రజినీకాంత్ ‘దర్బార్’లో విలన్‌గా బాలీవుడ్ హీరో.. ఇంతకీ ఎవరంటే..

‘దర్బార్’లో రజినీకాంత్

గత కొన్ని సినిమాల నుంచి రజినీకాంత్ ..తను యాక్ట్ చేసే ప్రతి సినిమాలో విలన్ గా బాలీవుడ్ నటులను తీసుకుంటున్నారు.తాజాగా ‘దర్బార్’ మూవీలో మరో బాలీవుడ్ హీరో విలన్‌గా నటిస్తున్నాడు.

 • Share this:
  గత కొన్ని సినిమాల నుంచి రజినీకాంత్ ..తను యాక్ట్ చేసే ప్రతి సినిమాలో విలన్ గా బాలీవుడ్ నటులను తీసుకుంటున్నారు.ఇప్పటికే రజినీకాంత్ హీరోగా నటించిన రోబో సీక్వెల్ 2.0లో అక్షయ్ కుమార్ విలన్‌గా పాత్రలో నటించారు. అంతకు ముందు రిలీజైన ‘కాలా’ మూవీలో రజినీకాంత్ కు విలన్ పాత్రలో నానా పాటేకర్ నటించారు. ఈ సినిమాలు ఆశించనంత విజయాన్ని నమోదు చేయలేదు. ఆ తర్వాత కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో చేసిన ‘పేట’లో కూడా బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దీక్ ప్రతినాయకుడి పాత్రలో నటించాడు. ఈ సినిమా తమిళంలో ఓ మోస్తరుగా నడిచినా..తెలుగులో మాత్రం ఆశించిన విజయాన్ని నమోదు చేయలేదు. తాజాగా ఇపుడు ఏ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో చేస్తోన్న ‘దర్బార్’ మూవీలో కూడా బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి విలన్ గా యాక్ట్ చేయబోతున్నట్టు సమాచారం. ఇప్పటికే ముంబాయిలో ఫస్ట్ షెడ్యూలు కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా రెండో షెడ్యూల్ .. ఈనెల 29 నుంచి మొదలు కానుంది. ఈ షెడ్యూల్లో సునీల్ శెట్టి నటించే అవకాశాలున్నాయి.

  Bollywood Senior Hero Sunil Shetty play villain role in rajinikanth,a.r.murugadoss Darbar Movie,rajinikanth,darbar,darbar rajinikanth,sunil shetty,sunil shetty vilan in rajinikanth darbar movie,rajinikanth sunil shetty,sunil shetty twitter,rajinikanth twitter,nayanathara,nayanathara twitter,nayanathara rajinikanth,darbar rajinikanth arm,rajinikanth darbar,darbar trailer,darbar first look,darbar teaser,rajini darbar,darbar official teaser,darbar breakdown,darbar movie,rajinikanth ar murugadoss movie,darbar rajini film,darbar motion poster,darbar ar murugadoss,darbar latest update,superstar rajinikanth,rajinikanth latest speech,thalaivar rajinikanth 167,rajini,darbar shooting spot,kollywood,దర్బార్,దర్బార్ ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్,రజినీకాంత్,రజినీకాంత్ దర్బార్,రజినీకాంత్ సునీల్ శెట్టి,రజినీకాంత్ దర్బార్ లో విలన్ గా సునీల్ శెట్టి,నయనతార,నయనతార రజినీకాంత్,తెలుగు సినిమా,తమిళ సినిమా,కోలీవుడ్,
  దర్బార్‌లో విలన్‌గా సునీల్ శెట్టి


  వచ్చే సంక్రాంతికి రిలీజ్ కానున్న ఈ సినిమాలో రజినీకాంత్ సరసన నయనతార నటిస్తోంది. మరో ముఖ్యపాత్రలో నివేదా థామస్,దలీప్ తాహిల్,ప్రతీక్ బబ్బర్ నటిస్తున్నారు. లైకా ప్రొడక్షన్ నిర్మిస్తోంది.

   

   

   
  First published: