హోమ్ /వార్తలు /సినిమా /

Raveena Tandon: తండ్రికి అంత్యక్రియలు నిర్వహించిన బాలీవుడ్ సీనియర్ హీరోయిన్..

Raveena Tandon: తండ్రికి అంత్యక్రియలు నిర్వహించిన బాలీవుడ్ సీనియర్ హీరోయిన్..

తండ్రికి అంత్యక్రియలు నిర్వహించిన రవీనా టాండన్ (raveena tandon)

తండ్రికి అంత్యక్రియలు నిర్వహించిన రవీనా టాండన్ (raveena tandon)

Raveena Tandon: సాధారణంగా తండ్రి చనిపోతే కొడుకులు తలకొరివి పెడుతుంటారు. అది ఆచారం.. కానీ ఇక్కడ మాత్రం ఓ బాలీవుడ్ హీరోయిన్ రవీనా టాండన్ (Raveena Tandon) తన తండ్రికి అంత్యక్రియలు నిర్వహించింది.

సాధారణంగా తండ్రి చనిపోతే కొడుకులు తలకొరివి పెడుతుంటారు. అది ఆచారం.. కానీ ఇక్కడ మాత్రం ఓ బాలీవుడ్ హీరోయిన్ తన తండ్రికి అంత్యక్రియలు నిర్వహించింది. సీనియర్ హీరోయిన్ రవీనా టాండన్ గురించి పరిచయాలు అవసరం లేదు. తెలుగులోనూ ఈమె కొన్ని సినిమాలు చేసింది. ఇక్కడ కూడా గుర్తింపు ఉంది ఈమెకు. తాజాగా రవీనా తండ్రి, ప్రముఖ రచయిత, దర్శక నిర్మాత అయిన రవి టాండన్ కన్నుమూసారు. కొన్ని రోజులుగా శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో బాధ పడుతున్న ఆయన.. ఫిబ్రవరి 11న ముంబై హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణించారు. ఈయన వయసు 85 సంవత్సరాలు.

రవి టాండన్ మరణంతో ఒక్కసారిగా బాలీవుడ్‌లో విషాద ఛాయలు అలముకున్నాయి. రవీనా టాండన్‌ను ప్రముఖులు వచ్చి ఓదారుస్తున్నారు. ఇదిలా ఉంటే తండ్రి దహన సంస్కారాలను రవీనా టాండన్ పూర్తి చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలతో పాటు వీడియోలు కూడా సోషల్ మీడియాలో అవుతున్నాయి. తండ్రి మృతిఫై రవీనా ఎమోషనల్ అయింది.


ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ లేఖను కూడా విడుదల చేసింది ఈమె. ప్రతి క్షణం నువ్వు నాతోనే ఉంటావు.. నన్ను, నువ్వే దగ్గరుండి అడుగు వేయిస్తావ్ అంటూ నాన్నను తలుచుకుని కన్నీరు పెట్టుకుంది రవీనా టాండన్.


రవి టాండన్ మృతి పట్ల బాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. 1963లో సునీల్ దత్ నిర్మాణంలో 'యే రాస్తే హై ప్యార్ కే'తో ప్రారంభమైన తన కెరీర్‌ ప్రారంభించారు రవి టాండన్. ఆ తర్వాత ఆయన పెద్ద హీరోలతో కూడా పని చేసారు. 'ఖేల్ ఖేల్ మే,' 'అన్హోనీ లాంటి చాలా సినిమాలను తెరకెక్కించారు రవి టాండన్. ,' 'నజరానా', 'మజ్బూర్', 'ఖుద్-దార్', 'జిందగీ లాంటి హిట్ సినిమాలు రవి టాండన్ ఖాతాలో వున్నాయి. ఆయన మంచి ఫామ్‌లో ఉన్నపుడే కూతురు రవీనా టాండన్‌ను కూడా ఇండస్ట్రీకి హీరోయిన్‌గా పరిచయం చేసాడు. తెలుగులో రథసారధి, బంగారు బుల్లోడు, ఆకాశ వీధిలో, పాండవులు పాండవులు తుమ్మెద లాంటి సినిమాలు చేసింది ఈమె.

First published:

Tags: Bollywood, Hindi Cinema, Raveena Tandon

ఉత్తమ కథలు