దీపిక పదుకొనే నటించిన తెలుగు సినిమా పేరు తెలుసా..?

Deepika Padukone: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనే తెలుగు సినిమా ఎప్పుడు చేసిందబ్బా అనుకుంటున్నారా..? నమ్మడానికి కాస్త విచిత్రంగానే అనిపించినా కూడా ఇదే నిజం. కెరీర్ మొదట్లో..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: June 11, 2020, 11:05 PM IST
దీపిక పదుకొనే నటించిన తెలుగు సినిమా పేరు తెలుసా..?
దీపిక పదుకొనే (Instagram/Deepika Padukone)
  • Share this:
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనే తెలుగు సినిమా ఎప్పుడు చేసిందబ్బా అనుకుంటున్నారా..? నమ్మడానికి కాస్త విచిత్రంగానే అనిపించినా కూడా ఇదే నిజం. కెరీర్ మొదట్లో చాలా మంది బాలీవుడ్ హీరోయిన్‌ల మాదిరే దీపిక కూడా ఓ తెలుగు సినిమాలో నటించింది. అయితే అది విడుదల కాలేదు.. పైగా పేరున్న దర్శకుడి సినిమాలోనే ఈమె ఐటం సాంగ్ చేసింది. అతడే జయంత్ సి పరాన్జీ. ఇదంతా పదేళ్ల కింద కథ. అప్పట్లో ఇంకా బాలీవుడ్‌కు వెళ్లలేదు ఈ భామ.
దీపిక పదుకొనే (Instagram/Deepika Padukone)
దీపిక పదుకొనే (Instagram/Deepika Padukone)


కన్నడలో కూడా ఉపేంద్ర హీరోగా వచ్చిన సినిమాలో హీరోయిన్‌గా నటించింది. ఆ సమయంలోనే తెలుగులో జయంత్ తెరకెక్కించిన లవ్ 4 ఎవర్ అనే సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది దీపిక. కానీ ఈ సినిమా ఎందుకో కానీ విడుదల కాలేకపోయింది. కానీ ఈ చిత్రంలో దీపిక మాత్రం స్పెషల్ సాంగ్ చేసింది.
దీపిక పదుకొనే (Instagram/Deepika Padukone)
దీపిక పదుకొనే (Instagram/Deepika Padukone)

దీనికి సంబంధించిన స్టిల్స్ విడుదలయ్యాయి కానీ పాటను కూడా విడుదల చేయలేదు దర్శకుడు జయంత్ సి పరాన్జీ. ఆ తర్వాత ఆమె బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ అయిపోయింది. షారుక్ ఖాన్ ఓం శాంతి ఓం సినిమాతో రాత్రికి రాత్రే స్టార్ అయిపోయింది దీపిక. ఆ వెంటనే ఆమె జర్నీ కూడా చెప్పాల్సిన అవసరం లేదు.
Published by: Praveen Kumar Vadla
First published: June 11, 2020, 11:05 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading