స్టార్ హీరోకు షాక్.. హోమో సెక్సువల్ సినిమా చేసాడని బ్యాన్..

Shubh Mangal Zyada Saavdhan Review: బాలీవుడ్‌లో విభిన్నమైన కథలను ఎంకరేజ్ చేయడానికి ఎప్పుడూ ముందుండే హీరో ఆయుష్మాన్ ఖురానా. ఆయన మరోసారి ప్రయోగం చేస్తున్నాడు. కెరీర్‌ ఆరంభం నుంచి కూడా ఇలాంటి కథలే చేస్తున్నాడు ఈయన.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: February 21, 2020, 6:15 PM IST
స్టార్ హీరోకు షాక్.. హోమో సెక్సువల్ సినిమా చేసాడని బ్యాన్..
ప్రతీతాత్మక చిత్రం
  • Share this:
బాలీవుడ్‌లో విభిన్నమైన కథలను ఎంకరేజ్ చేయడానికి ఎప్పుడూ ముందుండే హీరో ఆయుష్మాన్ ఖురానా. ఆయన మరోసారి ప్రయోగం చేస్తున్నాడు. కెరీర్‌ ఆరంభం నుంచి కూడా ఇలాంటి కథలే చేస్తున్నాడు ఈయన. తాజాగా ఈయన మరో బోల్డ్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. శుభ్‌ మంగళ్‌ సావధాన్‌ సినిమాతో ఇదివరకే ఓ హిట్ అందుకున్నాడు ఈయన. ఇక ఈ సినిమాకు సీక్వెల్‌గా ఇప్పుడు మరో సినిమా వచ్చింది. శుభ్ మంగళ్ జ్యాదా సావధాన్ అంటూ ఈ వారమే వచ్చింది ఈ చిత్రం. హితేశ్‌ కేవాల్యా దర్శకత్వంతో తెరకెక్కిన ఈ చిత్రానికి ఇండియాలో యావరేజ్ రివ్యూస్ వచ్చాయి. పర్లేదు అంటున్నారు కానీ ఖురానా ముందు సినిమాల మాదిరి బాగుందని మాత్రం చెప్పడం లేదు.
శుభ్ మంగళ్ జ్యాదా సావధాన్ రివ్యూ (Shubh Mangal Zyada Saavdhan review)
శుభ్ మంగళ్ జ్యాదా సావధాన్ రివ్యూ (Shubh Mangal Zyada Saavdhan review)

కార్తీక్‌ సింగ్‌ పాత్రలో ఈ చిత్రంలో నటించాడు ఆయుష్మాన్‌ ఖురానా. ఆయనకు జితేంద్ర కుమార్ మధ్య జరిగే ప్రేమకథ ఈ చిత్రం. ఈ సినిమాలో కామెడీతో పాటు సామాజిక సందేశం కూడా ఉందని అర్థమవుతుంది. ట్రైలర్ చూస్తుంటేనే ఈ విషయం తెలిసిపోతుంది. నువ్వు గే అవ్వాలని ఎప్పుడు అనుకున్నావు అని హీరోను తండ్రి ప్రశ్నించడం చూస్తుంటే గే కహానీ అనేది అర్థమైపోతుంది. కార్తీక్‌, అమన్‌ల మధ్య వచ్చే సన్నివేశాలు.. దిల్‌వాలే దుల్హనియా లేజాయేంగే సినిమా తరహా ట్రైన్ ఎపిసోడ్స్ అన్నీ ఆకట్టుకున్నాయి. అక్కడ అమ్మాయితో పెళ్లి క్యాన్సిల్‌ చేసుకుని తాను ప్రేమించిన కార్తీక్‌ కోసం అమన్ పరిగెత్తుకుంటూ రావడం లాంటి సన్నివేశాలు అదిరిపోయాయి.. ఈ సినిమా ఫిబ్రవరి 21న విడుదలైంది.

ఆయుష్మాన్ ఖురానా (shbu mangal jyada saavadhan review)
ఆయుష్మాన్ ఖురానా (shbu mangal jyada saavadhan review)

విక్కీ డోనర్‌ లాంటి సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఆయుష్మాన్.. ఆ తర్వాత అంధాదున్‌, బదాయి హో వంటి సినిమాలతో హిట్స్ అందుకున్నాడు. నేషనల్ అవార్డ్ కూడా అందుకున్నాడు ఆయుష్మాన్ ఖురానా. ఇక ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసినా కూడా దుబాయ్‌లో మాత్రం బ్యాన్ చేసారు. అరబ్ దేశాలైన దుబాయ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ఈ సినిమాపై నిషేధం విధించారు. నిర్మాతలు సినిమాలో కొన్ని సన్నివేశాలను కత్తిరిస్తామని చెప్పినా కూడా హోమో సెక్సువల్ కథ ఉన్నందున సినిమాను బ్యాన్ చేసారు. బాలీవుడ్ సినిమాలకు అక్కడ మంచి వసూళ్లే వస్తాయి. ఇప్పుడు అక్కడ బ్యాన్ చేయడంతో కచ్చితంగా ప్రభావం పడుతుందని తెలుస్తుంది.

First published: February 21, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు