వరకు మాత్రమే పాపులర్ అయ్యారు.. కానీ బన్నీ డాన్సులు మాత్రం బాలీవుడ్‌లో కూడా రప్ఫాడిస్తున్నాయి. అక్కడ కూడా అల్లు అర్జున్ గురించి ఆరా తీస్తున్నారు హీరోలు. దర్శకులు కూడా బన్నీ సినిమాలపై కాన్సట్రేట్ చేస్తున్నారు. హీరోలైతే అల్లు అర్జున్ డాన్సులు కాపీ కొడుతున్నారు.
అల్లు అర్జున్ (Twitter/Photo)
అల్లు అర్జున్ (Twitter/Photo)


ఇక ఇప్పుడు బన్నీ డాన్సులకు మరో బాలీవుడ్ స్టార్ ఫిదా అయిపోయాడు. ఆయనే షాహిద్ కపూర్.. అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్ సినిమాతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన ఈయన.. ఇప్పుడు జెర్సీ రీమేక్‌తో బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలోనే అల వైకుంఠపురములో సినిమాలోని బన్నీ డాన్సులు చూసి ఫిదా అయిపోయాడు ఈయన. ఈ ఏడాది ఎవరు ఎక్కడా చూసినా కూడా బన్నీ పాటలు, డాన్సుల గురించే మాట్లాడుకుంటున్నారు. భాష రాని వాళ్లు కూడా అల వైకుంఠపురములో పాటలకు స్టెప్పులేస్తుంటే బన్నీ క్రేజ్ ఏ స్థాయిలో పెరిగిపోయిందో అర్థమైపోతుంది.
అల్లు అర్జున్ షాహిద్ కపూర్ (allu arjun shahid kapoor)
అల్లు అర్జున్ షాహిద్ కపూర్ (allu arjun shahid kapoor)

ఈ క్రమంలోనే షాహిద్ కపూర్ కూడా తనకు అల్లు అర్జున్ డాన్స్‌లు అంటే చాలా యిష్టమని.. ఆయన డాన్సులకు తాను పెద్ద అభిమానినని తెలిపాడు. ఈ మధ్యే షాహిద్ సోషల్ మీడియాలో అభిమానులతో మాట్లాడుతున్నప్పుడు ఓ అభిమాని అల్లు అర్జున్ గురించి ఓ మాటలో చెప్పండి అని ప్రశ్నించినప్పుడు 'నేను తన డాన్సింగ్ స్కిల్స్‌ను ఇష్టపడతాను' అని షాహిద్ సమాధానమిచ్చాడు. త్వరలోనే పుష్ప సినిమాతో బాలీవుడ్‌కు వెళ్తున్నాడు బన్నీ. మరి అక్కడ ఈయనెలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలిక.
Published by: Praveen Kumar Vadla
First published: May 13, 2020, 7:39 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading