తెలుగు సినిమా రేంజ్ ఇప్పుడు పాన్ వరల్డ్ రేంజ్‌కు చేరుకుంది. దీంతో బాలీవుడ్ స్టార్స్ తెలుగు సినిమాల్లో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అమితాబ్ బచ్చన్, అజయ్ దేవగణ్, ఆలియా భట్, దీపికా పదుకొనె వంటి స్టార్స్ తెలుగు సినిమాల్లో నటిస్తున్నారు. వారు నటించేవి పాన్ ఇండియా సినిమాలే అయినా డైరెక్టర్స్, మేకర్స్, హీరోలు తెలుగువారు కావడం విశేషం. ఇప్పుడు వీరి రూట్‌లోకి మరో బాలీవుడ్ స్టార్ రీ ఎంట్రీ ఇచ్చాడు. ఆయనెవరో కాదు..అనుపమ్ ఖేర్. ఈయన నటించబోయే చిత్రం ‘కార్తికేయ 2’. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ధన్వంతరి అనే పాత్రలో అనుపమ్ ఖేర్ నటించబోతున్నారు.
ఈ బాలీవుడ్ స్టార్ తొలిసారి తెలుగులో నటిస్తున్నాడా? అంటే.. లేదు. 1986లో విడుదలైన త్రిమూర్తులు అనే చిత్రంలో ఓ డాన్ పాత్రలో కనిపించారు అనుపమ్ ఖేర్. అంటే దాదాపు ముప్పై ఐదేళ్ల తర్వాత అనుపమ్ ఖేర్ తెలుగులో నటిస్తున్నారన్నమాట. బాలీవుడ్‌లో విలక్షణ నటుడిగా పేరున్న అనుపమ్ ఖేర్ ఈ సినిమాలో నటించడం సినిమాకు మేజర్ ప్లస్ అవుతుందనడంలో సందేహం లేదు.
Team #Karthikeya2 ? welcomes one of India's most versatile actors on board!
Happy Birthday @AnupamPKher ji ?@actor_Nikhil @chandoomondeti @kaalabhairava7 @AbhishekOfficl @vivekkuchibotla @sahisuresh @MayankOfficl @peoplemediafcy @AAArtsOfficial#AnupamKherInKarthikeya2 pic.twitter.com/43QDLZSQA8
— People Media Factory (@peoplemediafcy) March 7, 2021
నిఖిల్, చందు మొండేటి కాంబినేషన్‌లో వచ్చిన థ్రిల్లర్ మూవీ ‘కార్తికేయ’కి సీక్వెల్‌గా ఇప్పుడు ‘కార్తికేయ 2’ రూపొందనుంది. కోవిడ్ కారణంగా ఈ సినిమా షూటింగ్ ఆలస్యంమైంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anupam Kher, Bollywood, Nikhil Siddharth