ఇప్పుడు దిశాపటానిని చూస్తుంటే ఇదే అనిపిస్తుంది మరి. ఎప్పుడు చూడు బికినీ తప్ప మరో డ్రస్ లేనట్లు అవే వేసుకుని ఫోటోలకు పోజులిస్తుంది ఈ ముద్దుగుమ్మ. లోఫర్ సినిమాలో ఈమెను చూసినపుడు ఎవరూ అనుకోలేదు ఇంతగా రెచ్చిపోతుందని. బాలీవుడ్ నుంచి వచ్చిందని తెలుసు.. మోడలింగ్ బ్యాగ్రౌండ్ అని కూడా తెలుసు కానీ మరీ ఇంతగా రెచ్చిపోవడం ఒక్కటే పనిగా పెట్టుకుంటుందని మాత్రం ఎవరూ ఊహించలేదు. చేతి నిండా సినిమాలున్నా కూడా తన ఉనికి చాటుకోవడం కోసం దిశాపటాని అందాలను మాత్రమే నమ్ముకుంటుంది.
ఇప్పటికీ సోషల్ మీడియాలో కనీసం ఒక్కసారైనా బికినీ ఫోటో అప్‌లోడ్ చేయకపోతే అమ్మడుకు నిద్ర కూడా పట్టేలా లేదు. ఇప్పుడు కూడా ఇదే చేసింది. తాజాగా మరోసారి హాట్ ఫోటోస్ ఇన్‌స్టాగ్రామ్‌లో అప్ డేట్ చేసింది దిశా. దశాదిశా లేని ఈ అందాల ఆరబోత చూసి అంతా ఫిదా అయిపోతున్నారు. ఇప్పుడు దిశాపటాని పోస్ట్ చేసిన ఫోటోలు కూడా బాపురే ఏం భామరే అనుకుంటున్నారు. ఈ భామ కూడా సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ట్రెండ్ ఫాలో అవుతూనే ఉంటుంది.
ఈ మధ్యే సల్మాన్ ఖాన్ భారత్ సినిమాలో నటించింది దిశా. ఈ సినిమా ఫ్లాప్ కావడంతో అమ్మడు కెరీర్‌కు అనుకోని షాక్ తగిలింది. ఈ సినిమాతో పాటు మలాంగ్ సినిమాలో కూడా నటిస్తుంది ఈ బ్యూటీ. ఓ వైపు సినిమాలతో పాటు యాడ్స్‌లోనూ దిశాపటాని సూపర్ బిజీ. అసలు సినిమాల్లో అవకాశం వచ్చిందే యాడ్స్ చూసి. దాంతో ఇప్పుడు కూడా సినిమాలతో పాటు యాడ్స్ విషయంలో కూడా జాగ్రత్తగా ఉంది దిశా. అందాల ఆరబోత విషయంలో మాత్రం ఎక్కడా తగ్గడం లేదు ఈ బ్యూటీ.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Disha Patani, Telugu Cinema, Tollywood