అభిమానులకు ముద్దిచ్చిన సన్నీ లియోన్.. నా ఫ్యామిలీ కోట్ల మంది అంటూ..

Sunny Leone : ఇన్‌స్టాగ్రామ్‌లో 2.5 కోట్ల మంది ఫాలోయర్లను సంపాదించుకుంది. ఈ సందర్భంగా.. ‘ఇప్పుడు నా ఇన్‌స్టా కుటుంబం 2.5కోట్ల మందికి చేరుకుంది. ఇంకా బలపడుతోంది’ అంటూ ఓ వీడియోను పోస్ట్ చేసింది.

news18-telugu
Updated: August 23, 2019, 2:31 PM IST
అభిమానులకు ముద్దిచ్చిన సన్నీ లియోన్.. నా ఫ్యామిలీ కోట్ల మంది అంటూ..
సన్నీ లియోన్
  • Share this:
సెక్సీ బాంబ్ సన్నీ లియోన్ ఏది చేసినా సంచలనమే. సినిమా కెరీర్ తొలినాళ్ల నుంచే భారతీయ అభిమానుల గుండె దడను పెంచేసిన ఈ బ్యూటీ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకుంది. ఐటమ్ సాంగ్‌లతో, కైపెక్కించే చూపులతో ప్రేక్షకులను మత్తులో ముంచెత్తింది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ తన మధురానుభూతులను షేర్ చేసుకుంటున్న ఈ బ్యూటీ.. తాజాగా, ఇన్‌స్టాగ్రామ్‌లో 2.5 కోట్ల మంది ఫాలోయర్లను సంపాదించుకుంది. ఈ సందర్భంగా.. ‘ఇప్పుడు నా ఇన్‌స్టా కుటుంబం 2.5కోట్ల మందికి చేరుకుంది. ఇంకా బలపడుతోంది’ అంటూ ఓ వీడియోను పోస్ట్ చేసింది.

ఆ వీడియోలో ఈ విషయాన్ని స్పష్టం చేస్తూనే.. అభిమానులకు ముద్దులు ఇచ్చింది. ఇంత ప్రేమను అందిస్తున్న ఫాలోయర్లకు తాను కృతజ్ఞురాలినై ఉంటానని తెలిపింది. కాగా, సన్నీ ప్రస్తుతం హారర్ కామెడీ చిత్రం కోకా కోలా కోసం శ్రమిస్తోంది. మలయాళంలో రానున్న రంగీలా, తమిళం, తెలుగులో రానున్న వీరమహాదేవిలోనూ అలరించనుంది.

View this post on Instagram


Yoo hoo! We are now a 25 Million strong insta family and still going strong!! Thank you everyone for such much love and support 😘😍 #SunnyLeone #25MillionStrong


A post shared by Sunny Leone (@sunnyleone) on
First published: August 23, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు