ప్రైవేట్ పార్ట్స్ చూపిస్తే ఆఫర్ ఇస్తానన్నాడు.. స్టార్ హీరోకు అవమానం..

ఆయుష్మాన్ ఖురానా (Ayushmann Khurrana)

Casting Couch: ఇండస్ట్రీలో అమ్మాయిలకే కాదు అబ్బాయిలకు కూడా రక్షణ లేదనే వాదన చాలా రోజులుగా వినిపిస్తుంది. అమ్మాయిలు బయటికి వచ్చి తమకు జరిగిన సంఘటనల గురించి చెప్పుకుంటున్నారు..

  • Share this:
ఇండస్ట్రీలో అమ్మాయిలకే కాదు అబ్బాయిలకు కూడా రక్షణ లేదనే వాదన చాలా రోజులుగా వినిపిస్తుంది. అమ్మాయిలు బయటికి వచ్చి తమకు జరిగిన సంఘటనల గురించి చెప్పుకుంటున్నారు.. అబ్బాయిలు చెప్పుకోలేకపోతున్నారు. ఇక్కడ అవకాశాల కోసం అమ్మాయిలనే కాదు అబ్బాయిలను వేధించే వాళ్లు కూడా ఉన్నారని చాలా మంది చెప్పారు. సాక్షాత్తు సన్నీలియోన్ కూడా ఇదే చెప్పింది. ఇప్పుడు బాలీవుడ్‌ హీరో ఆయుష్మాన్‌ ఖురానా కూడా ఇదే కన్ఫర్మ్ చేసాడు. తన జీవితంలో తానే క్యాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్నానని చెప్పి సంచలనం సృష్టించాడు ఆయుష్మాన్. ఓ ఇంటర్వ్యూలో తనకు ఎదురైన చేదు అనుభవాలను గుర్తు చేసుకున్నాడు ఈ హీరో.

ఆయుష్మాన్ ఖురానా (Ayushmann Khurrana)
ఆయుష్మాన్ ఖురానా (Ayushmann Khurrana)


ఒక్క సినిమా ఛాన్స్ కోసం ఎన్నో ఏళ్లు వేచి చూసానని.. అలాంటి సమయంలో ఓ దర్శకుడు ఆడిషన్స్‌కి పిలిచాడని.. తీరా వెళ్లిన తర్వాత నువ్వు నీ నీ ప్రైవేటు పార్ట్స్‌ను చూపిస్తేనే సినిమాలో ప్రధాన పాత్ర‌ ఇస్తానని చెప్పాడని చెప్పుకొచ్చాడు ఆయుష్మాన్. తనకు ఒక్క క్షణం ఏం అర్థం కాలేదని.. అక్కడ్నుంచి క్షణం కూడా ఆలోచించకుండా వెంటనే ఆయన ఆఫర్‌ను వదిలేసానని చెప్పాడు ఈ హీరో. అలా ఎన్నో సార్లు తాను తిరస్కరణలకు గురయ్యానని చెప్పుకొచ్చాడు ఈయన. ఒక్కరికే ఆడిషన్ అని చెప్పి.. ఒకేసారి 50 మందిని లోపలికి పిలిచేవారని.. దాన్ని వ్యతిరేకించినందుకు కూడా తిరిగి వెళ్ళిపొమ్మని చెప్పినట్లు గుర్తు చేసుకున్నాడు ఈయన.

ఆయుష్మాన్ ఖురానా (Ayushmann Khurrana)
ఆయుష్మాన్ ఖురానా (Ayushmann Khurrana)


అయితే నో చెప్పిన ప్రతీసారి తాను ఇంకా బలవంతుడినే అయ్యానని చెప్పుకొచ్చాడు ఈయన. తాను ఎదుర్కొన్న ఫెయిల్యూర్సే ఈ రోజు తనలో కసిని రగిలించాయని.. అదే తన ఆత్మస్థైర్యం అంటున్నాడు ఈయన. విక్కీ డోనర్‌ సినిమాతో 2012లో పరిచయం అయిన ఆయుష్మాన్ ఖురానా.. ఆ తర్వాత విభిన్న పాత్రలను ఎంచుకుంటూ బాలీవుడ్‌లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. గత రెండేళ్లుగా ఈయన సినిమాలన్నీ వరస విజయాలు అందుకుంటున్నాయి. ఈ మధ్యే విడుదలైన శుభ్ మంగళ్ జ్యాదా సావధాన్ కూడా పర్లేదనిపించింది. ఇందులో గే గా నటించాడు ఆయుష్మాన్.
Published by:Praveen Kumar Vadla
First published: