విజయ్ దేవరకొండ సినిమాకు నో చెప్పిన హాట్ హీరోయిన్..?

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఫైటర్ సినిమా షూటింగ్‌లో బిజీగా గడుపుతున్నాడు విజయ్ దేవరకొండ. ఈ మువీలో విజయ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటిస్తోంది.

news18-telugu
Updated: March 5, 2020, 1:59 PM IST
విజయ్ దేవరకొండ సినిమాకు నో చెప్పిన హాట్ హీరోయిన్..?
దిశా పటానీ, విజయ్ దేవరకొండ
  • Share this:
విజయ్ దేవరకొండ సినిమా అనగానే క్యూ కట్టే యంగ్ హీరోయిన్లు ఎందరో ఉన్నారు. టాలీవుడ్‌లో ఈ రౌడీ స్టార్‌కు ఉన్న క్రేజ్ అది. రెండు, మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టినా తన స్టార్‌డమ్‌ను కాపాడుకుంటూనే ఉన్నాడు. అర్జున్ రెడ్డి లాంటి బ్లాక్‌బస్టర్, గీతాగోవిందం లాంటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో నటించి పక్కింటి కుర్రాడు అనిపించుకున్నాడు. వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో నలుగురు భామలతో స్టెప్పులేసినా.. ఆ సినిమా తుస్సుమనిపించింది. ఇప్పుడు పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఫైటర్ సినిమా షూటింగ్‌లో బిజీగా గడుపుతున్నాడు. ఈ మువీలో విజయ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటిస్తోంది. అయితే.. ఇప్పుడో వార్త బాలీవుడ్, టాలీవుడ్ సర్కిల్‌లో హల్‌చల్ చేస్తోంది. ఫైటర్ మువీలో ముందుగా ఓ బాలీవుడ్ బ్యూటీని అనుకున్నారని కానీ.. ఆమె నో చెప్పారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ హీరోయిన్ ఎవరో కాదు.. బాలీవుడ్ సెక్సీ హీరోయిన్ దిశా పటానీ.

దిశా పటానీ


దిశా పటానీ ఇప్పుడు బాలీవుడ్‌లో బిజీ హీరోయిన్. వాస్తవానికి ఆమెను వెండి తెరకు పరిచయం చేసింది పూరీ జగన్నాథే. ఆయనే ఈ హాట్ బ్యూటీని సినిమాల్లోకి తీసుకొచ్చాడు. మెగా హీరో వరుణ్ తేజ్ సరసన లోఫర్ సినిమాలో దిశా పటానీ నటించింది. ఆ సినిమా దర్శకుడు పూరీనే. ఫైటర్ సినిమా కోసం విజయ్ సరసన నటించాలని దిశా పటానీని చిత్ర బృందం కోరిందట. అయితే, ఆ ఆఫర్‌ను ఆమె సున్నితంగా తిరస్కరించిందట. దాంతో అనన్య పాండే ఎంట్రీ ఇచ్చిందని వార్తలు వస్తున్నాయి.

ananya pandey,ananya panday,ananya panday instagram,ananya panday boyfriend,ananya panday hot,ananya panday kiss,ananya panday movie,ananya panday kisses,ananya panday bikini,ananya panday lifestyle,ananya panday hot workout,ananya panday student of the year 2,అనన్య పాండే,స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ 2, అనన్య పాండే హాట్ ఫోటోస్
అనన్య పాండే (Photo: ananyapanday/Instagram)
Published by: Shravan Kumar Bommakanti
First published: March 5, 2020, 1:29 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading