హోమ్ /వార్తలు /సినిమా /

Aamir Khan: కాకినాడలో అమీర్ ఖాన్.. అక్కడ ఏం చేస్తున్నాడంటే?

Aamir Khan: కాకినాడలో అమీర్ ఖాన్.. అక్కడ ఏం చేస్తున్నాడంటే?

కాకినాడలో అమీర్ ఖాన్

కాకినాడలో అమీర్ ఖాన్

Aamir Khan: బాలీవుడ్ స్టార్ నటుడు అమీర్ ఖాన్. ఈ మధ్య ఈయన పేరు వార్తల్లో బాగా వైరల్ గా మారిన సంగతి అందరికీ తెలిసిందే. తన రెండో భార్యకు విడాకులు ఇవ్వడం తో అమీర్ ఖాన్ బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాడు

Aamir Khan: బాలీవుడ్ స్టార్ నటుడు అమీర్ ఖాన్. ఈ మధ్య ఈయన పేరు వార్తల్లో బాగా వైరల్ గా మారిన సంగతి అందరికీ తెలిసిందే. తన రెండో భార్యకు విడాకులు ఇవ్వడం తో అమీర్ ఖాన్ బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాడు. ఎన్నో సినిమాలలో నటించి తన నటనకు మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతేకాకుండా పలు సినీ అవార్డులు కూడా సొంతం చేసుకున్నాడు. కేవలం నటుడిగానే కాకుండా దర్శకుడిగా, నిర్మాతగా కూడా బాధ్యతలు చేపట్టాడు. ఇక ఈయన ప్రస్తుతం కాకినాడలో ఉన్నట్లు తెలుస్తుంది.

1973 లో తొలిసారిగా ఇండస్ట్రీకి పరిచయమైన అమీర్ ఖాన్ ఇప్పటికీ ఇండస్ట్రీలో వయసుకు తగ్గ పాత్రలలో వరుస అవకాశాలతో కొనసాగుతూనే ఉన్నాడు. ఇక ప్రస్తుతం ఈయన అద్వైత్ చందన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న లాల్ సింగ్ చద్దా సినిమాలో నటిస్తున్నాడు. కామెడీ డ్రామా నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాను అమీర్ ఖాన్, రాధిక చౌదరి నిర్మిస్తున్నారు. ఇందులో కరీనా కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. నాగచైతన్య కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు.

ఇక ఇటీవలే లడఖ్ లో ఈ సినిమా షూటింగ్ కొంత భాగాన్ని పూర్తి చేశారు. ప్రస్తుతం మరో షెడ్యూల్ కోసం అమీర్ ఖాన్ కాకినాడ కు వెళ్ళాడు. ఇక ఒక వారం పాటు ఇక్కడే ఉండి షూటింగ్ పనులు జరుపుకుంటారని తెలుస్తుంది. ఇందులో నాగచైతన్య రొయ్యల బిజినెస్ చేస్తాడని.. అంతేకాకుండా నాగచైతన్య బాల పాత్రను పోషిస్తున్నట్లు తెలుస్తుంది.

ఈ నేపథ్యంలో నాగచైతన్య కుటుంబాన్ని లాల్ సింగ్ కలుసుకోవడానికి కాకినాడ ప్రాంతం సెట్ అవుతుందని.. ఇక్కడ కొన్ని సన్నివేశాలను చేయనున్నారు. ఇక ఈ ఏడాది ఈ సినిమాను విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సినిమాతో నాగచైతన్య ఎటువంటి సక్సెస్ ను అందుకుంటుండో చూడాలి. ఇక ఈ సినిమా నాగ చైతన్య కు మంచి గుర్తింపు అందిస్తే మాత్రం బాలీవుడ్ అవకాశాలు మరిన్ని వస్తాయని గ్యారెంటీ ఉంది.

First published:

Tags: Aamir Khan, Bollywood, Kakinada, Laal Singh Chaddha, Naga chaithanya, Tollywood

ఉత్తమ కథలు